బాలు - H
బాలు - ABCDEFG గురించి విన్నాం. కానీ నేను చెప్పబోయేది బాలు - H గురించి.
చాలా యేళ్లకు ముందు ఒకసారి మా మామిడితోటలో కాయలు కోయిస్తున్నాం. కోసేవాళ్లు ఎవరంటే మా తోటకు తూర్పున వున్న ఈడిగపల్లె యువజనులు. పరాచికాలకు పెట్టింది పేరు ఆ పల్లె. ఆ పల్లెలో ప్రతి మనిషికీ కనీసం ఒకటైనా అడ్డపేరుంటుంది. ప్రతి పేరు వెనుకా ఒక కథ. కొన్ని పేర్లలో ఎంత సృజనాత్మకత వుంటుందంటే గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకోవాల్సిందే. సరే, విషయానికొస్తే - ఆ రోజు ఒకాయన చెట్టెక్కి గట్టిగా పాట పాడుతున్నాడు.
చెట్టు పైనుంచి కోసి కింద వేసే కాయలకు దెబ్బతగలకుండా సంచిపట్టతో పట్టుకుంటూ కింద నిలబడి వున్న మనిషి, వీధి నాటకం శైలిలో అన్నాడు, "అహో ధర్మనందనా! ఎవరిదా కోగిల గానము? భరించనలవి గాకండా వుండాదీ!" దానికి సమాధానంగా ఆ చెట్టుమిందనున్న మనిషి - "నీ @క్an #$@&a, మామిడి కాయలతో కొట్టి సంపుతా. కోగిలేంది వాయ్? ఘంటసాల అను, ల్యాపోతే యస్పీబాలసుబ్బరమణ్ణెం అను" అంటూ ఒక మంచి కాయను నేలకేసి కొట్టేసినాడు. అది అన్యాయంగా పిచ్చలైపోయింది.
"ఒరే బాలసుబ్బరమణ్ణెమా, యా పొద్దన్నా అద్దంలో నీ మొగం జూసుకున్న్యా(వా)?"
"నా మొగానికేమిలే గానీ, నీ మొగమెప్పుడన్నా బాలసుబ్బరమణ్ణేన్ని జూసిందేనా?"
"సూడకేం వాయ్? ఐద్రాబాదులో జూసినా. ఆయప్పకు రోంత పట్నెత్తి (బట్టతల) గదా!?"
"ఐదరాబాదుకు పోయిన మొగమేలే నీది"
చిన్నప్పటి నుంచి రేడియోలో రోజుకు పదిసార్లు వినబడే పేరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తోటలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పటినుంచి నాకు కుతూహలం పెరిగిపోయింది - బాలూకు బట్టతల వుంటుందా వుండదా తెలుసుకోవాని. ఆ తరువాత రెండు మూడేళ్లకు మా వీరబల్లె శాఖా గ్రంథాలయంలో స్వాతిలోనో ఆంధ్రజ్యోతిలోనో బాలూ ఫోటో చూసి - ఓహో ... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పుట్టపర్తి సాయిబాబా కున్నంత చిక్కగా వుంటుందన్నమాట జుట్టు - అని తెలిసింది. ఆ తరువాతెప్పుడో కొన్నేళ్లకు మా వూరికి ఈ-టీవీ వచ్చింది. 'పాడుతా తీయగా' కార్యక్రమంలో అందరం చూశాం. అప్పటినుంచి చూస్తూనే వున్నాం - టీవీలో. ఆయన గొప్ప పాటగాడుగానే కాక, నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, మంచి భాష మాట్లాడే వ్యాఖ్యాతగా, మంచి మాటలు చెప్పే పెద్దమనిషిగా పరిచయమయ్యాడు.
నిన్న ఆయనను నిజంగా చూసే అవకాశం కలిగింది. ఆయనతో పాటు గాయని చిత్ర, ఎస్పీ శైలజ కూడా వారి సంగీతకారుల బృందంతో కలిసి విభ స్వచ్చంద విరాళాల కోసం ఒక సినిమా సంగీత ప్రదర్శన చేశారు. చిన్నప్పటినుంచి రోజూ విన్న గాత్రం, ఆ గాత్రధారుడు నిజంగా కళ్లముందు కనిపించేసరికి చాలా సంతోషం కలిగింది. ఆయనతోపాటు సుశీలా జానకిల తరువాత అంతటి గాయని కే.యస్.చిత్ర. చిత్రకన్నా ముందే పరిచయమైన మరో గాయని శైలజ. వీరితోపాటు మరో వర్ధమాన గాయకుడు శ్రీకృష్ణ అనే యువకుడు. వీరందరికన్నా ముందు ప్రేక్షకుల కరతాళ ధ్వనులమధ్య సంగీత వాద్యకారులు వేదికపైకి వచ్చినారు. ఇద్దరు తబలా, ఇద్దరు డ్రమ్స్, ఒకరు వేణువు, ఇద్దరు గిటారు, ఇద్దరు కీబోర్డు, వీరందరికీ ఒక సమన్వయకర్త, సహాయకుడు. గతేడాది అల్లారఖా రహమాన్ వచ్చాడు, ఆయనతోపాటు ఆయన తెచ్చిన సరంజామా కోసం ఒక పెద్ద నౌక కావాలేమో అనిపించింది.
ముందుగా బాలు మాట్లాడుతూ - ఏ భాషలో ఎన్ని పాటలు పాడాడు అని లెక్కపెట్టకండి, సంగీతం దానికదే ఒక భాష అనే ఉద్దేశంతో ఆలకించండి - అనగానే, చప్పట్లు కొట్టాం. ఆయన నవ్వుతూ - ఇప్పుడు ఇలాగే బుద్ధిగా వుంటారు, ఆ తరువాత ఛాట్ రూముల్లో, డిస్కషన్ ఫోరముల్లో తిట్టుకుంటారు - అన్నాడు. మేమూ (ప్రేక్షకులమందరమూ) నవ్వాం. ఆ తరువాత కూడా మాదంతా ఒకే కులం (ప్రేక్షకులం) అయినట్లుగానే ప్రవర్తించాం.
ముందుగా వారంతా కలిసి వందేమాతరం పాడారు - ఒక ప్రత్యేకమైన బాణిలో. చాలా బాగుందనిపించింది. శైలజను అక్కడ వదిలేసి మిగతా ముగ్గురు గాయనీగాయకులూ తెరచాటుకు వెళ్లారు. ఆమె ఓమ్... అని మొదలెట్టి, నమఃశివాయ ... అని 'సాగరసంగమం'లోని పాట అందుకుంది. నేనూహించినట్లుగానే శైలజ ఒకటిరెండు చోట్ల తాళం తప్పింది. కీబోర్డు వాద్యకారుడు కూడా ఒకచోట కాస్త ఏవరుపాటుతో వున్నాడు. గొప్పగా వుందనలేకపోయినా చాలా బాగుందనుకున్నాం. చప్పట్లు అలాగే మోగాయి. పాటయ్యాక బాలు వచ్చి, ఈ పాటను సినిమాలో జానకిగారు పాడగా ఈ అమ్మాయి నర్తించిందని చెప్పారు.
తరువాత బాలు అందుకున్నారొక తమిళపాట. వైరముత్తు రచన, ఇళయరాజా సంగీతం. నేనాపాటను అదివరకెప్పుడూ వినియుండలేదు. కానీ, ఆయన గొంతు విప్పగానే ఆ గాత్రపు నాణ్యత అబ్బురపరచింది. సినిమా థియేటర్లో వినిపించే రికార్డెడ్ శబ్దపు నాణ్యతకు ఏమాత్రం తగ్గలేదది. ఉర్రూతలూగించే ప్రభావాన్ని ప్రేక్షకుల్లో కలిగించేందుకు రహమాన్ చేసే ప్రీ రికార్డెడ్ సాంకేతిక మాయాజాలం లేదు. పాత కాలపు వాద్యగోష్టి మాత్రమే. ఉంటే గింటే ఒక సాధారణ మిక్సర్ వాడి వుండొచ్చు. అందుకే వాళ్లు చేసే తప్పులేమైనా వుంటే వెంటనే కనబడిపోతాయి. అలాగే గొప్పలు కూడా. నిజాయితీగా మన ముందుకొచ్చారు కాబట్టి, తప్పులేమైనా దొర్లినా ఎవరూ పట్టించుకోలేదు, గొప్పలను మాత్రం ప్రేక్షకులంతా వెంటనే గుర్తించి ఎప్పటికప్పుడు జోహార్లు చెప్పారు. నాలుగు దక్షిణ భారత భాషల ప్రజలు, హిందీవారూ, కొందరు గుజరాతీయులు కూడా వున్న ప్రేక్షకుల్లోని ఈ ఉమ్మడితనాన్ని చూసి నాకు చాలా సంతోషం కలిగింది.
తరువాత చిత్ర. ఇప్పుడీమె ఏ భాషలో పాడుతుందో మీకు తెలుసా అని అడిగారు బాలు. మలయాళం అని గాఠ్ఠిగా అరిచాడో ప్రేక్షకుడు. "అబ్బా! ఎలా చెప్పేశారబ్బా?" అనగానే మళ్లీ నవ్వులు. ఆమె ఆలాపన మొదలవగానే నాకు తెలిసిపోయింది - కళభం తరామ్ అనే పాట పాడబోతోందని. నేనా పాటను ముందే విని వున్నాను. ఆలాపన పూర్తయి, పల్లవి మొదలవబోతుండగా హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
ఆ తరువాత అమృతవర్షిణి అనే కన్నడ సినిమాలోని పాట. గత పదేళ్లలో కన్నడ సినీ జగత్తులో అత్యంత జనాదరణ పొందిన పాటలు ఆ సినిమాలోనివేననీ, అందుకుగానూ ఇటీవలే తాము (చిత్ర సహా) సత్కరింపబడినట్లు బాలు చెప్పారుగానీ, ఆ పాట నా మనసులో నిలవలేదెందుకో.
ఇంతవరకూ వీళ్లకు సహాయ గాయకుడుగా వున్న శ్రీకృష్ణ వంతు వచ్చింది. ఈ పాట కూడా సంగీతం మొదలయీ కాగానే నాకు అర్థమయింది - కాట్రిన్ మొళియే - అనే తమిళ పాట. నాకు విద్యాసాగర్ అంటే ప్రత్యేక అభిమానం. అతణ్ణి మన తెలుగు సినీ పరిశ్రమ సరిగా గుర్తించలేదని నా బాధ. ఒకోసారి గుర్తించకపోవడమే మంచిదనిపిస్తుంది. హాయిగా మలయాళం సినిమాల్లో దక్షిణభారత సంప్రదాయ సంగీతానికి దగ్గరగా వుండే బాణీల్లో పాటలు కడుతూ వుంన్నాడు కాబట్టి. ఎవరీ విద్యాసాగర్ అని అడిగేవారికోసం ఒక లంకె. మన శ్రీకృష్ణ ఈ పాటను దాదాపు రికార్డెడ్ పాటంత గొప్పగా పాడి మరో సారి చప్పట్ల మోత మోగించాడు.
బాలు వచ్చి ఒక మాట చెప్పారు - శ్రీకృష్ణ అమెరికా రావడం ఇదే ప్రథమమని, ఇదే అతని మొదటి ప్రదర్శన అనీ, మీదుమిక్కిలి అతనికి తమిళం ఒక ముక్క కూడా రాదనీ, తమిళాన్ని తప్పుల్లేకుండా పలుకుతూ పాడాడని అభినందించాడు. ప్రేక్షకుల స్పందనతో 'కదలిపోయిన' శ్రీకృష్ణ (నిజంగానే వణికాడు) ఒకింత అపస్వరంలో గట్టిగా 'థాంక్స్' చెప్పాడు. అక్కడితో అతని ఏకాగ్రత దెబ్బతింటుందని నేను ఊహించాను. చిత్రతో కలిసి ఒక lovely lovely duet పాడతాడని చెప్పి, దేశంలోనే గొప్పవారిగా పేరొందిన గాయనితో పాడే అవకాశం అతనికి వచ్చిందని చెబుతూ బాలు తెరచాటుకు వెళ్లారు.
ఆ తరువాత కొంతసేపు టిక్ టాక్ టిక్ టాక్ అని మెట్రొనోమ్ శబ్దం వినబడింది. వాద్యకారులు ఏదో కూడబలుక్కున్నారు. వెంటనే "ధున్" అని శబ్దం. క్షణం తరువాత "ధున్‌ధున్" అని వినిపించగానే ఆడిటోరియంలో ఒకటే హోరు. పాటను అందరూ గుర్తుపట్టేసిన ప్రభావమది. శ్రీకృష్ణ మొదలుపెట్టాడు ... ఉరికే చిలుకా ... అని. మోత మోగిపోతుందనుకున్న ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లుతూ పాట టెంపోని బాగా తగ్గించేసి, తనతోపాటు వాద్యబృందాన్ని కూడా కిందికి ఈడ్చుకొచ్చేశాడు. సహగాయని చిత్ర, కీబోర్డు వాద్యకారుడూ మొహామొహాలు చూసుకున్నారు. మన కృష్ణేమో మొదటినుంచే లేనిపోని extemporizations చెయ్యాలని ప్రయత్నిస్తూ అందరినీ బాధపెట్టాడు - ముఖ్యంగా వాద్యబృందాన్ని. కేవలం ఆసక్తితో, మిడిమిడి జ్ఞానంతో ఒక చిన్నపాటి ఆర్కెస్ట్రాను ఏర్పాటుచేసి, వారంలో ఒక రోజు మేమూ కొంతసేపు సీరియస్‌గా ఏదో మోగిస్తూవుంటాం (నాతోపాటు ఒక ఐదుమంది మిత్రులు కలిసి) కనుక, ప్రధాన గాయకుడు లాగుడు మొదలెడితే వాద్యబృందం ఎలా ఫీలవుతుందో నాకు కొంచెం తెలుసు. ఆ పాటలో చిత్ర పాడే వరుసలు రాగానే ఆమె మెల్లగా టెంపో పెంచి సరైన మార్గంలో పెట్టింది. హమ్మయ్య అని మేం ఊపిరి పీల్చుకుంటుండగానే శ్రీకృష్ణ మళ్లీ దిగలాగేశాడు. ఆ పైన improvization యత్నాలు. ఏమైనా ప్రేక్షకులు చాలా సహనంతో వ్యవహరించారు.
బాలూ కానీ, చిత్రకానీ గొంతెత్తిన ప్రతిసారీ - వాళ్ల వాయిస్ క్వాలిటీకి సలామ్ చెయ్యాల్సిందే ఎవరైనా - అనిపించింది. డ్యూయెట్ సినిమా కోసం రెహమాన్ స్వరపరచిన 'అంజలీ అంజలీ పుష్పాంజలి' అనే పాట మొదట్లో వినిపించే 'లాలలా లాలలా లాలాలలాల' వినగానే - రికార్డింగ్ ధియేటర్లోని సాంకేతికత చిత్ర గొంతుకు దిద్దిన మెరుగులేమీ లేవనిపించింది. ఇందులో వినిపించే క్లారినెట్/ట్రంపెట్ స్వరాన్ని కీబోర్డుపై పలికించడంతోపాటు, మొదటినుంచీ కొన్ని మెరుపులు మెరిపిస్తూ వచ్చిన మనిషిని ఈ పాటతో ప్రశంసలపాలు చేసేశాం. అప్పుడు కీబోర్డు ప్లేయర్లిద్దరినీ బాలూ పరిచయం చేశారు. ఆ తరువాత మధ్యమధ్యలో మిగతావారి పరిచయమూ జరిగింది. ఈ పాటలో ఒక చమత్కారం -
ప్రేక్షకుల్లో ఎవరో 'శంకరాభరణం' అన్నారు. అప్పుడు బాలు - తనకు మంచిపేరు తెచ్చిన పాటల్లో దాదాపు ఇరవై పాటల పల్లవులను ఏకబిగిన పాడి - బాలసుబ్రహ్మణ్యం అనగానే గుర్తొచ్చేపాటలను కాకుండా, అలాగని కొత్తపాటలనూ పాడకుండా, కాస్తంత మరుగునపడిన పాటలను కూడా పాడే యత్నం ఇది - అని చెప్పారు.
నాకు ఆహ్లాదానందాశ్చర్యాన్ని కలిగించిన పాటనొకదాన్ని పాడారు. కాస్త శుభ్రమైన శృంగారం ఎలా వుంటుందనేందుకు ఉదాహరణ ఈపాట అంటూ - ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ - చిత్రతో కలిసి పాడారు. ఈ పాటకు కోరస్ - శైలజ, శ్రీకృష్ణ. కీబోర్డు, వేణువూ ఎలానూ వున్నాయి. చాలా బాగా వచ్చిందీ పాట. నాకు చాలా ఇష్టమైన బాణీ ఇది. ఈ పాటలో "అంతే ఎరుగనీ అమరిక - ఎంతో మధురమీ బడలిక" అనే మాటకు కాసింత చమత్కారం కలిపి "అంతే ఎరుగనీ అమరిక - ఎంతో మధురమీ అమెరికా" అన్నారు. ఈ చరణంలో ఒకటి రెండు పదాలను పలకడానికి బాలు కాస్త ఇబ్బందిపడ్డారు - నోరు తిరగక కాదని చెప్పనక్కర్లేదు.
ఈ కార్యక్రమంలో బాలూ పాడలేదుగానీ, నాకు నచ్చిన మరో మంచి శృంగార గీతం - 'కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో'. తొమ్మిదోతరగతిలో అనుకుంటాను ఒక సినిమా టెంటులో చూశానీ సినిమా. కార్యక్రమం చివరి భాగంలో "బంగారు కోడిపెట్ట"తో తెలుగువారిని మేల్కొలిపి, "బల్లేలెక్క"తో అన్నివర్గాలనూ ఆకట్టుకొని ఇంటికి పంపించారు. Ending on a "H" note - అంటే ఇదే.
కలకత్తా, చికాగో, న్యూయార్కుల్లో ఘంటసాల చేసిన కచేరీలను అపురూపంగా వినే నేను - ఆ కచేరీలకు హాజరయిన జనం ఎంతటి అదృష్టవంతులో కదా అనుకుంటూ వుంటాను. నా జీవితకాలంలో ఘంటసాల అంతటి పేరు పొందిన గాయనీగాయకులైన బాలూ, చిత్రల కచేరీని ప్రత్యక్షంగా చూడగలగడం, వినగలగడం వల్ల నేనూ అదృష్టవంతుణ్ణే అనుకుంటూ ఆ రాత్రి ఇల్లు చేరి, 'చిత్రా'న్నం చేసుకుని (నిజంగా చిత్రాన్నమే - నిన్న సరిగ్గా ఈ సమయానికి) తిని హాయిగా నిద్రపోయాను. :)
మీకు తెలుసో లేదో - బాలు ఆరుసార్లు ఉత్తమ నేపథ్య గాయకుడుగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. చిత్ర కూడా ఆరుసార్లు ఉత్తమ జాతీయ నేపథ్య గాయనిగా ఎంపికయ్యారు. ఒక భారత గాయనిగా ఇది ఆమె మాత్రమే సాధించిన ఘనత. మరి అత్యధిక జాతీయ అవార్డులు పొందిన ఉత్తమ గాయకుడెవరయ్యా అంటే ...

కామెంట్‌లు
బహుశ పుడుతూనే ఏడవటం బదులు పాడేడేమో. నాకు మాత్రం ఘంటశాల తర్వాత బాలుకు తెలుగు గాయకునిగా చాలా మంచి పేరు కీర్తీ తెచ్చుకున్నారు.
మీ టపాలలోని యాస కత్తి
నిజంగా ప్రత్యక్షంగా చూసి ఉంటే ఎంత బాదుండేదో ?
you shd write a full length episode on the openinge scene.
మా ఊరికి మొన్నామధ్య "బాల మురళి" గారొచ్చారు. జనాలు ఆయనను దేవుడిలా treat చేసి, కొంచెం రసా భాసా చేసేశారు!
@కొత్తపాళీ: నిజమేనండి. కొంచెం హడావుడిగా కట్టేశానీ టపా.
@ఫాలింగ్ ఏంజిల్: High అనుకోండి.
@సుజాత: వడివేలు, వివేక్ ల హాస్యం కోసం తమిళ సినిమాలు చూసి కొంచెం ఆ భాష నాకు అలవాటు. ఇక్కడ మాత్రం తమిళం కన్నా తెలుగే కొంచెం ఎక్కువ మాట్లాడారు బాలూ. హాజరైన జనాన్ని బట్టి వుంటుందనుకుంటాను.
@నరహరి: కౌసల్య గొంతు కొన్నాళ్లకే వెగటైపోయిందడి నాక్కూడా. ఈమధ్య ఆమె పాడిన కొత్తవేవీ వినలేదు.
@రవి: ఔను రౌడీ అల్లుడే.
@దైవానిక: మంచి పట్టే పట్టారు. బాలూ పలికే శ నాకూ నచ్చదు. సుశీలమ్మ మాట్లాడేది చక్కటి తెలుగంటారా, టీవీల్లో చూసిన కొన్ని కార్యక్రమాల్లో ఆమె మాటలను విన్నాక అసలామెకు మాట్లాడటం సరిగా రాదేమో అని నాకనిపించింది.
నాకు చిత్ర గారితో ఈ ఇబ్బంది .. ఓ సినిమా లొ సవాలు గా తీసుకో ప్రేమా అన్నముక్క నాకు శవాలుగా తీసుకో ప్రేమా అని వినబడుతుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.