ఎలా వుంది ?
ఆదివారం మధ్యాహ్నం కావస్తోంది. ఆకలిగా వుంది. ఇల్లొదిలి బయటకు వెళ్లబుద్ధి కాలేదు. అంతలో ఫోను మోగింది. "మాంఛి సినిమా డీవీడీ ఒకటి తెచ్చాను, గురు, రాజూ, శ్రీ కూడా వస్తున్నారు, చూద్దాం" రమ్మని కల్లుమామనుంచి ఫోన్. లంచ్ సంగతి చెప్పమన్నాను. అందరం ఇక్కడే తిందాం రమ్మన్నాడు. ఆనందంగా వెళ్లాను.
అందరం సినిమా చూస్తున్నాం.
*** *** ***
యేఁవండీ...
టీవీలో శరత్‌బాబు శవాన్ని చూడగానే ఒక గావుకేక పెట్టి, నోట్లో కర్చీఫ్ కుక్కుకుంటూ కుర్చీలోంచి లేచాడు మా కల్లుమామ.
మేమంతా ఉలికిపడి కల్లుమామవైపు చూశాం. టీవీకేసి చూడమన్నాడు కళ్ల సైగతో.
ఆ వెంటనే టీవీలో అన్నపూర్ణ కూడా 'యేఁవండీ' అంటూ శరత్‌బాబు పార్థివశరీరంపై పడింది. పూలదండలను చిదిమేస్తూ, శరత్ బాబు ఛాతీపై బాదుతూ కుండపోతగా ఏడ్చింది.
నోట్లో నుంచి కర్చీఫ్ గుడ్డను వూడలాగి మరోసారి బావురుమన్నాడు కల్లుమామ.
మేమంతా కల్లుమామవైపు ఒక క్షణం చూసి వెంటనే టీవీవైపు చూశాం.
అన్నపూర్ణ కూడా బావురుమంది. గోడుగోడున ఏడ్చింది.
హృదయవిదారకమైన ఆ దృశ్యాన్ని pause చేసి, మా మొహాల్లోకి మార్చిమార్చి చూస్తూ "ఎలా వుంది?" అని కళ్లెగరేశాడు కల్లుమామ.
మేం నలుగురం ఒకరిముఖాలొకరం చూసుకున్నాం.
"ఏమైనా శరత్‌బాబు మంచి యాక్టరు..." _ రాజు.
"ఏడ్చినా అందంగానే వుంది" _ శ్రీ
"శరత్‌బాబుకు సరైన జోడీ" _ గురు.
"శారదయితే ఇంకా బాగుండునేమో!?" _ నేను.
"ద్రోహుల్లారా! ... వచ్చేటప్పుడు మీరంతా లంచిగానీ చేసొచ్చారేంట్రా?" _ కల్లుమామ!
*** *** ***
మామ సంగతేమోగానీ, మాకు మాత్రం లంచి బ్రమ్మాండంగా వుందనిపించింది.

కామెంట్‌లు
తెరెసాగారి వ్యాఖ్య చూసి కల్లుమామకు మేమిచ్చిన రియాక్షనే నాకూ ఇస్తున్నారేమోననుకున్నా. రామగారి వ్యాఖ్యచూసి బిగ్గరగా నవ్వుకున్నాను. క్షమించాలి, ఈ టపా మరీ ఇంత అన్యాయంగా వుందనుకోలా! చూద్దాం ఒకరికైనా అర్థమౌతుందేమో. :)
ఇదేనా మీ లంచ్...
ఏంటి రాము.. ఇలా అర్దంకాని టపాలు రాస్తే ఏలా???
'యాఁవండీ' దగ్గరనుంచీ, రెండుక్షణాల తరువాతరాబోయే సన్నివేశాన్ని (అదీ అన్నపూర్ణ ఏడుపుసీన్) తానే కామెడీగా నటించి చూపుతూ, ఎలా వుందని అడగడంతో...
'లంచికొచ్చి దొరికిపోయామనే అలుసు కాకపోతే ఇలా హింసిస్తావా' అనుకొని మేమూ అలా సంబంధం లేని సమాధానాలిచ్చాం.
అది సరే కానీ, అమ్మా నాన్న వచ్చారు - దగ్గర్లో హ్యూస్టన్ రావాలనుకొంటున్నాం. నీ నెం. పోయింది. ఒకసారి కాల్ చేయకూడదూ?
*క.యం.= కలనయంత్రం=కంప్యూటరు:-)
ఆ అర్థంలో నాకు చాలా నవ్వొచ్చింది.
కాబట్టి నేను -10/10.
minus for misunderstanding.
అన్నట్టు రమగారు మీ పేరుని Rama నుండి గుండ్రప్పటి అక్షరాల రమ కి మార్చుకోండి.
రాకేశ్వరం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.