ఇటీవలి కాలంలో నాకు నచ్చిన కథ
అరగంట ముందు ఒక కథ చదివాను ఆంధ్రజ్యోతి[ఆదివారం అనుబంధం]లో. మీరు ముందు కథను చదివిరండి. కిందున్న రెండుముక్కలూ చదవాలనిపిస్తే ఆ తరువాతెప్పుడైనా చదవొచ్చు.
ఒక్కసారి చదివిన వెంటనే నాకే మనిపించిందంటే:
అందమైన మాండలికంలో సరళంగా సాగిన కథ. చిరకాలం గుర్తుండే కథ. స్వయంగా బతకగల నేర్పు, స్వేచ్చగా బతకాలనే ధీమా కలిగివుండటమే మనిషికి మొట్టమొదటి సంప్రదాయం కావాలి. అప్పుడే సాంగ్యాలూ, పండగలూ, పర్దాలూ మనిషికి సంతోషాన్నిస్తాయి. ఆ నేర్పూ ఆ ధీమా లేకపోతే సంప్రదాయాలే సంకెళ్లవుతాయి.
ఈ కథలోని జేజికి ఆ ధీమా వుంది. ఆమె సొంతంగా బతగ్గలిగింది. అంత ధీమా ఆమె కొడుకుకు లేకపోయింది. ఇక మనవరాలికి ఎలా వస్తుంది?! తమకాళ్లమీద తాము నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగించడమే కదా తల్లిదండ్రులు పిల్లలకివ్వగలిగిన బహుమతి?!
మళ్లీ చదివితే మరిన్ని పార్శాలు కనిపిస్తాయా కథలో. ఔనంటారా?
కామెంట్‌లు
పరదాలూ ఘోషాలూ నా చిన్నప్పటికన్నా ఇప్పుడు మా ఊర్లలో పెరిగిపోయాయి.కారణాలు ఆర్ధికమైనవైనా, మతపరమైనవైనా స్త్రీలను "అణగదొక్కడానికి" అనారోగ్యంపాలు చెయ్యడానికీ తప్ప మనుషులుగా బ్రతకడానికి పనికిరాని ఈ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.