సత్యాసత్యాలు

కృష్ణా...!
సత్యా...!

ఎప్పుడూ యిలాగే నీతో మాట్లాడుతూ వుండాలనుంది
ఆహాఁ!

నీకూ అలాగే అనిపిస్తోందా?
బానే వుంటుంది.. కానీ..

కానీ?
ఈరోజు కుచేలుడొస్తున్నాడు, స్టేషనుకెళ్లి వాణ్ణి రిసీవ్ చేసుకోవాలి

అంటే నాతో మాట్లాడటం కుదరదా కృష్ణా?
వాణ్ణి స్టేషనుకు అంకితమివ్వడం యేంబాగుంటుంది సత్యా పాపం బీదవాడు

కుచేలుడొచ్చి నీదగ్గరుండిపోతే నాతో మాట్లాడలేవేమో కదా?
(మనసులో) ఎందుకుమాట్లాడలేనూ అని బుకాయిస్తే నమ్మదు.
(బయటకు) వీలైనప్పుడల్లా మాట్లాడతాను

వీలు కుదరకపోతే లైటా?
(మనసులో) అంతేకదా మరి!
(బయటకు) వీలు కుదరకపోయినా మాట్లాడతాను.

ఎలా మాట్లాడతావు?
(మనసులో) వీలుకాకపోతే ఎలా మాట్లాడతాడు యెవడైనా? నా బొంద@$#%*
(బయటకు) అదంతా నీకెందుకు నేను మాట్లాడతాను!

సరే కృష్ణా, స్టేషనుకు క్షేమంగా వెళ్లిరా!
(యేడవలేక నవ్వే మొగంతో) అలాగే సత్యా

*** కొంత కాలం తరువాత ***

(కృష్ణుడు మొబైల్ ఫోన్ తీసి 16 మిస్డ్ కాల్స్ చూశాడు. 15 సత్య నుంచే.)

హలో సత్యా ..
ఇప్పటికి వీలు కుదిరిందా కృష్ణా

లేదు సత్యా, కుదరకే చేశాను
పరాచికాలా? ఎన్నిసార్లు కాల్ చేశానో చూసుకున్నావా?

వీలు కుదరినప్పుడు చేద్దామనుకున్నాను. కానీ కుదిరేలా కనబడలేదు.
మరిప్పుడెలా చేశావు?

కష్టమనుకున్నానుగానీ సత్యా, వీలు కుదిరినప్పటికన్నా కుదరనప్పుడు మాట్లాడటమే సులభమని గ్రహించాను. నీ సహవాసంలో నేర్చుకున్న కొత్త సంగతి ఇది!
(మనసులో) వీలుకాకపోతే ఎలా మాట్లాడతాడు యెవడైనా? @^&#%*#@$
(బయటకు) అoదుకే నన్ను విడిచిపెట్టి వుండకు! సరేనా?

సరే!
మా మంచి కృష్ణుడు.

కామెంట్‌లు

కొత్త పాళీ చెప్పారు…
చానా జ్ఞానోదయా లయినట్టున్నాయే! :)
Purnima చెప్పారు…
"ఆడవారి మాటలకి అర్థాలే వేరులే" అన్న పెద్దమనిషి ఇటు రమ్మనండి.. ఈ 'మనసులో', 'బయటకు' మాటలు చదివిద్దాం :P

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం