సోడా కేకూ సినిమా మరియు ...
బస్టాండులో వికారం
సోడా గ్యాస్ తాగడానికి
చేతిలో ఐదు రూపాయలు ...
బేకరీముందు సైకిలాపి
హనీ కేక్ కొనుక్కోడానికి
జేబులో పది రూపాయలు ...
లక్ష్మీరంగాలో కొత్తసినిమా
బాలేదంటలే అనుకోకపోతే
టికెట్టుకు ఇరవై రూపాయలు ...
సోడా తాగనోడు
కేకు తిననివాడు
సినిమా చూడనోడు
కడపలో ఎవడూ లేడు!
డిగ్రీ చదివేరోజుల్లో ఇవీ నా బృహత్తరమైన ఆలోచనలు. కడపలో బతికే ప్రతి మనిషికీ రోజూ ఓ ముప్పైఐదురూపాయలు వాటంతట అవే వచ్చి జేబులో పడితే బాగుండునని ఆనాటి నా బలమైన కోరిక.
కాబట్టి ఈమధ్యే చంద్రబాబునాయుడుగారు ప్రటించిన నగదు పంపణీ పథకాన్ని మెచ్చి, నా పవిత్రమైన(!) ఓటును వేసి గెలిపించేద్దామని కాదు నా ఉద్దేశం. వయ్యస్రాశ్శేఖర్రెడ్డిగారి జనా'కర్షక' పథకాలను మెచ్చి ఓట్లేస్తే ఎంత అభివృద్ధి జరిగిందో, ఎన్నికల సంఘం నిబంధనలొచ్చినా కూడా ఆ అభివృద్ధి ఆగకుండా అలా జరుగుతూనే ఉందో చూస్తున్నాం కదా! ఇంకా కొత్తగా కొన్ని పథకాలు వినవస్తున్నాయి - వందకే వంటసరుకులనీ ఇలాగ. ఊహూఁ ఇవన్నీ లాభం లేదు.
"రోజుకు జేబుకు ముప్ఫైఐదురూపాయల పథకం" రావాలి, దేశం బాగుపడాలి. అంతవరకూ మీరూ ఇలాంటి పథకాలకు మీ పవిత్రమైన(?) ఓటు వేయకండి. ప్రజలను బిచ్చగాళ్లను చేయడానికే ఇలాంటివి వస్తున్నాయని గగ్గోలుపెట్టేవాళ్లను అస్సలు పట్టించుకోకండి. కాబట్టి సోదరసోదరీమణులారా, చెయ్యి చాచండి. సోడాకోసం ఐదురూపాయలు ధర్మంచేసే ప్రభువుల సొల్లు వినడంలో తప్పులేదు. బేకరీకేకుల కోసం పదిరూపాయలిచ్చే దేవునిముందు మోకరిల్లడంలో తప్పులేదు. సినిమాలు చూపించి సేదదీర్చే మనసుకు సలాం కొట్టడంలోనూ తప్పులేదు. పశువులకొట్టాల్లో గడ్డిపోచల కోసం మోరలు చాచే గొడ్లలాగా అన్నమాట.
మనకూ మన తరువాతి తరాలకూ ముఖ్యంగా కావలసినవేమిటి? మంచి వసతులున్న ఆసుపత్రి, మంచి ఉపాధ్యాయులున్న బడి, మంచి పుస్తకాలున్న గ్రంథాలయము, మంచి నీళ్లూ... పైవేవియునూ కావు. మరేమిటీ? సోడా కేకూ సినిమా. ఇంకోటుంది. మన ఇంటిగోడమీద ఇందిరమ్మ బొమ్మ. ఇవీ!

కామెంట్‌లు
మన సోదరుడు భాస్కర్ రామి రెడ్డి బ్లాగు
http://chiruspandana.blogspot.com/2009/04/blog-post_11.html, లో నా కామెంటు ఒకసారి చదవండి రానారే గారు.
ఈ ఎన్నికల సమయంలో వాడిని బయటకి లాగి, ఈ పథకాల మీద ఇంకో టపా వ్రాద్దామనుకున్నాను, కానీ వేరేపనులుండి వ్రాయలేకపోయాను. వోటు వేశాక ఎదో టపా వ్రాశాను గాని అది అంత ఇదిగా లేదు.
-రాకేరా
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.