మన కులానికే మన ఓట్లు
చదువుకునే రోజుల్లో ఓటు వెయ్యాలనే ఆలోచనే నాకెప్పుడూ కలగలేదు. అందరూ వ్యాపారులేగానీ ప్రజానాయకులెవరూ లేరనే అభిప్రాయం నాది. అందుకే ఓటరు జాబితాలో నాపేరు కూడా నమోదు చేసుకోలేదు. నేనెప్పుడూ చదువులపేరుతో ఊరిబయటే ఉంటాననుకున్నారో, వాళ్లకే ఓటేస్తానన్న భరోసా లేదనుకున్నారో, నాలాంటివాళ్లు ఓట్లేయడం ప్రజాస్వామ్యానికి క్షేమం కాదనుకున్నారోగానీ మావూళ్లోని ఏ పార్టీవాళ్లూ పట్టుబట్టి నాపేరును ఆ జాబితాలోకి ఎక్కించలేదు.
నాకీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. అయినా రాష్ట్ర రాజకీయాల వార్తలను చాలా దగ్గరగా చూస్తున్నాను. ఇప్పుడు ఓటు వేద్దామనిపిస్తూ వుంది. లోక్‌సత్తాకు. ఎన్నికల సంఘం చెప్పిన నియమావళిని పాటిస్తూ రాజ్యాంగంపట్ల మనకుండవలసిన గౌరవాన్నీ క్రమశిక్షణనూ చాటుతూ, నేటి రాజకీయగంజాయివనంలో తులసిమొక్కలా నిలిచిందన్న ఒకే ఒక్క కారణం చాలు లోక్‌సత్తాకు ఓటు వేయడానికి. ఈ కారణం మాత్రమే చాలు.
లోక్‌సత్తాకు ఓటు వేస్తే మీ ఓటు వృధా అవుతుందని కొందరంటున్నారు. ఇంతకంటే పాపపు ప్రేలాపన ఇంకొకటి లేదు. గెలిచే అభ్యర్థి ఎవరో వాళ్లే మనకు చెప్పేసి, ఆ అభ్యర్థికి ఓటు వేస్తేనే అది సద్వినియోగం అవుతుందన్నట్లు ప్రచారం చేస్తున్నారు వీళ్లు. ఎన్నికలంటే కోడి పందాలు అనుకునే బాపతు వీళ్లు. తొందరగా పెరుగుతుందని, కరువుకు తట్టుకొని నిలబడుతుందని మన పెరట్లో తుమ్మచెట్టును పెంచుకొమ్మని నమ్మబలుకుతున్నారు వీళ్లు.
'కులములోన నొకఁడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత' అన్నాడు వేమన్న. మా గ్రామంలోనూ, మా పక్కనున్న గ్రామంలోనూ ఈసారి ఓటు వేస్తున్న యువతీయువకులు గెలుపోటముల అంచనాలతో నిమిత్తం లేకుండా లోక్‌సత్తాకే ఓటు వేయాలని నిర్ణయించుకొన్నారని విని నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. ఈ మహత్ సమయంలో వారిలో నేనూ ఒకనిగా లేకపోతినే అనే బాధకు లోనవుతున్నాను.
ఈనాటి రాజకీయ వాతావరణంలో మనుషులకున్నవి రెండే రెండు కులాలు - మంచివాళ్లు, చెడ్డవాళ్లు. ఏ కులానికి చెందినవారు ఆ కులానికే ఓటు వేస్తున్నారు. మీ దే కులమని అడిగితే అందరూ చెప్పేది మాత్రం మొదటికులం పేరే. రాజకీయ చైతన్యమంటే ఇదే కాబోలు!
కామెంట్‌లు
super :)
మా రానారె (రాకేశ్వర నాయిడు రెడ్డి) కూడా లోకసత్తాకి ఓటెయ్యడానికి బయలుదేరాడు. కానీ చివరికి ఎం జరిగింది.
వోటరు నెం ౫౦౦ ని అడిగి తెలుసుకోండి.
- రాకేశ్వర
అన్నట్టు నేను వ్రాసిన రానారె టపాలు చూసో ఏమో గాని, మొన్నెవరో నిషిగంధ గారు, రాకేశ్వర రావు రానారె ఒక్కటేనా అని అడిగారంట. :)
నిషిగంధగారు సరే, మీ టపా చదివి చావాకిరణ్ గారు ఏమన్నారో చూడండి! :)
నేను కూడా ఇప్పుడే గమనించాను - నాలుక్కరుచుకున్నాను. -)
రాకేశ్వరా మోసం చేశావ్ బిడ్డా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.