పోస్ట్‌లు

కినుకును యొక్క లోన్లోపలను

చిట్టచివరికి చిట్టచివరికు చిట్టచివరకు చిట్టచివరకి వీటిలో రెండోది ఎవరూ వాడరనుకుంటా. అది తప్ప మిగిలిన మూడూ వాడుకలో చూస్తున్నాను. ఐతే నాలుగోది నేను వాడను. ఎందుకంటే నాకది ఎలా అనిపిస్తుందంటే, ఒక ఉదాహరణతో చెబుతాను. ఒక చిన్న పిల్లవాడు మరొకడిని బెదిరిస్తున్నాడు. ఏమని? "అమ్మకు చెబుతా వుండు!" అని. వీడు తెలుగుహిందువుల పిల్లోడు అనిచెప్పవచ్చు. ఇంకొక చిన్నపిల్లోడు మరోకడిని బెదిరిస్తున్నాడు. ఏమని? "అమ్మకి చెబుతా వుండు!" అని. వీడు తెలుగుసాయిబుల పిల్లోడు అనిపిస్తుంది. "అమ్మా కీ చెప్తా" అన్నట్టుంటుందిది. మావూళ్లో సాయిబులు ఎవరో కొందరు తప్పితే మంచి తెలుగు మాట్లాడతారు. మంచి తెలుగంటే నాకు మంచి అనిపించిన తెలుగు. నేను చిన్నప్పటినుంచీ విన్న తెలుగు. బ్లాగులు చదవడం మొదలుపెట్టిన తరువాత అకారానికి, ఉకారానికీ పక్కన ఈ "కి"కారమును ముస్లిమేతర తెలుగులు కూడా వాడటం ఎక్కువగా చూస్తున్నాను. చదివినప్పుడల్లా నాకు ఇబ్బందిగా వుంటుంది. "ప్రియమైన అమ్మానాన్నలకు" అని రాస్తాం మావైపు వాళ్లం. "ప్రియమైన అమ్మాన్నాన్నలకి" అని రాసేవాళ్లున్నారు. వీళ్లు మావైపువాళ్లు కానివాళ్లు. ...

టింగురంగని సందేహాలు

ముల్లు : " ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు - ఎక్కడో గుచ్చావు చాపముల్లు " అన్ని వర్గాలనూ కదిలించిన పాట. "సుప్రీం హీరో మఱియు మెగాస్టార్ అయిన మిమ్మల్ని... నిన్నగాకమొన్న చిత్రసీమలో అడుగుపెట్టిన నగ్మా 'బే' అనడమేమిటి? ఇతర హీరోల అభిమానుల ముందు తలెత్తుకోలేకున్నాను." అని ఒక అభిమాని తన రక్తంతో లిఖించి చిరంజీవికి పంపించాడని 'ఇండియా టుడే'లో చదివాను ఆ కాలంలో. "ఏం పాటలో ఏం ఖర్మో, రాబోయే కాలంలో ఇంకా ఏమేం వినాల్సొస్తుందో!" -- మరో వర్గం "ఏం పాట!! నా సామిరంగా... ఏమి స్టెప్పులూ...!!!" -- ఇంకో వర్గం నాకు మాత్రం ఇవేవీ పెద్దగా పట్టలేదు. ఈ పాటలో 'స్‌సోడాకొట్టు అలా అలా విస్కీకొట్టు ఇలా ఇలా' అనేటప్పుడు బాలు గొంతు తాగిన చిరంజీవి గొంతుమాదిరే వుంటుందికదా అనుకుంటే, చిత్ర కూడా తాగినట్టు పాడటం నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించేది. అప్పుడు మనం ఏడో తరగతి - ఎనిమిదో తరగతి ఆ మధ్యలో ఉన్నాం. సినిమాలు అందనంత దూరంలో ఉండేవి. పాటలు మాత్రం ఊర్లో వినబడుతూ ఉండేవి. కొన్నాళ్లకు రేడియోలో కూడా వచ్చాయి. చాపముల్లేమిటి చాపముల్లు? చేపముల్లు అంటే అర్థం చేసుకోవచ్చు. చేపముల్లయితే ఎవరో గుచ...

మన కులానికే మన ఓట్లు

చదువుకునే రోజుల్లో ఓటు వెయ్యాలనే ఆలోచనే నాకెప్పుడూ కలగలేదు. అందరూ వ్యాపారులేగానీ ప్రజానాయకులెవరూ లేరనే అభిప్రాయం నాది. అందుకే ఓటరు జాబితాలో నాపేరు కూడా నమోదు చేసుకోలేదు. నేనెప్పుడూ చదువులపేరుతో ఊరిబయటే ఉంటాననుకున్నారో, వాళ్లకే ఓటేస్తానన్న భరోసా లేదనుకున్నారో, నాలాంటివాళ్లు ఓట్లేయడం ప్రజాస్వామ్యానికి క్షేమం కాదనుకున్నారోగానీ మావూళ్లోని ఏ పార్టీవాళ్లూ పట్టుబట్టి నాపేరును ఆ జాబితాలోకి ఎక్కించలేదు. నాకీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. అయినా రాష్ట్ర రాజకీయాల వార్తలను చాలా దగ్గరగా చూస్తున్నాను. ఇప్పుడు ఓటు వేద్దామనిపిస్తూ వుంది. లోక్‌సత్తాకు. ఎన్నికల సంఘం చెప్పిన నియమావళిని పాటిస్తూ రాజ్యాంగంపట్ల మనకుండవలసిన గౌరవాన్నీ క్రమశిక్షణనూ చాటుతూ, నేటి రాజకీయగంజాయివనంలో తులసిమొక్కలా నిలిచిందన్న ఒకే ఒక్క కారణం చాలు లోక్‌సత్తాకు ఓటు వేయడానికి. ఈ కారణం మాత్రమే చాలు. లోక్‌సత్తాకు ఓటు వేస్తే మీ ఓటు వృధా అవుతుందని కొందరంటున్నారు. ఇంతకంటే పాపపు ప్రేలాపన ఇంకొకటి లేదు. గెలిచే అభ్యర్థి ఎవరో వాళ్లే మనకు చెప్పేసి, ఆ అభ్యర్థికి ఓటు వేస్తేనే అది సద్వినియోగం అవుతుందన్నట్లు ప్రచారం చేస్తున్నారు వీళ్లు. ఎన్నికలంటే ...