కరిగించిన సీసం - మీ చెవుల్లో

ఇది జంధ్యాలగారి సీసం. సినిమా జంధ్యాల కాదు. మనకు తెలిసిన ఇంకో జంధ్యాల. 'పద్యం పైకెళ్లిందిగానీ సరిగా కిందకు దిగినట్టులేదే' అనిపిస్తోందా? టేకాఫ్ కానీ, లాండిగ్ కానీ ఆ మధ్యలో ఇంకేవిన్యాసాలైనాగానీ అత్యుత్తమంగా చేయగల మహా పైలెట్‌తో -- ఒక్కసారి విమానం నడిపిచూడాలనుకునే మానవుని పోల్చినప్పుడు అలానే అనిపిస్తుంది మరి! :-)


ఒడెయోతో శక్తిమంతం

కామెంట్‌లు

Sriram చెప్పారు…
సెబాసీ!
వన్సుమోరు ఓడియోనడిగితే చాలు కనక మిమ్మల్ని అడిగేది, వన్మోర్!
భాను చెప్పారు…
Same to same as Sriram
Unknown చెప్పారు…
అదరగొట్టేసావు! నీ గొంతు బాగుంది.
నీ ఇంతకు ముందు పాట కూడా మొన్నే విన్నా. అది ఇంకా బాగుంది.

పైన పెట్టు!
teresa చెప్పారు…
బావుంది.
రవి వైజాసత్య చెప్పారు…
శెభాష్ బాగుంది బాగుంది ఈ సారి ఆస్వాదించడానికే సరిపోయింది ఇంకో నాలుగు సార్లు వచ్చి అర్ధంచేసుకోవటానికి ప్రయత్నిస్తా..ఇది కొత్తపాళీ గారు రాశారా?
కొత్త పాళీ చెప్పారు…
అయ్యబాబోయ్!
నాకసలు పద్యాల్రాయడం రాదండీ బాబు. ఏదో కుర్రాళ్ళు పద్యాలగురించి సరదా పడుతుంటే సలహాలు చెబుతుంటాను, అంతే .. అదేదో సామెతుంది చూశారూ .. చెయ్యగలవాళ్ళు చేస్తారు, చెయ్యలేని వాళ్ళు ఎలా చెయ్యాలో పాఠాలు చెబుతారూ అని :-)
rākeśvara చెప్పారు…
ఐతే మీరు కూడా
కో.పా ౧౦౩ - పాటల తరగతి
లో చేరారన్న మాట, నన్ను
కో.పా ౧౦౧ - పద్యాల తరగతి
లోకి మీరు లాగగలిగారు గాని, నాకు పాట అసాధ్యం, అది దేవుల పని అని నా నమ్మకం, కావాలంటే గంతులు వేయగలను.
కో.పా ౧౦౪ - గొంతుల తరగతి
లో :)

కూర్చుండ మాయింట, పాడాల్సిన పాటే పాడారు.
నాకు వచ్చిన మూడ సీసాలలో ఒకటి :)
వినే భాగ్యం నా డయిల్ అప్ కనక్షన్ కి లేదు కానీ
చాలా బానే ఉంటుందని నమ్మకం.
rākeśvara చెప్పారు…
ఎలానో దింపి విన్నాను.
నిఝ్ఝంగా చాలా బాగుంది.

కుషను పెట్టానుగా ఇక కొట్టడం :)
మొదటి పాదంలో " అంకమే సిద్ధ పరచనుంటి" కొద్దిగా వియర్డు గా అనిపించింది, కావాలని అలా పాడారా ?

- ఒ నిమిత్తమాత్రుడు
చదువరి చెప్పారు…
బాగా పాడారు!
అజ్ఞాత చెప్పారు…
వావ్... వింటుంటే గమ్మత్తుగా అనిపించింది... నేనెప్పుడు పాడానా అని. నా (మైకు) గొంతు దాదాపు ఇలాగే ఉంటుంది (కొంచెం చెత్తగా!)
రవి వైజాసత్య చెప్పారు…
నన్ను కొ.పా కోర్సులు చెయ్యటానికి ముందు ప్రీరెక్స్ చేసి రమ్మని పంపారు..ఈ ప్రీరెక్స్ ముగించుకొని ఎప్పుడో ఒకసారి మీతోపాటు కొ.పా ౧౦౧ కొ.పా ౧౦౪ లలో చేరతాను..కొ.పా ౧౦౩ మరీ అడ్వాన్సుడూ!! ;-)
రానారె చెప్పారు…
అందరికీ వంద థాంకులు. మీరంతా కరుణామయులు. ఏసుప్రభువు లాగా. మీ అండ చూసుకొని నా మిత్రునికి ధైర్యంగా వినిపించాను. మొదలయ్యీకాకముందే, - "ఆపెయ్! ఆపెయ్ దాన్ని" అని అరిచాడు. Low aim is crime అన్నాడు. :-) రాకేశుడుమాత్రం కొంచెం తక్కువ కరుణామయుడు. కొన్నిసార్లు విని, పాడి, రికార్డుచేశాను. అంతకుమించి ఇంకే దుర్మార్గమూ లేదు. ఆ సంగతి సరే, కొపా-౧౦౧,౧౦౩,౧౦౪ తెలుసు. ౧౦౨ తరగతి లేదా?

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము