పొద్దుపోని యవ్వారం - 8
అధ్యక్షా! ... అనగానే నీకేం గుర్తుకొస్తుంది?
శాసనసభలో రాజశేఖరరెడ్డి బొంగురుగొంతు.
నాకూ ఆ వాచకమూ ఆకారమే మనసుకొస్తుంది
నీకేనేమిటి, తెలుగువాళ్లకెవరికైనా అంతే!
శాసనసభ్యులందరూ అధ్యక్షా అని ప్రశ్నలు వేస్తూవుంటారు కదా
అధ్యక్షుడున్నదే తడికరాయబారానికి కదా!
అంతేనా?
సస్పెన్షన్లు, వాయిదాలు, వగయిరాలు కూడా చేస్తూవుంటాడనుకో.
మరి, అధ్యక్షుడు ప్రశ్నలు వేయడా?
వెయ్యడు. వేసినా లాభంలేదని తెలుసుగనక.
ఎందుకనగా?
ఎందుకేమిటి? అధ్యక్షుడు ప్రశ్నలువేస్తే అవేమౌతాయో తెలుసా?
ఏమౌతాయి?!
అధ్‌యక్షప్రశ్నలు.
...?!
సమాధానం చెప్పే ధర్మరాజేడీ, అందునా ఆంధ్రదేశపు శాసనసభలో ???

కామెంట్‌లు
> ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే,
> అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10
> ఇలాగ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.