షావుకారులో బహుదూరపు బాటసారి పయనం

నేనింతవరకూ షావుకారు సినిమా చూడలేదు. ఇప్పుడే యూట్యూబులో ఆ సినిమా క్లిప్పింగులు చూస్తూ...



జైలు సన్నివేశానికి (రామారావు, నారాయణపాత్రధారి జైల్లో కలిసే సన్నివేశానికి) నేపథ్యంగా 'బహుదూరపు బాటసారీ' హార్మోనియం మీద [@ 4:30 ] విని ఆశ్చర్యానందాలు పొందాను. ఘంటసాల ఈ పాట సాహిత్యమూ, స్వరాలూ రెండూ కూర్చి పాడిన ప్రైవేటు రికార్డింగ్ మాత్రమే విన్నానిన్నాళ్లూ. బహుశా స్వరాలు కూర్చడం అయిన తరువాతే సాహిత్యం కూర్చివుంటాడనుకుంటా.

కామెంట్‌లు

రవి చెప్పారు…
షావుకారు చూడలేదా? మోసర్ బేర్ గాళ్ళ డీవీడీ తెచ్చుకొని చూసెయ్యండి.
Sreenivas Paruchuri చెప్పారు…
ఆ పాట 1940ల చివరిలో (అంటే షావుకారు సినిమా రావడానికి ముందే) రాసుకున్నట్లు ఘంటసాల చెప్పుకున్నారు. అదీన్ను, ఒక రాత్రి పూట ఒక మృతదేహాన్ని స్మశానానికి తీసుకు పోతుండగా చూసిన ప్రేరణతో ... కాకుంటే basic recordగా సుమారు 1952-55 మధ్య ప్రాంతాల్లో వెలువడింది.

ఇలాంటి ఉదాహరణలు మనకి చాలానే కనిపిస్తాయి, తెలుగు, హిందీ సినిమాల్లో.

రామారావు తో పైన సన్నివేశంలో నటించిన మనిషి వల్లభజోశ్యుల శివరాం. 1941-51 మధ్యల్లో కొన్ని సినిమాల్లో నటించడం, పాడటం (భక్తపోతన-1942, గుణసుందరి కథ-1949) కూడా చేశారు. కానీ యెక్కువమందికి వాహినీ/విజయయా స్టూడియోల్లో sound engineer గా పరిచితులు.

Shalimar, Moser Baer ల డి.వి.డి. లు మరిచిపోండి. వీలయితే ఈటివి వాళ్ళ కాపీ చూడండి. :-)

-- శ్రీనివాస్
సుజాత వేల్పూరి చెప్పారు…
చక్రపాణి మీద వచ్చిన స్మృతి సంచికలో చక్రపాణి గారు రాసిన "షావుకారు" సినిమా నవల ఉంది.

అసందర్భ వ్యాఖ్య:

శ్రీనివాస్ పరుచూరి గారూ,
జరుక్ శాస్త్రి గారి "వెళిపోయిందెళిపోయింది" పేరడీ మీ వద్ద కూడా లేదని బొల్లోజు బాబాగారితో అన్నారట ఒక సందర్భంతో! అది నేను ఎలాగో సంపాదించి నా బ్లాగులో స్కాన్ చేసి పెట్టాను. వీలైతే చూడండి. మీ వద్ద ఉంటే సరే!

www.manishi-manasulomaata.blogspot.com
Sreenivas Paruchuri చెప్పారు…
సుజాత-గారు,
ఆ "నవల" చక్రపాణిగారు రాసినది కాదు. ఆ పని చేసినది శ్రీ రావి కొండలరావు. మొదటిగా "విజయచిత్ర" పత్రికలో ధారావాహికంగా వెలువడింది. 1977 లో "నవోదయ" రామమోహనరావు గారు పుస్తకంగా తెచ్చారు; వి.ఎ.కె.రంగారావు, కొ.కు ల ముందు మాటలతో.

-- శ్రీనివాస్

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము