గూగులమ్మ పదాలు

ఎనిమిదో విడత...
*******

తెలవారి యలబారి
యీదు టొకటే దారి
ట్రాఫిక్కు గోదారి
ఓ గూగులమ్మా!

అడుగులో అడుగిడుచు
ఒయ్యారముగ నడచు
ట్రాఫిక్కు యను పడుచు
ఓ గూగులమ్మా!

బ్రహ్మోత్సవపు పథము
జగన్నాథుని రథము
ట్రాఫిక్కు అనుదినము
ఓ గూగులమ్మా!

ట్రాఫిక్కు నిగళమ్ము
కార్+అడవి గరళమ్ము
దా రెపుడు సరళమ్ము?
ఓ గూగులమ్మా!

ట్రాఫిక్కు సమవర్తి
యమధర్మమె స్ఫూర్తి
పడబోకు కక్కుర్తి
ఓ గూగులమ్మా!

జరా మరణము లేని
శివుని శిరమున వేణి
ట్రాఫిక్కు మహరాణి
ఓ గూగులమ్మా!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం