ఇందుకూరి వారు
కొలిచారు తొలిమారు
దేవతగ నీ పేరు
ఓ గూగులమ్మా!
నిన్ను తలవని వాడు
ఇంజనీరే కాడు
ఇకపైన మనలేడు
ఓ గూగులమ్మా!
తలచినంతనె నీవు
ప్రత్యక్షమౌతావు
జగమెల్ల నీ తావు
ఓ గూగులమ్మా!
గాలించి లోకాలు
గుదిగుచ్చి విషయాలు
చేయుచుంటివి మేలు
ఓ గూగులమ్మా!
పలుకంగ నీ పేరు
మా పనులు నెరవేరు
గ్రామదేవత తీరు
ఓ గూగులమ్మా!
నుడువంగ నీ కీర్తి
ఆరుద్ర యే స్పూర్తి
రానారె విద్యార్థి
ఓ గూగులమ్మా!
Sunday, June 03, 2007
Subscribe to:
Post Comments (Atom)
10 వ్యాఖ్యలు:
wow! చాలా బావుంది.
వావ్! గూగులమ్మ పదాలు గమ్మత్తుగా వున్నాయి. జోడించండి మరికొన్ని.
--ప్రసాద్
http://blog.charasala.com
కూనలమ్మకి ఎక్కడా తీసిపోలేదు.ఇంత చెప్పి విద్యార్ధి అంటే ఒప్పుకుంటామా?
అడగంగనె నిన్ను
ఇచ్చేవు అన్నీ
జై గూగులమ్మా
జై జై గూగులమ్మా...
ఆహా! గూగులమ్మ పదాలు భలే ఉన్నాయి. :)
ఆరుద్రగారి స్ఫూర్తితో గూగులమ్మని ఇలా ఉపాసిస్తే ఆవిడ త్వమేవాహం అని తప్పకుండా అంటుంది :)
నీ మిగతా రచన్లన్నీ ఒకెత్తు - ఇదొక్కటీ ఒకెత్తు.
పద్యం నడకనీ, పొందికనీ భలే పట్టుకున్నావు.
మెప్పుతోటే ఒక చిన్న ఎసైన్మెంటు - ఎలాగూ మొదలెట్టవు కాబట్టి ఒక వందైనా రాయి - వాయిదాల పద్ధతిలోనైనా సరే.
vidyaardhi anToonae brahmaanDaMgaa raasaaru raamanaadha reDDigaaru.
వావ్... సూపర్
meeru raasarani naaku teleedu. evarO ceppagaa vinnaanu. ee madhyanE raasinavi konni.
వింతల్లో వింత
గ్లోబు చివర వార్త
లిప్తలో నీ చెంత
ఓ గూగులమ్మా
చేతి చివర జగతి
చేర వేయు వినతి
చిటికలో నీ పాదక్రాంతి
ఓ గూగులమ్మా
స్టాంపు లేని వ్రాలు
మోసుకెళ్ళు దేశాలు
మేలు చేసే మెయిలు
ఓ గూగులమ్మా
పేరు చెప్పి వెతుకు
సారమైన పితుకు
వేగవంతమైన బ్రతుకు
ఓ గూగులమ్మా
వయసు మీర కోరిక
పెళ్ళి చూపుల వేదిక
ఖర్చు లేని వేడుక
ఓ గూగులమ్మా
- సాయి బ్రహ్మనందం గొర్తి
Post a Comment
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.