ఆకాశదీపం

వారం రోజులుగా ఆకాశదీపం అనే పదం నా తలలో తిరుగుతోంది. ఏదో సినిమాపాటలో విన్నాను! ఎన్నోసార్లు విన్నట్టే వుంది. గుర్తు రాలేదు. దాని అర్థమేమిటో నాకు తెలీదు. ఆకాశంలో చుక్కేమో అనుకున్నాను. లేకపోతే సూర్యుడా? గూగులిస్తే వెంటనే దొరికింది శ్రీశ్రీ కవిత.

ఈ పదాన్ని శ్రీశ్రీ కంటే ముందు ఎవరైనా ఎక్కడైనా వాడారా? అసలు ఆకాశదీపమంటే ఏమిటి?

కామెంట్‌లు

ఆకాశ దీపం అంటే దేవాలయాల్లో కార్తీక మాసంలో ధ్వజ స్థంభానికి పైన వేలాడ దేస్తారు. అది మాత్రమే నాకు తెలుసు.

మీ పరిచయం బాగుంది. :)
రాఘవ చెప్పారు…
ఆకాశదీపాలు సనాతన భారతీయ సంప్రదాయంలో భాగమే కదా!!! దీపావళి తర్వాత ఆకాశదీపారంభః అని పంచాంగాల్లో కూడా చూసిన గుర్తు.
రానారె చెప్పారు…
@ప్రేమికుడు, రాఘవ: నెనర్లు. కానీ మా వూళ్లో ఈ మాటను నేనెప్పుడూ వినలేదు. మ రే వూళ్లోనూ విన్లేదు. ధ్వజస్థంభంపై వేలాడదీసే దీపమే ఆకాశదీపమన్నమాట.

ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశదీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
నింగీ నేలా కూడే వేళ
నీకూ నాకూ దూరాలేల!

'ఆకాశదీపం' ఏపాటలో విన్నానో గుర్తొచ్చింది. శ్రీశ్రీ కవిత కంటే ముందు ఎవరి రచనలోనైనా ఈపదం ఉపయోగించబడటం చూశారా!?
రవి చెప్పారు…
మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది

పాట కోసం వచ్చాను ఇక్కడికి. ఆకాశదీపం కోసం కాదు.
S చెప్పారు…
శ్రీశ్రీ కంటే ముందో వెనుకో నాకు తెలీదు కానీ, జరుక్ శాస్త్రి - "శరత్ పూర్ణిమ" కథలో ఈ పదం వాడారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం