కీలకం

ఈనాటి ఈనాడు పత్రికలోని ఒక వ్యాసం నుంచి కొన్ని అంశాలు:

శృంగారం... మనసుల భేటీ. తనువుల పోటీ! ఆ భేటీలో... ఇరు మనసులు మరింత దగ్గరవుతాయి. మనువుకు అర్థం అంతేగా! ఆ పోటీలో... ఇద్దరూ విజేతలవుతారు. 'ఆనందోబ్రహ్మ' అదేగా! నవతరం దంపతులారా... ఆ ఆనందానుభూతుల్ని దూరం చేసుకోకండి. పరుగుల జీవితంలో శృంగారం నిషిద్ధఫలం కాదు... సిద్ధాన్నం! నిండు జీవితానికి ఓ వరం. అందుకోండి. ఆస్వాదించండి. ఆనందంగా గడపండి. ఆరోగ్యంగా ఉండండి.

ఇంట్లో పరిపూర్ణ శృంగారాన్ని అనుభవిస్తున్నవారే ఆఫీసులో చక్కగా పనిచేస్తారు. చిటపటలాడకుండా చిరునవ్వుతో మెలుగుతారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ వారికే. ‌ సెక్స్‌కు దూరంగా ఉండేవారిలో ఓరకమైన అశాంతి కనిపిస్తుంది. అది వారిని స్థిమితంగా ఉండనీదు. ప్రశాంతంగా పని చేయనీదు.

ఆక్సీటోసిన్‌ వారిద్దరిమధ్యా ఉన్న అనురాగాన్ని పదిరెట్లు పదిలం చేస్తుంది. 'నాకు నువ్వు... నీకు నేను' అన్న భావన బలపడేది పడకగదిలోనే. 'ఇదో గొప్ప భావవ్యక్తీకరణ' అంటారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన క్లినికల్‌ సైకాలజిస్టు జాన్‌ మ్యారో.

ప్రణయానికీ వాసన గ్రహించే శక్తికీ సంబంధం ఉంది. శృంగారం వల్ల శరీరంలో ప్రొలాక్టిన్‌ అనే హార్మోన్‌ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దాని ప్రభావం వల్ల మన ఘ్రాణశక్తి మరింత పెరుగుతుందట!

సెక్స్‌లో విడుదలయ్యే టెస్టోస్టెరాన్‌ కండరాలకూ ఎముకలకూ శక్తినిస్తుంది. ఊబకాయులు సన్నబడటానికి ప్రణయమూ ఓ మార్గమే.

కుర్రకారుతో పోటీపడాల్సిన పనేం లేదు కానీ, వయోధికులూ తమకున్న పరిమితుల్లో శృంగార జీవితాన్ని అనుభవించవచ్చని చెబుతున్నారు నిపుణులు. ముద్దులు, కౌగిలింతలే కావచ్చు... వాటివల్ల వారిలో కొత్త ఉత్సాహం వస్తుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. 'ఈ వయసులోనూ మీరు శృంగారం పట్ల ఉత్సాహం చూపితే కొన్నిరకాల కీలక హార్మోన్లను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని మీ శరీరం కూడా గుర్తిస్తుంది' అని వయోధికులకు సలహా ఇస్తారు డాక్టర్‌ బ్రాడ్లే అనే వైద్యనిపుణుడు. అది చాలు రెండో యవ్వనంలోకి అడుగుపెట్టడానికి.

నిజంగా తలనొప్పి ఉన్నా దాన్ని క్షణాల్లో పోగొట్టే అమృతాంజనం సెక్స్‌! ఒక్క తలనొప్పే ఏం ఖర్మం, తల నుంచి పాదాల దాకా ఏ నొప్పులున్నా మటుమాయం కావాల్సిందే. భావప్రాప్తికి కాస్త ముందు మెదడులోని నొప్పిని నియంత్రించే కేంద్రం చురుగ్గా పనిచేస్తుంది. ఆ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లకు తలనొప్పి నుంచి కీళ్ల నొప్పులదాకా ఏ నొప్పినైనా మాయం చేసే శక్తి ఉంది. జలుబుతో చికాకుపడుతున్నవారికీ ప్రణయమే మందని చెబుతున్నారు అమెరికాలోని విల్కీస్‌ యూనివర్సిటీ పరిశోధకులు. సెక్స్‌లో చురుగ్గాపాల్గొనే వారిలో ఇమ్యునోగ్లోబులిన్‌-ఎ అనే యాంటీ బాడీ 30 రెట్లు అధికంగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల రోగనిరోధకత అధికం అవుతుంది.

శృంగారానుభూతుల వల్ల విడుదలయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌కు ఒత్తిడిని దూరం చేసే శక్తి ఉంది. ఈ 'మన్మథ హార్మోన్‌' భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని మరింత పదిలం చేయగలదట. ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే... మరుసటిరోజు అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ముందురోజు రాత్రి హుషారుగా శృంగారంలో పాల్గొంటే చాలట! అన్నిచోట్లా 'వన్స్‌వోర్‌'లే!

'రొమాంటిక్‌ హార్మోన్లు'... డీహైడ్రోఎపీఎండ్రోస్టోన్‌, టెస్టోస్టెరాన్‌ గుండెజబ్బుల్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయనీ గుండెపోటు తర్వాత హృదయ కండరాల్ని కాపాడుకుంటాయనీ అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెలోతుల్లో దాచుకున్న అనురాగాన్నంతా పడకగదిలో మీ జీవిత భాగస్వామిపై కురిపించండి.

కామకేళిలో తేలిపోతున్నపుడు విడుదలయ్యే కొన్ని రసాయనాలు చర్మంపైనా ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఒంటికి మంచి నిగారింపు వస్తుంది. కొత్త మెరుపు కనిపిస్తుంది. వయసును గుర్తుచేసే ముడతలు మాయమైపోతాయి. చురుకైన శృంగార జీవితం గడుపుతున్నవారు మిగతావారికంటే కనీసం ఏడేళ్లు చిన్నవారిలా కనిపిస్తారని స్కాట్‌లాండ్‌లోని రాయల్‌ ఎడిన్‌బరో హాస్పిటల్‌ అధ్యయనంలో తేలింది.

శృంగారం. శరీరానికే కాదు మనసుకూ శక్తినిచ్చే గోళీ. పడకగదే ఆసుపత్రి. జీవిత భాగస్వామే డాక్టర్‌, సైకాలజిస్ట్‌... అన్నీ! ఈ విషయాన్ని అంతర్జాతీయ వైద్య ప్రపంచం మరోమాట లేకుండా ఒప్పుకుంది.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
శృంగారం నిషిద్ధాంశం అని పాఠకుల అభిప్రాయం లా వుంది.....ప్రతి పోస్టు కి ముందు కామెంట్లు వ్రాసే వారు కూడా మౌనం గా వుంటేనూ. Anyways మంచి అంశం ఎంచుకున్నారు
రానారె చెప్పారు…
చూశారా, మీరుకూడా అనామకంగా [anonymously] వ్యాఖ్య విసిరారు!?
శ్రీనివాస చెప్పారు…
ఇలాంటి వ్యాసమేదో చదివి మాడేళ్ళ క్రితం ఓ రెండు లైన్లు రాసుకుని చిన్న వాల్‌పేపర్‌ డిజైన్‌ చేసాను.
ఇక్కడ చూడండి
Unknown చెప్పారు…
సెక్స్ ఎడ్యుకేషన్ ముఖ్యమని అందరూ అంటుండగానే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెక్స్ ఎడ్యుకేషన్ బాన్ చేసాయి.
మన భారత సంస్కృతి లో ఇంకా దానిని ఆహ్వానించే ప్రయత్నం సరిగా జరగట్లేదు అని నాకు అనిపిస్తుంది. మాటలు చెప్పడానికి మాత్రమే కానీ చేతలకు వచ్చేసరికి కొరవడుతుంది.

అదే కాక ఇండియా ఎయిడ్స్ లో మొదటి స్థానమో, రెండో స్థానమో అనుకుంట. మరి సరయిన సెక్స్ ఎడ్యుకేషన్, అవగాహన కల్పించకుండా దీనిని ఎలా నిరోధిస్తారో అర్థం కాదు.

అదే కాక తల్లిదండ్రులు కూడా దీని గురించి మాట్లాడరు, మాట్లాడితే నిరోధిస్తారు.

మీరు చెప్పిన విషయాలన్నీ నిజాలే.

అదీ కాక ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటి అంటే ఇప్పుడు భార్యా భర్తలిద్దరూ పని చెయ్యడంతో DINS (Double Income No Sex) అనేది ఎక్కువవుతుంది అని నిపుణులు అంటున్నారు.

జీవితాన్ని సమంగా బాలెన్స్ చేసుకోకపోతే ఏం కోల్పోతామో అర్థం చేసుకోవాలి.
అజ్ఞాత చెప్పారు…
విత్తు ముందా చెట్టు ముందా?

