క్రియాసిద్ధిః సత్వే భవతి!

తాము ఆశించినట్టుగానే అందరూ బతకాలనుకునే తత్వం ప్రతిమనిషిలోనూ కొంత వుంటుందేమో.

జంతువుల్లో కూడా ఈ తత్వం కలిగినవి కొన్ని వుంటాయి. మిగతా జంతువులు తమకు బెదురుతాయోలేదో చూద్దామని ఎప్పుడూ ప్రయత్నిస్తూనేవుంటాయి. కొంచెం బెదురు కనబడిందా వాటి ఆనందానికి హద్దులుండవు. వాటి శక్తి ఎన్నోరెట్లు పెరుగుతుంది. అడవిమొత్తం కలయదిరుగుతూ మొత్తం పెత్తనం మాదేనంటాయి. గుంటనక్కల్లాంటి కొన్ని జంతువులు వాటివెనకే తిరుగుతూవుంటాయి.

కాకపోతే కొన్ని జంతువుల్లోనూ, కొంతమంది మనుషుల్లోనూ ఈ స్వభావం కొంచెం ఎక్కువగా వుంటుంది. ఎదుటివారిలో జంకు కనబడేవరకూ నానారకాల ప్రయత్నాలూ చేస్తూనే వుంటారు. జంకినట్టూ చీకాకుపడినట్టూ కనబడితే వాటికి పండగే. తమ సంఖ్య ఎక్కువగా వుందని చూపే ప్రయత్నం వాటిలో ఒకటి.

నేనీమధ్య దాదాపుగా బ్లాగులేవీ చదవడంలేదు. ఎవరో బెదిరిస్తే ఒకరిద్దరు బ్లాగులు మానేశారని/మూసేశారని తెలిసింది. మానేసి/మూసేసి వీళ్లెవరిని బెదిరిద్దామనుకున్నారో?!

రెండు బ్లాగువికెట్లు పడటం కొంతమందికి ఉత్సాహాన్నిచ్చినట్టుంది. ఇప్పుడే కదా బౌలర్లకు భయపడిపోకుండా నిలకడగా ఆడాల్సింది! జట్టు కొద్దిగా కష్టాల్లో పడింది. నేను నాటౌట్ అని క్రీజులో నిబడితే కాదనే అంపైరెవరూ లేరు. ఔటయ్యాక మళ్లీ క్రీజులోకి వచ్చినా అడిగేవాళ్లూ లేరు. :-)

వ్రాయడం మనకు ఆనందాన్నిస్తున్నప్పుడు ఎవరో కొందరికి నచ్చలేదని మానుకుంటామా? క్రియాసిద్ధిః సత్వే భవతి!

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
బాగా చెప్పారు.

క్రియా సిద్ధిః సత్వే భవతి
మహతాం నోపకరణే.
రాఘవ చెప్పారు…
రామనాథులవారూ చాలా చాలా థాంకులు...

దీనిని తవ్వితే పాతర దొరికింది. ఇంతకు ముందు చదివినదే ఐనా, మళ్లీ చదివినప్పుడు ఆ అనుభూతి వేరు.

ఈ సారి 11/10 వేస్తున్నాను :)
అజ్ఞాత చెప్పారు…
యూ హావే వే విత్ వర్డ్స్ రానారె.... మస్తు రాస్తవన్నా.. నా ఓటు మీకే.. ముక్కు పగిలేదాకా కాదు, పచ్చడయిపోయినా, నేనీ విధంగా ముందుకే పోతుంటా. (ఒక వికటాట్టహాసమును జోడించి చదువుకోగలరు)
రానారె చెప్పారు…
నెనర్లు. :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము