ప్రపంచపు ప్రకృతేమిటన్నది ...
మన చుట్టూ వున్న ప్రపంచపు ప్రకృతేమిటన్నది తెలుసుకొనే ప్రయత్నం ప్రతి మనిషీ నిరంతరం చేస్తుంటాడనుకుంటా. కొన్ని సందేహాలుంటాయి. కొన్ని మానసికమైన అవరోధాలుంటాయి. కొన్ని శూన్యతలుంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ కొన్ని స్వీయ అనుభవాలవల్లా కొందరి మాటలవల్లా ఇవి తొలగుతూవుంటాయి లేదా మారుతూ వుంటాయి. అలాంటి ఒక అనుభవం జయప్రకాశ్ నారాయణ్ మాటలు వింటూవుంటే కలిగింది. ఆయన మాటల్లో నాకు ముఖ్యమైనవనిపించిన కొన్నింటిని వింటూ టైపించాను. వాలుఅక్షరాల(Italics)లో వున్నవి నా అభిప్రాయాలు.
1. దేశం బాగుండాలంటే మనం మహాత్మాగాంధీలం కావాలనుకుంటాం. అక్కర్లేదు. We are ordinary mortals. (దేశము బాగు లాంటి మాటలు వినగానే నా భుజాలమీద ఏదో పెద్ద బరువున్నట్లు మొహంమారకపోతే నేను చంద్రమండలంమీదో అంతరిక్షంలోనో వున్నట్టనిపిస్తుంది తప్ప భూమ్మీదున్నట్టనిపించదు)
2. ఎన్టీయార్ గొప్ప nobility ఉన్న మనిషి. ఆయనలో అవతలిమనిషిలో కాస్త మంచితనం ఉందనుకుంటే ఆదరించే వ్యక్తిత్వమున్నది, అవతలిమనిషిలో ఆత్మగౌరవముంటే దాన్ని గుర్తించే వ్యక్తిత్వమున్నది. (ఎన్టీయర్ వ్యక్తిత్వం గురించి ఈ మాటలు చెప్పినవాళ్లను నేను చూడలేదు - ఆయనతో వ్యక్తిగత పరిచయమున్నవారితో సహా)
3. ఆంగ్ సాన్ సూచీ. కోరి కష్టాల్లోకి వచ్చింది. ఆమె దేశం వదిలి వెళ్లిపోతే మళ్లీ రానివ్వరు. వాళ్లకు కావలసింది ఆమె వెళ్లిపోవడమే. పన్నెండేళ్లుగా జైల్లో వుంది. ఇప్పుడు గాకపోతే ఇంకొన్నేళ్లకు. ఆమె ఆదర్శం, త్యాగం దేశాన్ని మారుస్తుంది. నెల్సన్ మండేలా ఇరవైయ్యేళ్లు జైల్లోవున్నాడు. (అవగాహన లేకుంటే ఆశావాదం వుండదేమో)
4. It is a mouth-piece for their idealism. అంతే. లోక్ సత్తా అంటే ప్రత్యేకంగా ఏమున్నది? ఇదొక example అంతే. కాబట్టి time and again ... ఇప్పుడు, రంగ్ దే బసంతి ఎందుకంత హిట్టయ్యింది?
5. ఇందులో Hypocrisy ని youth సహించదు. There is no doubt about it. లోపాల్లేవా? ఉన్నాయ్. ఇంకో దేశంలో లేవా? అమెరికాలో లేవా? బ్రిటన్‌లో లేవా? జర్మనీలో లేవా? అన్ని దేశాల్లో ఉన్నాయ్. There are always sick people in a society. (గొప్ప దేశాలు అని నేను చిన్నప్పటినుంచి విన్న దేశాల్లో కూడా తెలిసి చేస్తున్న లోపాలు, పరమ కౄరమైన రాజకీయాలు, అణచివేతలూ, ఆకలిచావులూ, పేద-ధనిక తారతమ్యాలు, హింస అన్నీ వున్నాయనే గమనిక నాకిటీవలే కలిగింది)
6. ఒకటి - చిన్న పిల్లలకు చందమామను చూపెట్టి గోరుముద్దలు పెట్టడం అవినీతి కాదు. ఆలోచనల్లో క్లారిటీ వుండకపోతే మన analysis ఎప్పుడూకూడా సమస్యను మరింత జటిలం చేస్తుంది. కాబట్టి అది అవినీతి కాదు. మొట్టమొదట మనకు క్లారిటీ వుండాలి. - రెండు - మన దేశంలో ఎప్పుడూ అవినీతి, నీతి అనగానే morality కింద నైతికమైన విషయంగా చూస్తున్నారు. అది కాదు. అది కానేకాదు. నూటికి తొంభైయైదు సందర్భాల్లో. మన లాంటి పరిస్థితుంటే ప్రపంచంలో చాలా దేశాల్లో లంచమిచ్చేవాళ్లుంటారు. ఆదేశాల్లో ఒకప్పుడు భయంకరమైన అవినీతి వుండేది. ఇవాళ నీతొచ్చింది.
....
... కానీ, నా అంత పలుకుబడీ పరపతి వున్న మనిషికూడా తొంభైయారులో IAS నుంచి రాజీనామా చేసి ఒక ఫోను కావాలంటే అడగాల్సొచ్చింది - ఎంపీ దగ్గర. ఐనా నాకు ఫోన్ రాలా. సరే మామూలుగానే వచ్చింది, ఆ పాటికి వాళ్లు నిబంధనలేవో సడలించారు, కొంచెం త్వరగానే వచ్చింది నాకు. ఇవాళ ఒక మారుమూల గ్రామం నుంచి ఎవరైనా ఫోను కావాలంటే పక్కింటికెళ్లి ఒక ఫోనుకొట్టివస్తే ఇరవైనాలుగ్గంటల్లో ఫోనొస్తుంది. ఒక్ఖ లంచమక్కర్లేదు. అంటే మంత్రులంతా మహాత్ములైపోయారా ఇప్పుడంతా? Telephone department వాళ్లుగానీ లేకపోతే telephone owners గానీ? పరిస్థితులు మారినై. అవినీతనేది మొరాలిటీని గురించి కాదు, నూటికి తొంభై సందర్భాల్లో. అది compulsions, incentives, circumstances. తప్పనిసరి పరిస్థితుల్లో. మీ రా పరిస్థితిని మారిస్తే, టెలిఫోన్ల (విషయంలో) మారిపొయినట్టుగా అదే రీతిన అవినీతి చాలా సందర్భాల్లో చచ్చిపోతుంది. (ఇదొక కొత్త కోణం)
రెండోది - మన దేశంలో guilt complex చాలా ఎక్కువ. ప్రతివాళ్లు కూడా అవినీతి గురించి మాట్లాడగానే, 'నేను వానికి లంచమిచ్చానుగదా యాభైరూపాయలు, నేను కూడా అవినీతిపరుణ్ణైపోయాను. నేనేం మాట్లాడతాను! మాట్లాట్టానికి వీల్లేదు' అనుకుంటారు. కాబట్టి అంతా అవినీతే. ఎందుకంటే, లంచం ఇవ్వకుండా వున్నోళ్లు మనలో ఒక్కరు కూడా లేరు. నాతో సహా. కాబట్టి దీనికి సొల్యూషనేమిటంటే ఇప్పుడు టెలిఫోన్లలో చేసినట్టుగా, birth certificates computerize చేసినట్టుగా ఒకోదానికి ఒకో treatment ఉంటుంది. కాన్సర్ లాంటిదిది. అన్నిటికీ ఒకటే treatment వుండదు. So you eliminate all these factors, a lot of corruption will go. అంతేగాని, అవినీతనేది .. భారతదేశంలో వున్నవాళ్లంతా దొంగలు, దుర్మార్గులు, మనం చెడ్డవాళ్లం పుట్టుకతో, కాబట్టి అవినీతి వుంది.. ఈ ఆలోచన పోవాలి. (ఇక్కడ చెప్పబడిన guilty complex కు నేనూ ఒక రూపాన్ని)
7. నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ మెచ్చిన ఒక సినిమా? Sleuth (1972 అనుకుంటాను. 2007 కాదు.)
8. ఈరోజుల్లో fiction అంతగా లేదుకానీ ఒకప్పుడు రోజుకో పుస్తకం చదివేవాణ్ణి. రోజుకు కనీసం ఒక్కటి. Exams ఉన్నాగానీ, exams పక్కనబెట్టి చదివేవాణ్ణి. Just now I am reading Warren Buffett's autobiography. అట్లాగే new book కాకపోయినాకూడా one book that interested me a great deal in recent years is a book called Guns, Germs, and Steel by Jared Diamond. ఆఫ్రికా ఆఫ్రికాలా ఎందుకుంది? యూరప్ అలా ఎందుకుంది? ఏషియా అలా ఎందుకుంది? దీని వెనకాలున్న కారణమేంటని it's a super...b study. It's a masterly study అన్నమాట. It's a deep insight understanding. It's one of the finest books in the modern era.
9. ఇది martyrdom అనుకోనక్కర్లేదు. బరువనుకోనక్కర్లేదు. మహాత్మాగాంధీ చాలా కష్టపడిపోయాడు, వంగిపోతుంటాడు .. అలా అనుకోనక్కర్లేదు. It is simply simple. మనమేమంటున్నాం? మంచినీళ్లు తాగితే మరణశిక్ష వద్దయ్యా అంటున్నాం. మన భోలక్‌పూర్‌లో పాపం మంచినీళ్లు తాగారు, అంతకంటే ఇంకేం చెయ్యలేదుగా వాళ్లు? It's a shame. It must make us very angry. దాన్ని మార్చడం అసాధ్యం కాదు. We have the opportunity. (ఎందుకు చెయ్యట్లేదండీ?) ఆ ప్రశ్న అడగటమే..that's politics, that's public life. కాబట్టి 'నేనెంత గొప్పవాణ్ణైనా, నాకెంత అవకాశాలున్నప్పటికీ కూడా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా నేడోరేపో ఏదో ఒక రూపంలో నేను కూడా నష్టపోతాన'న్న స్పృహ వుండాలి. ప్రపంచంలో కాస్త మంచి చేద్దామనుకున్నవాళ్లంతా .. వాళ్లు మహాత్ములు కాదు. Common sense ఉన్నవాళ్లు, దీర్ఘకాలస్వార్థం వున్నవాళ్లు. దీనికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. స్వార్థమే కావలసింది. కాకపోతే ఈ క్షణం కాకుండా రేపు సంగతి ఆలోచించాలి. ఇదేం పెద్ద బరువైన సంగతి కాదు.
10. నెగ్గేవానికి ఓటు వెయ్యకపోతే waste ఔతుంది అనుకోవడం..పోటీచేసేవాడు ఎంత దుర్మార్గుడైనా సరే, రాక్షసుడైనా సరే. ఓటు..ఓటువేసేవాని గుఱించి అనుకోవటంలా. ఓటు..మన పిల్లల గురించి అనుకోవటంలా. ఓటు పోటీ చేసేవాని గురించి అనుకుంటున్నాం. ( పోటీ చేసేవానికోసం కాదు, ఓటున్నది మనకోసమనే అవగాహన ఓటర్లందరికీ త్వరలోనే కలుగుతుందని ఆశ)
11. ఎవ్వరూ మనకు హీరో కాదు. మనమే మనకు హీరో.
[రవితేజ/పూరీ 'ఇడియట్' సినిమాలోని మొదటిపాటలోని పదాలు 'బిల్ గేట్సె గొప్ప కాదురా..ఓరయ్యరయ్య..నీకు నువ్వె కింగు సోదరా' గుర్తొస్తున్నాయి :-) ]
12. లోక్‌సత్తా ప్రచారానికి ప్రకటనలు రూపొందించినవాళ్లెవరు? (రాళ్లెత్తిన కూలీలెవరు టైపులో)
13. కూకట్‌పల్లిలో building regularization scheme కథేమిటి? 'సమాచార హక్కు' కథాకమామీషు ఏమిటి? [నొక్కే చోట నొక్కాల..నక్కే చోట నక్కాల.. :-) ]
14. పిచ్చిపనులు చెయ్యనివాళ్లెవరూ వుండరు. [ నో కామెంట్ :-) ]
15. ఒకటోది - The joy of success - you can experience it only when you struggle. రెండోది - Be cheerful and optimistic. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే, we live in the best of all possible worlds. మనకిప్పుడున్నంత అవకాశాలూ ఇప్పుడున్నంత technology, మన జీవితాన్నీ మన చుట్టుపక్కనున్నవారి జీవితాల్నీ బాగుచేసుకునే అవకాశం ప్రపంచంలో మరెప్పుడూ లేదు. మూడోది - A life which is not angry about wrong things is not a worthy life. Be angry, be optimistic and work hard.
16. Assemblyకి పంపించింది walkout చెయ్యడానిక్కాదు speak-out చెయ్యడానికి. [ ముఠామేస్త్రి లో వాడకపోయామే అని పరుచూరి సోదరులు నాలిక్కరుచుకునే డయలాగిది :-) ]
17. సంకల్పమూ చిత్తశుద్ధి వున్నప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడూకూడా మనిషికుండే moral authority సమాజాన్ని నడిపిస్తుంది. [..am listening..]

కామెంట్‌లు
"We live in the best of all possible worlds."
దేశభక్తి అనలేను గానీ: చిన్నప్పట్నించీ ఈ భావన వుండేది, ఇప్పుడూ వుంది, ఎప్పటికీ పోదేమో కూడా. ఎలా పేరుకుపోయిందో మరి ఈ అన్‌కండిషనల్ లవ్! అవినీతి, అలసత్వం, పేదరికం, మతమౌఢ్యం, అసమర్థ రాజకీయం... ఎన్నైనా చెప్పండి: I wouldn't exchange my country for heaven.
మంచి టపా, నాకు నచ్చింది.
ఇలాటి మార్పు దేశమంతటా వస్తుంది ..సమాజంలో నిజాయితిపరులకి కొదవలేదు ..కాకపోతే రాజకీయాల్లో నిజాయితిపరులు వెనుకపడ్డారు ..జే పీ గారు జ్యోతి వెలిగించారు ..మనంకలసి రాజకీయాల చీకటిని పారత్రోలాలి ......
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.