All these facts could be true. Physiologically they could all have a point.

However, in my opinion, a lot of factors have to work together in order for husband and wife to have healthy intimacy in the first place. That healthy intimacy would then in turn have a positive effect on other aspects of family and social life.

lalitha.
రానారె చెప్పారు…
Healthy intimacy - ఆరోగ్యకరమైన అన్యోన్యత (ఆఅ) అనవచ్చునేమో. మనువు కాకమునుపే జీవితాలపట్ల తమ దృక్పథాలేమిటో , జీవిత భాగస్వామి(ని) పట్ల తమ దృక్పథాలేమిటో, ఎటువంటి జీవితం కావాలని ప్రగాఢమైన ఆంకాంక్షలు కలిగి ఉన్నారో నిర్మొహమాటంగా తెలిపి, తెలుసుకొని - తమ మధ్య ఆరోగ్యరకమైన అన్యోన్యత ఏర్పడే అవకాశాలున్నాయో లేదో తెలుసుకోవడం మంచిది. ఇది అత్యంత ప్రాథమికమైన విషయమని అనుకొంటున్నాను. "ఆ అ" ఉంటేనే "కీలకం" సాధ్యమయ్యేది. ఇది ఏ కాలానికైనా వర్తించేదే కదా? మరి మన ప్రాతంల్లో ఈ కాలం ఎలా జరుగుతోందో, పెళ్లిచూపులనబడు ఇబ్బందికరమైన అరగంట ప్రహసనానికి ముందు తరువాత ఆరోగ్యకరమాన అన్యోన్యతకుగల అవకాశాలగురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనుంది.

కర్ణాటక, మహారాష్ట్రలు ఏ దిశగా వెళుతున్నాయో మరి!?
అజ్ఞాత చెప్పారు…
I think the discussion took a different route.

Well, anyway, whether it is arranged by elders or a match the couples make for themselves, there is no formula to predict a healthy marriage.

The perspective changes as the relationship matures from engagement to marriage to parenthood and further. People change and the relationship has to adjust accordingly. It is a work in progress all the way.

My point in my earlier comment was that, agian, physical intimacy is not a cure all pill. Even if it was, there is work involved in making that pill too.

While the act may be healthy, it also has its limits.
Education in a general sense itself brings about a kind of awareness even without specific emphasis. Also, in most cases, an opportunity for education is indicative of an environement where certain basic values are encouraged.

The reason behind the spread of AIDS in India seems to me, to stem from the lack of education itself at any level and the poor economy breeding a mutitude of vices. Add to it the universal idea of chastity for women as virtue and hardly any restrictions on men other than their own conscience.

lalitha.
సిరిసిరిమువ్వ చెప్పారు…
మంచి విషయం మీద చర్చ ప్రారంభించారు.మీరన్నట్లు మనువు కాకమునుపే జీవితాలపట్ల ఎవరి దృక్పథాలేమిటో తెలుసుకోవడం మంచిదే కాని అది ఎంతవరకు ఆచరణలో జరుగుతుందో అనుమానమే. ఇప్పుడు అరగంట పెళ్ళిచూపులు కూడా ఎక్కడ వుంటున్నాయండీ అన్నీ నెట్ పెళ్ళిచూపులు, వారంలో పెళ్ళి, పై వారంలో విమానం ఎక్కేయటం, ఇక ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఎక్కడ. అన్నీ ఇలాగే అని కాదు కానీ కొన్ని ఇలాగే జరుగుతున్నాయి.(రానారే గారూ మీరు కాస్త జాగ్రత్త)

లలిత గారన్నట్లు అఆ కి ఒక నిర్థిష్ట ఫార్ములా అంటూ ఏం లేదు. ఎంత ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకున్నా (చేసుకున్నామని భ్రమపడేవాళ్ళు కూడా వుంటారు) తరువాత ఎదురయ్యే పరిస్థితులని బట్టి, వాటిని ఎదురుకునే సామర్థ్యాన్ని బట్టి, ఎదుటివారి సహకారాన్ని బట్టి వాళ్ళ దాంపత్యం ఆధారపడి వుంటుంది. ప్రతి ఒక్కరికి ఎవేవొ ఆకాంక్షలు, కోరికలు, ఆశయాలు వుంటాయి, కానీ ఎంతమంది వాటిని తృప్తి పరచగలిగే భాగస్వామిని పొందగలరు. ఎవో కొన్ని విషయాలలోనన్నా సర్దుకుపోవలిసి వుంటుంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తేనే ఆరోగ్యకరమైన అన్యోన్యత సాధ్యపడుతుంది.

జీవితభాగస్వామిని వాళ్ళ తప్పొప్పులు బలహీనతలతో సహా అంగీకరించగలిగితేనే ఏ దాంపత్యం అయినా పది కాలాలు నిలబడుతుంది.(బలహీనతలు లేని తప్పులు చేయని మనుష్యులు వుండరు కదా)

పెళ్ళికి ముందు ఎదుటివాళ్ళలో మనకి కనపడేది వాళ్ళలోని మంచి గుణాలే ఆ తరువాతే వాళ్ళలోని లోపాలు కనపడతాయి. అందుకే పెళ్ళికి ముందు మేము ఒకరినొకరము బాగా అర్థం చేసుకున్నాము అనుకుంటే అది ఒకరకంగా ఆత్మవంచనే.పెళ్ళి తరువాతే అసలు అర్థం చేసుకోవటం మొదలవుతుంది.

ఇక ప్రవీణ్ గారన్నట్లు భార్యా భర్తలిద్దరూ పని చెయ్యడంతో DINS అనేది ఎక్కువవుతుంది. అంతే కాదు బెంగుళూరులో సాఫ్టువేరు వాళ్ళ మీద ఒక సర్వే చేస్తే వాళ్ళలో ఎక్కువ మంది శృంగార జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళే. భార్యాభర్తలిద్దరికి చెరో షిప్ట్, ఆ షిప్టులతో వచ్చే fatigue అన్నీ కలిసి వాళ్ళ దాంపత్య జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. అంతే కాదు late marriages, late shifts, insecurity అన్నీ కలిసి వాళ్ళ సంతాన యోగ్యతను కూడా దెబ్బతీస్తున్నాయి.(ఈ విషయం గురించి మన యువ బ్లాగ్మిత్రులు కొంచం ఆలోచిస్తే బాగుంటుంది)

ఇక సెక్స్ ఎడ్యుకేషనుకి వస్తే మనం దానికి ఇవ్వాలిసినంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. నిజానికి దానికంటూ ఓ ప్రత్యేక పీరియడ్ పెట్టటమో, ప్రత్యేక సిలబస్ తయారు చేయటమో చేయనక్కర్లేదు. స్కూళ్ళలో టీచర్స్ ఒక వయసు వచ్చిన పిల్లలకి పాఠాలలో ఒక భాగంగా చెప్పవచ్చు. కొన్ని స్కూళ్ళలో ఇప్పటికే చేస్తున్నారు కూడా. ప్రభుత్వపరంగా కూడా ఇంకా చాలా చేయాలి, అప్పుడే ప్రజలలో అవగాహన పెరిగేది. తల్లిదండ్రులు కూడా అదేదో తప్పు విషయం అన్నట్లు కాకుండా పిల్లలకి అర్థం చేసుకునే వయసు వచ్చాక అవసరమైనంతవరకు విడమరిచి చెప్పాలి.
అజ్ఞాత చెప్పారు…
this is nothing but f***in hipocracy lives with in our indians. We don't want to talk about it but we want to do it. Kiss is still a taboo in india which is the most elementary expression of effection between two human beings in this world.

this hipocracy is leading india to extereme risky situations now. rage of AIDS and other social diseases are nothing but a side effect of this hipocracy.
రానారె చెప్పారు…
లలితగారు, సిరిసిరిమువ్వగారు: వివరణాత్మకమైన అభిప్రాయాలను వెల్లడించినందుకు కృతజ్ఞతలు. (మీ సూచనలను, హెచ్చరికలను గమనించాను, ధన్యవాదాలు).

సుధాకర్ గారికి, మీ ఆక్రోశం **** స్థాయిలో [అనగా స్టా(తా)రాస్థాయిలో] ఆంగ్లంలో వెల్లడైనా మీరన్నది ఉన్న సంగతే . మీకూ థాంక్స్.
SP CHANDER చెప్పారు…
Priya Mithrulaara,
1937 nundi 1958 varaku madras nundi Anandobrahma ane oka shrungara-haasya poorita private maasa patrika veluvadedi. maa taatagaru aa patrika chandaadaruga vundevaaru. aayana inappettolo aa pustakalu oka saari chooddam jarigindi, kaani maa bamma vaatini tagulapettindi.
evari vaddaina aa pustakulu vunte vaatini mee blog dwara share chesukunte aanati shrungara haasya saahithyam entha sunnithanga mariyu rasikango undedo andariki telusutundi.

dhanyavaadalu.

prakash chandra sonaji

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము