వరసబెట్టి ఒక తొంభై కథలు ...

తెలంగాణ కథలు ...
వరసబెట్టి ఒక తొంభై కథలు ...
నూరేండ్ల ముందటి మాడపాటిహనుమంతరావు కథతో మొదలు. పీ.వీ.నరసింహారావు అరవైయేండ్ల ముందు రాసిన కథొకటి. దొరల గడీలు, దొరసానుల గారడీలు, పటేండ్ల పరువులు, పనివాండ్ల పరుగులు, పనిమంతుల కథలు, పనికి'రాని'వాళ్ల పాట్లు, కులాల - కులవృత్తుల వృత్తాంతాలు, సాయబుల ఇండ్లల్లో సమాచారాలు, అన్నల గన్నుల కథలు, అన్నల గన్న అమ్మల కథలు, భూనిర్వాసితుల కథలు, భూస్వామ్యానికి బీటలు, రజాకార్ల నాటి రాజకీయాలు, కాలం తెచ్చే మార్పును పసిగట్టగలిగిన గట్టిపిండాల కథలు, మార్పుకు తట్టుకోలేక 'మనాది'తో మగ్గినవాళ్ల కథలు, తెలంగాణ నుడికారపు మజా ఏమిటో రుచిచూపించిన కథలు ...

గడచిన నూరేండ్లలో తెలంగాణ ప్రాంతంలో జన జీవనంలో మార్పుల క్రమాన్ని కళ్లముందు నిలిపే కథలు ...

ఈ కథలన్నీ చదివాక తెలంగాణ సమాజపు వందేళ్ల చారిత్రక చిత్రం సజీవంగా నా ముందు నిలబడినట్లనిపించింది. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇది ఏ ఒక్కరిద్దరు చరిత్రకారులో రాసినవి కావు. సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, దాశరథి రంగాచార్య, చెరబండరాజు, మాదిరెడ్డి సులోచన, అప్సర్, కాలువ మల్లయ్య... ఇలా నాటి నుంచి నిన్నామొన్నటి వరకూ ఎందరో కథకులు ... రాజుల గురించి, శాసనాల గురించి, తేదీలతో సహా రాసినవి కాకపోవచ్చు కానీ జనసామాన్యపు జీవితాలే కథలుగా రూపొందించిన వీళ్లను ఆధునిక చరిత్రకారులు అనవచ్చు ననిపిస్తుంది.

తెలంగాణ కథలు చదివి పక్కనపెట్టి ఒళ్లు విరుచుకుని మళ్లీ కుర్చీలో కూలబడి, "తెలంగాణ చరిత్ర అనగానే, ఒక మదమెక్కిన దొర, 'బాంచెన్ కాల్మొక్త' అనే బడుగుజీవి, దొర అన్యాయం, బడుగుజీవి ఆర్తనాదం, ఒక వీరుని తిరుగుబాటు, దొర అంతం లేదా వీరుని విషాదం, మారని బతుకులు ... ఇది మెదిలేది నా మనసులో. కారణం? కౄరులైన ధనవంతులు, దీనులైన బీదలు తప్ప - ఇతరవిషయాల గుఱించి నేనెప్పుడూ తెలుసుకోకపోవడం. ఎర్రసైన్యం, చీమలదండు, ఒసేయ్ రాములమ్మా వంటి సినిమాల ద్వారా తప్ప మరోవిధంగా అక్కడిజనం గుఱించి తెలిసింది దాదాపు శూన్యం. చరిత్ర తెలిస్తేనే కదా వర్తమానం కొంతైనా అర్థమౌతుంది? తెలంగాణ మనకు ఎంతో దూరంలో లేదు. ఐనా దాని గురించి మనకు తెలీదు. తెలంగాణ వరకూ ఎందుకు? ఇప్పుడు మన ఊరి సర్పంచి ఎవరు? మన పంచాయతీ ప్రెసిడెంటును ఎన్నుకొని ఎన్నాళ్లయింది? వాళ్లు చెయ్యాల్సిన పనులేమిటి? చేస్తున్నవేమిటి? అసలు వీళ్లనెవరు ఎన్నుకుంటారు? --- ఎప్పుడైనా పట్టించుకుని వుంటేకదా! ఇలాంటి 'పరిసరాల విజ్ఞానం' తలకెక్కితే చదువులు సం..కిపోతాయని కదా మనం నేర్చుకున్నది!? పరిసరాల విజ్ఞానమంటే గుర్తొస్తోంది, పరిసరాల విజ్ఞానంలో నాకు పదోతరగతిలో నూటికి తొంభైఎనిమిది మార్కులు! ధృవపత్రం కూడా వుంది నా విజ్ఞానానికి కొలమానంగా! ..." ఇట్లా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాన్నమాట. :-)

కామెంట్‌లు

రానారె చెప్పారు…
శ్రీకర్(http://www.blogger.com/profile/13205600497997780746)గారూ,

ఈ టపాను ఈ బ్లాగులో వేయాల్సింది, పొరబాటున మరో బ్లాగులో వేశాను. మీరు కామెంటే వరకూ గమనించలేదు. ఇప్పుడిక్కడికి మార్చాను. మీ వ్యాఖ్య పోయింది. క్షమించండి.
Chari Dingari చెప్పారు…
ee saari india vellinappudu konukkuntaanu..thank you for reviewing it, why don't you write this in pustakam.net in detail?
కొత్త పాళీ చెప్పారు…
మంచిది! :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం