వారవనిత - తిమ్మకవి

రసికజన మనోభిరామ రచనానంతరం ఆ కృతి చదివిన వారవనిత ఒకామె కూచిమంచి తిమ్మకవిని కౌగిలించుకొనగా ఆయన పెడమొగం పెట్టాడట. ఆప్పుడామె -

'చతురులలోన నీవు గడు జాణ వటంచును నేను గౌగిలిం
చితి నిటు మాఱుమోమిడఁగజెల్లునె యో రసికాగ్రగణ్య!'

అని ప్రశ్నించిందట. దానికి తిమ్మకవి -

'అద్భుతమగు నట్టి బంగరపు బొంగరపుంగవఁబోలు నీ కుచ
ద్వితయము ఱొమ్మునాటి యల వీపున దూసెనటంచుఁజూచితిన్'

అని జవాబిచ్చాడట.

ఇంతకూ ఈ మా'ట' నాకెవరు చెప్పారు? :)

కామెంట్‌లు

మహీధర రెడ్డి చెప్పారు…
యాడికి పోయినారు రానారె గారు? శాన్నాలలకి మీ కాడ్నుంచి ఒక పోస్ట్ కానచ్చింది...రోంత నిదానంగా ఐనా రాచ్చా వుండండి సార్ !! మీరు రాసెటియి భలెంటాయి !!! మీ కడప యాసలోటివి ఐతే ఇంగా బాగుంటయి ...మీరు రాచ్చారని కోరుకుంటూ సెలవు...

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము