బ్లాగు నవ్వ
ఆ తరువాత నేను Little Prince వైపు కన్నెత్తికూడా చూడలేదు. తల పక్కకు తిప్పడానికి కూడా వీల్లేనంతగా ఆఫీసులో పని పెరిగిపోయింది.
నిజానికి ఇప్పుడు కూడా నేను పనిలో ఉండాలి. మరీ ఆటవిడుపు లేకపోతే పనిమీద కూడా మనసు నిలవదనే సాకుతో నాకు నేనే నచ్చజెప్పుకుని ఈ టపా రాస్తున్నాను. సాయంత్రానికి మెదడు అలసిపోతోంది. రోజులు క్షణాల్లాగడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితినే నేనిన్నాళ్లూ కోరుకున్నది. బాగుంది కానీ, కూడలిలో తెగతిరిగే నాకు ఇప్పుడు కాళ్లు కట్టేసినట్లుంది. ఇంకొక ముఖ్యమైన రాతపని కూడా ఉంది. అదీ ముందుకు కదలడం లేదు.
సాయంత్రం కొంతసేపు "ప్రథమావిభక్తిరహిత సుగ్రీవాగ్రజసుతక్రీడ" ఆడుకోవడమూ అలసిపోయి మాంచి నిద్రలోకి వెళ్లిపోవడమూ. వంటచేసే ఓపిక అసలుండదుకనుక "కలిగినదేదో కనులకద్దుకొని కాలము గడిపే" ధన్యజీవనము చేస్తున్నాను. తలమునకలుగా పని, అలసిపోయేదాక ఆట, ఆదమరపుగా నిద్ర - ఇంతకన్నా ధన్యజీవనం ఇంకేమున్నది!
ఇంతకూ ఈ టపా పేరులోని నవ్వ అంటే ఏమిటో తెలుసా!?

కామెంట్‌లు
చెప్పి నాకీ హింస తప్పించి పుణ్యం కట్టుకోండి.
ఇంతకీ, సాయంత్రాల్లో నేను ఆడే ఆటపేరు ఏమిటో గడులు నింపేవారు చెప్పనేలేదు!
కండూతి ఈ జాబితాలోనిదేనంటావా త్రివిక్రమ్!?
"అంగద(జు కాదు)కేళి" అంటే తమాషాగా కోతికొమ్మచ్చి అనుకోండి. అలసిపోయేదాక రోజూ సాయంత్రంపూట ఆడేది ప్రస్తుతానికి ద-కేళీకాదు, జు-కేళీ కాదు. మరేమిటో ఆచార్యులు పసిగట్టేశారు. ఆయనమాటల్లోనే మీరూ వెదకండి. కార్యసిద్ధిరస్తు! :-)
భవదీయ
సుగ్రీవదూతాస్యదేవపతి.
నవీన్ - మదనపల్లె, అమెరికా - ఈ రెండూ కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాలు నువ్వు తిరగాల్సి ఉంది ;-) చిత్తూరు, కడప జిల్లాల మాండలికాల్లో చాలా తేడా ఉంది. ఆమాటకొస్తే కడపలోనే ఒకటికంటే ఎక్కువ మాండలికాలు కనబడతాయి - కడప కనుమ అవతల ఇవతల.
అప్పుడెప్పుడో ఒక అవధానంలో .. "క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్" వీటిని ఉపయోగించి రామాయణ పరంగా పద్యం చెప్పమన్నారు .. అందులో రాంఉడు వాలితో అంటున్నట్టు .."వాళీ! బాలుని వోలె పల్కెదేల?.." అని పూరించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.