మంచిపేరు - చెడ్డపేరు - సౌఖ్యం
... అందులో ఆయన నా మస్తిష్కంలో జరుగుతున్న మధనాన్నే ప్రస్తావించారు. మనం చూసే సినిమాల్లో సాధారణంగా హీరో పేదవాడైనా ధనికుడైనా మంచివాడు. అతడికి అమాయకురాలైన చలాకీ చెల్లెలు, ఒక తల్లి, ఒకరిద్దరు ప్రియురాళ్లు ఉండే అవకాశాలు ఎక్కువ. అతడు మంచికి మారుపేరు, నిజాయితీకి నిలువుటద్దం. ఆత్మాభిమానం అతని అందం. అందరికీ తలలో నాలుక, ఆపద్బాంధవుడు వగైరా వగైరా. అతని మార్గం కఠినం. కష్టపడి పని చేసి సంపాదిస్తాడు. అవసరంలో ఉన్నప్పుడు ఆ సంపాదనే నలుగురికీ పంచుతాడు. నిజంగానే మంచివాడే అయినా, "నువ్వు చాలా మంచివాడివి నాయనా, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు" అంటే ఇబ్బందిగా మొహమాటంగా కదిలి అంతా "మీ అభిమానం" అని సిగ్గును అభినయిస్తాడు. అతనికి చెల్లెలు గుర్తుకొస్తుంది. అదే సమయంలో ఏ పొలంగట్టునో, కాలేజీలోనో, సందు చివరో విలన్‌గానీ వాడి కొడుకుగానీ ఈమెను చూస్తాడు. తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. దగ్గరికెళ్లి "నువ్వూ పారేసుకో" అంటాడు. అన్నయ్య నేర్పిన ఆత్మాభిమానంతో ఆ చెల్లెలు వాణ్ణి దులిపేస్తుంది. "ఎంత పొగరు" అంటాడు విలన్‌గాడి చెంచా. స్థితప్రజ్ఞుడిలా సర్వజ్ఞుడిలా పోజిచ్చి "పొగరేరా ఆడదానికి అం