ఆటవెలదితో నా ఆటలు

ఆటవెలదినిగాని తేటగీతినిగాని
చెప్పవలెనను చిన్ని కోర్కెగలిగె!
చెప్పబోతినిగాని ఛందస్సుదెలియదే
యేమిసేతుర లింగ యేమిసేతు!!

గంగిగోవుపాలు గరిటెడైననుచాలు
కడివెడైననేమి ఖరము పాలు!
భక్తిగలిగిన కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ!!

వేమన పద్యాలు వినీవినీ ఆ నడకలోనే నేను మాత్రం ఒక పద్యం నడపలేనా అనిపించి ఇలా నడిపించేశాను. ఇది ఆటవెలదియో లేక ఆట"వెలది" అయిందో తెలియజేసి పెద్దలు తమ ఆశీర్వాదాలో లేదా "అక్షింతలో" ప్రసాదించ ప్రార్థన. వాటితో పాటు ఆటవెలది లక్షణాలేమిటోకూడా తెలిసినవారు వివరించవలసిందని అర్థిస్తున్నాను. కృతజ్ఞతలు.
- రానారె

కామెంట్‌లు

yuvasri చెప్పారు…
నాకూ చందస్సు తెలియదు గాని పద్యం నడక చాలా బగుంది.విన సొంపుగావుంది.లింగడు తప్పక ఆశీర్వదిస్తాడు.
జాబాలిముని
రానారె చెప్పారు…
జాబాలిమునిగారూ, మీ ఆశీర్వచనం ఫలించింది. ధన్యుణ్ణి. :)
rākeśvara చెప్పారు…
మీరు ఇప్పటి వఱకూ ఆటవెలది వ్రాయలేదా ?
చాలా ఆశ్చర్యంగా వుందే. అన్నిటికైనా తేలికైన పద్యరీతి.
భువనవిజయానికి సీసాలు బద్దలగొట్టారు మఱి, ఆటవెలది పెద్ద లెక్క కాదు. తెవికీలో చూడండి ఛందస్సు.

ఆట-వెలది-గాని -- తేటగీ-తినిగాని
చెప్ప-చూడ-చిన్ని -- కోర్కె-గలిగె!
చెప్ప-బోతి-గాని -- ఛందస్సు-దెలియదే
యేమి-సేతు-లింగ -- యేమి-సేతు!!
ఇలా మారిస్తే గణాలు సరిపోతాయి (౨,౩ లలోఁ యతి కుదరలేదు)
రానారె చెప్పారు…
కాదు రాకేశ్వరా, నేను ముందుగా ప్రయత్నించినది ఆటవెలదినే. ఈ టపా సంవత్సరం కిందటిది. నిన్న నా పాత టపాలు అలా తిరగేస్తూవుంటే జాబాలిమునిగారి ఆశీర్వాదం కనబడింది. ఈ సంవత్సర కాలంలో ఆట,తేట,కంద,సీసాలను నాలుగింటిని రాయగలిగాను. ఇప్పుడైనా కృతజ్ఞతలు చెబుదామని, ఆశీర్వాదం ఫలించిందని రాశాను. ఈ టపా కట్టిన మూడురోజుల తరువాత నేను రాసిన మొదటి ఆటవెలది ఇదుగో.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు