పులి
ఇంకో ఇరవైనిముషాల్లో... ఇంకో పది నిముషాల్లో హెలికాప్టర్ దిగిన చోటికి చేరుకుంటున్నాం అన్నారు. గంట గడిచింది. అసలు సమాచారం చెప్పడం లేదు. బహుశా భద్రతాకారణాలేమో, ఈ పాటికి హైదరాబాదు చేర్చేసి వుంటారు అనుకున్నాను. నేరుగా రాజశేఖరరెడ్డి నోటెమ్మటే, ఏమి జరిగిందో కుశాలగా వినొచ్చుననుకున్నాను. తరువాత అంతా తల్లకిందులు. వార్త వినగానే కళ్లెమ్మట నీళ్లు.
అత్యంత ఆత్మీయుల మరణం కూడా నాతో ఇంత సులభంగా కన్నీళ్లు పెట్టించలేదు. నా బాధను సరిగ్గా అర్థం చేసుకోగల మనుషులతో వెంటనే మాట్లాడాలని తొందర కలగలేదు. మరిప్పుడెందుకు? నా అంచనా తప్పినందుకేనా? నా సన్నిహితుడేమీ కాడే? పత్రికల్లో సెజ్ నిర్వాసితుల కథనాలు చూసి చూసి కడుపు మండినవాణ్ణే నేను, హెలికాప్టర్ దొరికిందనగానే సంబరమెందుకు? అవినీతి, అధికార దుర్వినియోగం అనే మాటలను పత్రికలలో ప్రతిరోజూ చూస్తూనే వున్నానే, రాజశేఖరరెడ్డి మాట్లాడితే చూద్దామని అంతగా ఎదురు చూడటం ఎందుకు? ఇంక మాట్లాడడని తెలియగానే కండ్లు చెమర్చడమెందుకు?
ఇరవైయ్యేళ్ల నాటి సంగతి. ఆ దినము, వీరబల్లె వీధుల్లో తలెత్తి ఎక్కడజూసినా తెల్లటి గుడ్డల మీద నీలంరంగు చేతిరాతలు.
ఆ రాతల్లో నాకు బాగా గుర్తున్నవి:
"స్వాగతం సుస్వాగతం"
"పులివెందుల పులి"
"రాయలసీమ టైగర్"
"మా ప్రియతమ నాయకుడు"
"శ్రీ డా|| వై.ఎస్.రాజశేఖరరెడ్డి గార్కి"
"ఇదే మా హార్దిక స్వాగతం"
'శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గార్కి' ఏమిటి, 'గారికి' అని రాయొచ్చు కదా?
'ఓహో, గుడ్డ మీద స్థలం లేదుగాబట్టేమోలే'
ఆ గుడ్డలకు మధ్యలో బొక్కలెందుకుండాయి?
'ఓహో, సుమారైన గాలికి గుడ్డ చినిగిపోకండా యేమోలే'
'పులివెందుల పులి!'
'గాండ్రిస్తాడా? పులికి మాదిరిగా మీసాలుంటాయా?'
'రాయలసీమ టైగర్'
'కడప కర్నూలు చిత్తూరు అనంతపురం - వోలు మొత్తానికే? ఐతే సూడాల్సిందే'
మండుటెండలో మిట్టమధ్యాహ్నం మా వీరబల్లె శాఖాగ్రంథాలయం ముందర, రాయచోటిబస్సు నిలిచే చోట బ్రమ్మాండమైన సభ. ఆ జనంలో నిలబడితే జనం తొక్కి సంపుతారని, మనకు టైగర్ కనబడాలంటే ఏదైనా మిద్దెక్కాల్సిందేననీ, బేగ్ అంగడిమిందికి ఎక్కినాం - నేనూ నా క్లాసుమేట్లూ.
చిక్కటి మీసాలు. గొప్ప చిరునవ్వు. తెల్లటి పలువరస. తెల్ల చొక్కా. నల్ల కళ్లద్దాలు. ఆయన మాట్లాడుతూ వుంటే యండలో నిలబడి సావధానంగా నిశ్శబ్దంగా వింటూవున్న జనం. మధ్యమధ్యలో చప్పట్లు, ఈలలు. సభ అయిపోయిన చాన్నాళ్లదాకా, ఆయన గఱించిన మాటలు, ఆ మాటలు చెప్పే వినే జనంలో కనబడే వెలుగూ వద్దన్నా తెలిసిపోతాయి ఎంత చిన్నపిల్లవానికైనా.
ఆ తరువాత నేనెప్పుడూ రాజశేఖరరెడ్డిని ప్రత్యక్షంగా చూడలేదు. ఆనాటినుంచి ఈనాటివరకూ రాజశేఖరరెడ్డి గుఱించి ఎవరు మాట్లాడినా అదే వెలుగు.
ఆయన ఏం చేసినా ఒక ఫోర్స్. ఆయన హీరో అనిపించిస్తే హీరోయే. విలన్ అనిపించినా హీరోయే. హింసా రాజకీయాల నేపథ్యం నుంచి, ఎవరి అండదండలూ లేకుండా, సొంతంగా యావదాంధ్రదేశంలోనే తిరుగులేని నాయకునిగా పైకెదిగిన మనిషి కాబట్టే, తనవారుగానీ పెరవారుగానీ అదే బిగితో అభిమానించడం. ఆ వెలుగు గ్లామర్. ఆ ఆత్మశక్తి గ్లామర్. ఆ మొండిపట్టుదల గ్లామర్.
నల్లమల కంటే గట్టి కొండలనెన్నింటినో గుద్ది పిండిజేయగల ధీశాలిగా పేరొందినవాడు. ఉక్కు సంకల్పం గల మనిషి రాజశేఖరరెడ్డి! క్షేమంగా వస్తాడని, తన సాహస యాత్రను కొనసాగిస్తాడనే ఆశించాను. అదే కదా మొన్నటిదాక ఆయన స్టైల్?!!
Ram Bhai, Where are you from?
I am from Kadapa.
Ohhh
Do you know Kadapa?
Your CM, YSR's place, yes?!
Yes! Kadapa!!
అని చెబుతున్నప్పుడు మనసులో కించిత్ గర్వం.
ఇట్లాంటి చిన్నచిన్నవేననుకుంటా... కడపవానికైనా కానివానికైనా కంటతడిపెట్టించేవి.

కామెంట్‌లు
చంద్రబాబు నాయుడు హయాంలో ఓ రోజు అసెంబ్లీ సమావేశాలప్పుడు, ఈయన మాటలు విన్న మా నాన్నగారు, ఈయన్నెక్కడో చూశానని, గుర్తు చేసుకోడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు, ఈయనది కడప జిల్లా అని తెలిసిన తర్వాత మా నాన్నకు గుర్తొచ్చిందిట. అప్పట్లో సిజేరియన్ చేసి, బిడ్డకు ప్రాణం పోసిన ఆ డాక్టరు గారే ఈయన అని.
ఆయన ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
Telugulo kotte opika ippudu ledu bossu..
nenu ayanaku personal ga abhimanini.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.