కీలకం
ఈనాటి ఈనాడు పత్రికలోని ఒక వ్యాసం నుంచి కొన్ని అంశాలు:
శృంగారం... మనసుల భేటీ. తనువుల పోటీ! ఆ భేటీలో... ఇరు మనసులు మరింత దగ్గరవుతాయి. మనువుకు అర్థం అంతేగా! ఆ పోటీలో... ఇద్దరూ విజేతలవుతారు. 'ఆనందోబ్రహ్మ' అదేగా! నవతరం దంపతులారా... ఆ ఆనందానుభూతుల్ని దూరం చేసుకోకండి. పరుగుల జీవితంలో శృంగారం నిషిద్ధఫలం కాదు... సిద్ధాన్నం! నిండు జీవితానికి ఓ వరం. అందుకోండి. ఆస్వాదించండి. ఆనందంగా గడపండి. ఆరోగ్యంగా ఉండండి.
ఇంట్లో పరిపూర్ణ శృంగారాన్ని అనుభవిస్తున్నవారే ఆఫీసులో చక్కగా పనిచేస్తారు. చిటపటలాడకుండా చిరునవ్వుతో మెలుగుతారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ వారికే. సెక్స్‌కు దూరంగా ఉండేవారిలో ఓరకమైన అశాంతి కనిపిస్తుంది. అది వారిని స్థిమితంగా ఉండనీదు. ప్రశాంతంగా పని చేయనీదు.
ఆక్సీటోసిన్ వారిద్దరిమధ్యా ఉన్న అనురాగాన్ని పదిరెట్లు పదిలం చేస్తుంది. 'నాకు నువ్వు... నీకు నేను' అన్న భావన బలపడేది పడకగదిలోనే. 'ఇదో గొప్ప భావవ్యక్తీకరణ' అంటారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్టు జాన్ మ్యారో.
ప్రణయానికీ వాసన గ్రహించే శక్తికీ సంబంధం ఉంది. శృంగారం వల్ల శరీరంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దాని ప్రభావం వల్ల మన ఘ్రాణశక్తి మరింత పెరుగుతుందట!
సెక్స్‌లో విడుదలయ్యే టెస్టోస్టెరాన్ కండరాలకూ ఎముకలకూ శక్తినిస్తుంది. ఊబకాయులు సన్నబడటానికి ప్రణయమూ ఓ మార్గమే.
కుర్రకారుతో పోటీపడాల్సిన పనేం లేదు కానీ, వయోధికులూ తమకున్న పరిమితుల్లో శృంగార జీవితాన్ని అనుభవించవచ్చని చెబుతున్నారు నిపుణులు. ముద్దులు, కౌగిలింతలే కావచ్చు... వాటివల్ల వారిలో కొత్త ఉత్సాహం వస్తుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. 'ఈ వయసులోనూ మీరు శృంగారం పట్ల ఉత్సాహం చూపితే కొన్నిరకాల కీలక హార్మోన్లను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని మీ శరీరం కూడా గుర్తిస్తుంది' అని వయోధికులకు సలహా ఇస్తారు డాక్టర్ బ్రాడ్లే అనే వైద్యనిపుణుడు. అది చాలు రెండో యవ్వనంలోకి అడుగుపెట్టడానికి.
నిజంగా తలనొప్పి ఉన్నా దాన్ని క్షణాల్లో పోగొట్టే అమృతాంజనం సెక్స్! ఒక్క తలనొప్పే ఏం ఖర్మం, తల నుంచి పాదాల దాకా ఏ నొప్పులున్నా మటుమాయం కావాల్సిందే. భావప్రాప్తికి కాస్త ముందు మెదడులోని నొప్పిని నియంత్రించే కేంద్రం చురుగ్గా పనిచేస్తుంది. ఆ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లకు తలనొప్పి నుంచి కీళ్ల నొప్పులదాకా ఏ నొప్పినైనా మాయం చేసే శక్తి ఉంది. జలుబుతో చికాకుపడుతున్నవారికీ ప్రణయమే మందని చెబుతున్నారు అమెరికాలోని విల్కీస్ యూనివర్సిటీ పరిశోధకులు. సెక్స్‌లో చురుగ్గాపాల్గొనే వారిలో ఇమ్యునోగ్లోబులిన్-ఎ అనే యాంటీ బాడీ 30 రెట్లు అధికంగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల రోగనిరోధకత అధికం అవుతుంది.
శృంగారానుభూతుల వల్ల విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్‌కు ఒత్తిడిని దూరం చేసే శక్తి ఉంది. ఈ 'మన్మథ హార్మోన్' భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని మరింత పదిలం చేయగలదట. ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే... మరుసటిరోజు అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ముందురోజు రాత్రి హుషారుగా శృంగారంలో పాల్గొంటే చాలట! అన్నిచోట్లా 'వన్స్‌వోర్'లే!
'రొమాంటిక్ హార్మోన్లు'... డీహైడ్రోఎపీఎండ్రోస్టోన్, టెస్టోస్టెరాన్ గుండెజబ్బుల్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయనీ గుండెపోటు తర్వాత హృదయ కండరాల్ని కాపాడుకుంటాయనీ అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెలోతుల్లో దాచుకున్న అనురాగాన్నంతా పడకగదిలో మీ జీవిత భాగస్వామిపై కురిపించండి.
కామకేళిలో తేలిపోతున్నపుడు విడుదలయ్యే కొన్ని రసాయనాలు చర్మంపైనా ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఒంటికి మంచి నిగారింపు వస్తుంది. కొత్త మెరుపు కనిపిస్తుంది. వయసును గుర్తుచేసే ముడతలు మాయమైపోతాయి. చురుకైన శృంగార జీవితం గడుపుతున్నవారు మిగతావారికంటే కనీసం ఏడేళ్లు చిన్నవారిలా కనిపిస్తారని స్కాట్‌లాండ్‌లోని రాయల్ ఎడిన్‌బరో హాస్పిటల్ అధ్యయనంలో తేలింది.
శృంగారం. శరీరానికే కాదు మనసుకూ శక్తినిచ్చే గోళీ. పడకగదే ఆసుపత్రి. జీవిత భాగస్వామే డాక్టర్, సైకాలజిస్ట్... అన్నీ! ఈ విషయాన్ని అంతర్జాతీయ వైద్య ప్రపంచం మరోమాట లేకుండా ఒప్పుకుంది.

కామెంట్లు
ఇక్కడ చూడండి
మన భారత సంస్కృతి లో ఇంకా దానిని ఆహ్వానించే ప్రయత్నం సరిగా జరగట్లేదు అని నాకు అనిపిస్తుంది. మాటలు చెప్పడానికి మాత్రమే కానీ చేతలకు వచ్చేసరికి కొరవడుతుంది.
అదే కాక ఇండియా ఎయిడ్స్ లో మొదటి స్థానమో, రెండో స్థానమో అనుకుంట. మరి సరయిన సెక్స్ ఎడ్యుకేషన్, అవగాహన కల్పించకుండా దీనిని ఎలా నిరోధిస్తారో అర్థం కాదు.
అదే కాక తల్లిదండ్రులు కూడా దీని గురించి మాట్లాడరు, మాట్లాడితే నిరోధిస్తారు.
మీరు చెప్పిన విషయాలన్నీ నిజాలే.
అదీ కాక ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటి అంటే ఇప్పుడు భార్యా భర్తలిద్దరూ పని చెయ్యడంతో DINS (Double Income No Sex) అనేది ఎక్కువవుతుంది అని నిపుణులు అంటున్నారు.
జీవితాన్ని సమంగా బాలెన్స్ చేసుకోకపోతే ఏం కోల్పోతామో అర్థం చేసుకోవాలి.
All these facts could be true. Physiologically they could all have a point.
However, in my opinion, a lot of factors have to work together in order for husband and wife to have healthy intimacy in the first place. That healthy intimacy would then in turn have a positive effect on other aspects of family and social life.
lalitha.
కర్ణాటక, మహారాష్ట్రలు ఏ దిశగా వెళుతున్నాయో మరి!?
Well, anyway, whether it is arranged by elders or a match the couples make for themselves, there is no formula to predict a healthy marriage.
The perspective changes as the relationship matures from engagement to marriage to parenthood and further. People change and the relationship has to adjust accordingly. It is a work in progress all the way.
My point in my earlier comment was that, agian, physical intimacy is not a cure all pill. Even if it was, there is work involved in making that pill too.
While the act may be healthy, it also has its limits.
Education in a general sense itself brings about a kind of awareness even without specific emphasis. Also, in most cases, an opportunity for education is indicative of an environement where certain basic values are encouraged.
The reason behind the spread of AIDS in India seems to me, to stem from the lack of education itself at any level and the poor economy breeding a mutitude of vices. Add to it the universal idea of chastity for women as virtue and hardly any restrictions on men other than their own conscience.
lalitha.
లలిత గారన్నట్లు అఆ కి ఒక నిర్థిష్ట ఫార్ములా అంటూ ఏం లేదు. ఎంత ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకున్నా (చేసుకున్నామని భ్రమపడేవాళ్ళు కూడా వుంటారు) తరువాత ఎదురయ్యే పరిస్థితులని బట్టి, వాటిని ఎదురుకునే సామర్థ్యాన్ని బట్టి, ఎదుటివారి సహకారాన్ని బట్టి వాళ్ళ దాంపత్యం ఆధారపడి వుంటుంది. ప్రతి ఒక్కరికి ఎవేవొ ఆకాంక్షలు, కోరికలు, ఆశయాలు వుంటాయి, కానీ ఎంతమంది వాటిని తృప్తి పరచగలిగే భాగస్వామిని పొందగలరు. ఎవో కొన్ని విషయాలలోనన్నా సర్దుకుపోవలిసి వుంటుంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తేనే ఆరోగ్యకరమైన అన్యోన్యత సాధ్యపడుతుంది.
జీవితభాగస్వామిని వాళ్ళ తప్పొప్పులు బలహీనతలతో సహా అంగీకరించగలిగితేనే ఏ దాంపత్యం అయినా పది కాలాలు నిలబడుతుంది.(బలహీనతలు లేని తప్పులు చేయని మనుష్యులు వుండరు కదా)
పెళ్ళికి ముందు ఎదుటివాళ్ళలో మనకి కనపడేది వాళ్ళలోని మంచి గుణాలే ఆ తరువాతే వాళ్ళలోని లోపాలు కనపడతాయి. అందుకే పెళ్ళికి ముందు మేము ఒకరినొకరము బాగా అర్థం చేసుకున్నాము అనుకుంటే అది ఒకరకంగా ఆత్మవంచనే.పెళ్ళి తరువాతే అసలు అర్థం చేసుకోవటం మొదలవుతుంది.
ఇక ప్రవీణ్ గారన్నట్లు భార్యా భర్తలిద్దరూ పని చెయ్యడంతో DINS అనేది ఎక్కువవుతుంది. అంతే కాదు బెంగుళూరులో సాఫ్టువేరు వాళ్ళ మీద ఒక సర్వే చేస్తే వాళ్ళలో ఎక్కువ మంది శృంగార జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళే. భార్యాభర్తలిద్దరికి చెరో షిప్ట్, ఆ షిప్టులతో వచ్చే fatigue అన్నీ కలిసి వాళ్ళ దాంపత్య జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. అంతే కాదు late marriages, late shifts, insecurity అన్నీ కలిసి వాళ్ళ సంతాన యోగ్యతను కూడా దెబ్బతీస్తున్నాయి.(ఈ విషయం గురించి మన యువ బ్లాగ్మిత్రులు కొంచం ఆలోచిస్తే బాగుంటుంది)
ఇక సెక్స్ ఎడ్యుకేషనుకి వస్తే మనం దానికి ఇవ్వాలిసినంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. నిజానికి దానికంటూ ఓ ప్రత్యేక పీరియడ్ పెట్టటమో, ప్రత్యేక సిలబస్ తయారు చేయటమో చేయనక్కర్లేదు. స్కూళ్ళలో టీచర్స్ ఒక వయసు వచ్చిన పిల్లలకి పాఠాలలో ఒక భాగంగా చెప్పవచ్చు. కొన్ని స్కూళ్ళలో ఇప్పటికే చేస్తున్నారు కూడా. ప్రభుత్వపరంగా కూడా ఇంకా చాలా చేయాలి, అప్పుడే ప్రజలలో అవగాహన పెరిగేది. తల్లిదండ్రులు కూడా అదేదో తప్పు విషయం అన్నట్లు కాకుండా పిల్లలకి అర్థం చేసుకునే వయసు వచ్చాక అవసరమైనంతవరకు విడమరిచి చెప్పాలి.
this hipocracy is leading india to extereme risky situations now. rage of AIDS and other social diseases are nothing but a side effect of this hipocracy.
సుధాకర్ గారికి, మీ ఆక్రోశం **** స్థాయిలో [అనగా స్టా(తా)రాస్థాయిలో] ఆంగ్లంలో వెల్లడైనా మీరన్నది ఉన్న సంగతే . మీకూ థాంక్స్.
1937 nundi 1958 varaku madras nundi Anandobrahma ane oka shrungara-haasya poorita private maasa patrika veluvadedi. maa taatagaru aa patrika chandaadaruga vundevaaru. aayana inappettolo aa pustakalu oka saari chooddam jarigindi, kaani maa bamma vaatini tagulapettindi.
evari vaddaina aa pustakulu vunte vaatini mee blog dwara share chesukunte aanati shrungara haasya saahithyam entha sunnithanga mariyu rasikango undedo andariki telusutundi.
dhanyavaadalu.
prakash chandra sonaji
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.