పొద్దుపోని యవ్వారం - 11

ఇంతకూ ఏమంటారు కొత్తపాళీగారు?
ఈ వారాంతం తీరిక లేదంట!

ఏమంట?
శతజయంత్యుత్సవాలంట.

ఉత్సవా-లు? ఎన్నేమిటీ?
మూడు. ముగ్గురికి. వాళ్లు పుట్టి నూరేండ్లు నిండబోతున్నాయంట.

ఎవరయ్యా ఆ త్రిమూర్తులు?
కొడవటిగంటి కుటుంబరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, త్రిపురనేని గోపీచందు.

వీళ్లకా? హహ్హహ్హహ్హ..!!
ఎందుకు నవ్వుతావు?

నేను పుట్టిన దశాబ్దం మొదట్లోనే మొదటి ఇద్దరికీ నిండిపోయాయన్నారు నూరేండ్లూ. అంతకు రెండు దశాబ్దాలముందే గోపీచందుకు నిండిపోయాయన్నారు. ఇప్పుడు మళ్లీ నూరేండ్లు నిండబోతున్నాయంటూ పండగలు చేస్తున్నారంటే యేమనుకోవాలి?
????

కొ.కు. 1980లో, శ్రీశ్రీ 1983లో, గోపీ 1962లో మహాప్రస్థానం చేశారు. స్వర్గంలో కొత్తకొత్త కథలూ కవితలూ వినిపించడానికి. అసలు స్వర్గమూ అదీ అంటే హేతువాదులూ వీర నాస్తికులు వీళ్లొప్పుకోరేమో కూడా.
మరీ విపరీతం మనిషివి నువ్వు. కొ.కు. 1909లోనూ, శ్రీశ్రీ-గోపీచందులు 1910లోనూ పుట్టారు తెలుసా? ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్పరచయితలూ మహాకవులూ వీళ్లు.

ఐతే ఏమంటావు?
మూడు మాటలు.
1. నీకు నుడికారం బాగా తలకెక్కిందని.
2. మహాకవులకు మరణం లేదనీ, వయసుతో నిమిత్తంలేదనీ.
3. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ - వీళ్ల రాతలు చదవవోయ్ అనీ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు