పొద్దుపోని యవ్వారం - 10

"అలో"
"..."


"నిన్నే"
"ప్చ్.."

"ఏమయిందలా వున్నావ్"
"పోయింది"

"..?? ఏం పోయింది?"
"ఏదైతే పోకూడదో అదే పోయింది"

"అంత ముఖ్యమైన వస్తువు ఏందబ్బా! పోతే మళ్లీ కొనొచ్చుగదా?"
"వస్తువు కాదు"

"మరి? మనిషా? మనసా?"
"కాదు! కాదు!!"

"ఇంకేముంది నువ్వు పోగొట్టుకోవడానికి?"
"పురుషలక్షణం."

"వోవ్..! వోవ్..!!! ఏం జరిగిందేమిటి?ఏదైనా తగిలిందా?ఎవరితోనైనా ఎక్కడైనా గొడవా?"
"ఇంకెక్కడ! అఫీసులోనే. గొడవేం లేదు. మర్యాదగా పిలిచి, మెత్తగా మాట్లాడి, చెప్పి మరీ తీసేశారు."

"మ్...?!! వాళ్లు తీసేసింది నీ ఉద్యోగమేనా?"
"ఔను."

"వార్నీ! చంపేశావు గదా! ఓసోస్..."
"ఉద్యోగం పురుష లక్షణం అన్నారు తెలుసా! అదే పోయింతరువాత..."

"మగవానికి ఉండాల్సిన సవాలక్ష దరిద్రపు లక్షణాల్లో ఉద్యోగం ఒకటి. అంతే. అంతకు మించి ఊహించుకోకు."
"..."

కామెంట్‌లు

జీడిపప్పు చెప్పారు…
ఓస్... ఆఫ్టరాల్ జాబేనా పోయింది :)
http://jeedipappu.blogspot.com/2009/07/who-moved-my-cheese.html
http://rapidshare.com/files/58649180/DS_WMMC.rar
రవి చెప్పారు…
కంపనీ వాడు ఒక మేధావిని కోల్పోయాడు. అది వాడి ఖర్మ! మనకు బొచ్చు కూడా ఊడదు.
sunita చెప్పారు…
welcome to the club.
oremuna చెప్పారు…
Cool.

ఏది జరిగినా మన మంచికే.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము