తీర్చిదిద్దగదయ్య నీ తెలుగుసీమ!!

తేనెల నొలికించు తెలఁగాణ నీదెరా
పండించుకోర సంపదల మెండు

రతనాల సీమ నీ రాయల సీమరా
దెసలెల్ల నింపుమా తెలుగు వెలుగు

సంగీత సాహిత్య శృంగార భూమిరా
సర్కారు పెట్టరా జ్ఞానభిక్ష

తీయని పలుకుల తెలుగు వెలంగి
మంజీర రవళుల సౌరు చిందనీర

చెదరిపోయిన తమ్ముల చేరదీసి
నేడు తెలుగమ్మ ఒడిలోన నిలిపినావు

ఆంధ్రుడా!
రాష్ట్రముల మేటియై చెలంగ
తీర్చిదిద్దగదయ్య నీ తెలుగుసీమ!!

ఘంటసాల.ఇన్ఫో వారికి కృతజ్ఞతలతో...

కామెంట్‌లు

రవి చెప్పారు…
ఇది మీరు రాసిందా? చివర్లో ఆ కృతజ్ఞతలు?!?
రానారె చెప్పారు…
రవి, కృతజ్ఞతలమీద క్లిక్కండి. వినండి. :)
రమణ చెప్పారు…
చాలా మంచి పాట.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం