తైత్తరీయ ఉపనిషత్తు - మార్గ నిర్దేశం

"సహనావవతు" - కలసి జీవింతుముగాక.
"సహనౌభునక్తు" - కలసి భుజింతుముగాక.
"సహవీర్యం కరవావహై" - మన శక్తులన్ని కలిపి పని చేయుదముగాక.
"తేజస్వినావధీతమస్తు" - విద్వత్తుతో వెలుగొందుదముగాక.
"మా విద్విషావహై" - మన మధ్య విద్వేషములు లేకుండుగాక.
"ఓం శాంతి శాంతి శాంతిః"

"సహనావవతు" - May we live together.
"సహనౌభునక్తు" - May we enjoy our lives together.
"సహవీర్యం కరవావహై" - May we put our energies together and work.
"తేజస్వినావధీతమస్తు" - May we be illumined by study.
"మా విద్విషావహై" - May we not hate each other.
"ఓం శాంతి శాంతి శాంతిః" - O peace peace peace.

చూ: వేదఘోష - సత్యశోధన - వేదాల్లో ఏంకావాలిష?

కామెంట్‌లు

హిందువులుగా వేదాలకి అనుగుణంగా మనం నడుచుకోవాలి.అంటె మనం శ్రమ తీసుకుని వాటిని స్వయంగా అభ్యసించాలి.అవి మన స్థాయిలోనే ఉండాలని ఆశించకూడదు.వాస్తవానికి అవి 20-21 వ శతాబ్దాల మనుషుల కంటె ఉన్నత స్థాయికి చెందిన మనుషుల చేత దర్శించబడ్డాయి.మతం అనేది "దొంగతనం చెయ్యొద్దు.వ్యభిచరించొద్దు.పక్కవాణ్ణి దూషించొద్దు.ఎవరినీ చంపొద్దు.అబద్ధమాడొద్దు." అని చెప్పడానికి పరిమితమైతే అసలు మతంతో పనే లేదు.వేదాల ఉద్దేశం అది కాదు.మానవాత్మని అంతకంటె higher plane కి తీసుకెళ్ళడమే వాటి లక్ష్యం.

మన కాలం నాటికి వేదాలు చాలావరకు నశించాయి. ఇందుకు అనేక కారణాలు.

1. వాటిని ఇటీవలి వరకు - అంటే 19వ శతాబ్దం దాకా కాయితాల మీద రాయడం జరగలేదు. అలా రాస్తే పాపమొస్తుందని బ్రాహ్మణులు oral గా నేర్చుకుని oral గానే ఇతరులకి నేర్పేవారు. ఆ నేర్చుకున్నవాడు అల్పాయుష్కుడైతే అంతటితో ఆ వేదభాగం గోవిందా ! పుస్తక రూపంలో లేకపోవడం చేత బ్రాహ్మణుల్లోనే చాలా మందికి వేదాలు వచ్చేవి కావు

2. ఏ బ్రాహ్మణుడూ పూర్తిగా నాలుగు వేదాల్నీ నేర్చుకోలేదు. బ్రాహ్మణ కులం ఋగ్వేదులుగా యజుర్వేదులుగా సామవేదులుగా చీలిపోవడతో ఎవరి వేదాన్ని వారు నేర్చుకున్నారు తప్ప మిగతా వేదాల సంగతి పట్టించుకోలేదు. ఆ ఋగ్వేదుల్లోను సామవేదుల్లోను కూడా చాలా మంది కొన్ని అధ్యాయాలకే పరిమితమయ్యారు.

దీని గురించి విపులంగా నా బ్లాగులో ఎప్పుడైనా రాస్తాను.

ఇది పూర్తిగా మీ టపాకి స్పందన కాదు. ఈ మధ్య జరుగుతున్న చర్చలో ఒక భాగం.
హమ్మయ్య, ఇప్పటికి మాస్టారు (బాసు)రంగంలోకి దిగారు. ఇలాంటి చర్చలకి పదును పెట్టగల ఒక వ్యక్తి. సాలభంజికలు కూడా దిగితే బాగుంటుందేమో.
spandana చెప్పారు…
చర్చ రసవత్తరంగా సాగుతుందన్నమాటిక!
నా ఆయుధాలని ఒకసారి తడుముకోవాలి! :)

--ప్రసాద్
http://blog.charasala.com
అజ్ఞాత చెప్పారు…
raanaare gaaru,

I'm glad you took my words in spirit. I'm assuming that my words had a role. It could be your own idea too. Anyway, thanks for trying to spread the good words.

SubrahmaNyam gaaru, can you please elaborate on the above SlOkam?

regards,
lalitha.
రానారె చెప్పారు…
వేదం - అంటే తెలిసినది అని అర్థమని మా నాయన నాకు చెప్పాడు. ఈ టపాలో ఉన్నది, దాని ఆంగ్లానువాదమూ ఆయన చెప్పిందే. దాని తెలుగుసేత మాత్రమే నాది.

తాడేపల్లిగారు అన్నారు - "వేదాల ఉద్దేశం అది కాదు.మానవాత్మని అంతకంటె higher plane కి తీసుకెళ్ళడమే వాటి లక్ష్యం." ఇది ఉపయోగపడే మాట. మనిషిని మతానికి అతీతంగా తీసుకెళ్లడం అంటే - ఒక మతానికో, కులానికో, జాతికో, దేశానికో, వంశానికో చెందినవానిగా గుర్తింపబడటం కాక - సమాజానికి చెందిన వానిగా, సమాజంలోని అందరి శ్రేయస్సుకు అందరితోబాటు పాటుపడే వ్యక్తిగా తీర్చడమేనా వేదాల ఉద్దేశం? ఇది వేదాల పని అయితే, అవి చేస్తున్నది మనిషిని మళ్లీ మనిషిగా మార్చడమే, ఔనా!
రాధిక చెప్పారు…
స్కూల్ లో మాకు మొదట నేర్పింది ఇదే.
rākeśvara చెప్పారు…
ఇన్నాళ్ళకు తెలిసింది భావం.
తెలిపినందుకు కృతజ్ఞతలు.
అజ్ఞాత చెప్పారు…
ఈ టపాను కూడా జతచేస్తున్నాను. గమనించగలరు.
రానారె చెప్పారు…
వేదాల్లోది కాదిది, తైత్తరీయోపనిషత్తులోది ఈ ప్రవచనం. క్షమించాలి.
Sky చెప్పారు…
దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం మా బడిలో రోకూ ఇది చదివెవాళ్ళం. దాని వెనక ఇంత అర్ధం ఉందన్న సంగతి మాత్రం ఇప్పుడే తెలుసుకున్నాను. మళ్ళీ నా బడిని, అది నేర్పిన సంస్కారాన్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

భవదీయుడు,

సతీష్ యనమండ్ర

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము