వేదాల్లో సైన్సును వెతకండిగానీ సైన్సులో వేదాలను వెతక్కండన్నాడొక పెద్దాయన. అది చేతకానప్పుడు ఇదైనా చెయ్యాలిగదా? ఇప్పుడు నేను చెయ్యబోతున్నది ఆలాంటిదే. 2009 ఫిబ్రవరిలో కొత్తపాళీగారి బ్లాగులో "స్థితప్రజ్ఞత" అనే టపా వచ్చింది. అందులో ముఖ్యమైనదిగా నాకు తోచిన వాక్యం - "క్రమశిక్షణతో కూడిన ఒక వైరాగ్యాన్ని పెంపొందించుకో గలిగితే తదనుగుణంగా మన అంతశ్శక్తిని నిక్షేపించుకుని, దాచుకుని, అంతిమంగా కీలకమైన లక్ష్యసాధనకి వినియోగించుకోవచ్చు." 2010 ఫిబ్రవరి వచ్చాక చూసుకుంటే, గడచిన యేడాది కాలంలో క్రమశిక్షణ లేదు. వైరాగ్యం లేదు. ఇవి రెండూ లేకపోవడంవల్ల అంతశ్శక్తీ లేదు. కనీసం, అంతిమంగా కీలకమైన లక్ష్యం యేమిటో తెలుసునా అంటే అదీతెలీదు. క్రమశిక్షణా అంతశ్శక్తీ ఎంతోకొంత తిరిగి సాధించినా, లక్ష్యం ఏమిటో తెలీడంలేదు. నా లక్ష్యం ఏమిటో మీకేమైనా తెలుసా? అని ఎవరినయినా అడిగితే బాగుండదేమో. ఇంతకూ, మీకు అంతిమంగా కీలకమైన లక్ష్యం ఏమిటి? A. నాకు తెలీదు B. ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు C. అక్కర్లేదు నా కిలాగే బాగుంది D. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా E. ప్రతిరోజూ క్రమశిక్షణనూ, అంతశ్శక్తినీ సాధించడమే F. సృష్టికార్యంలో ఆ ప...