Sunday, September 28, 2008

ఆవొ సునావూఁ

ఇక్కడి నా సహోద్యోగుల్లో చాలా మందికి సంగీతంపై ఆసక్తి వుంది. మాలో కొందరు ఒక మోస్తరుగా పాడగలరు. కొందరేమో ఏదైనా ఒక వాయిద్యాన్ని బాగా సాధన చెయ్యాలనుకొంటూ వుంటారు. (!) మాకొక హైహై నాయకుడున్నాడు. ఈ నాయకుడు ఎంతో శ్రమకోర్చి, మాకు మంచి తిండి కూడా పెట్టి, మేమనే మాటలు పడుతూ, అప్పుడప్పుడూ మాపై తిరగబడుతూ మొత్తానికి మాలో ఒక ఆరేడుమందిని ఒక తాటిపై నిలబెట్టగలిగినాడు.ఇప్పుడు మేమంతా ప్రతి సోమవారం సాయంత్రం రెండు గంటలపాట మా ఇంట్లో సమావేశమై, గొంతులు చించుకొంటూ, గిటార్ల తీగలు తెంచుతూ, కీబోర్డులు, డ్రమ్ములూ పగలగొడుతూ నానా రభస చేసి ఆనందంగా విడిపోతాం. ఇలా చేబుతున్నానుగానీ, మా జట్టులో క్రమశిక్షణ కొంచెం ఫరవాలేదు. గ్రహాలన్నీ అనుకూలించిన ఒకానొక శుభముహూర్తాన గోవిందా నటించిన ఒక హిందీ సినిమా పాటను మేము తిరగ్గొట్టి కలిపాం. అనగా రీమిక్సు చేశామన్నమాట. మాదగ్గర సరయిన రికార్డింగు పరిజ్ఞానమూ పరికరాలూ లేకపోబట్టిగానీ ...

ఈ ఘటనలో ఒక ప్రధానగాయకుడు, ఇద్దరు సహాయగాయకులు, ఒక సహాయగాయని, ఒక గిటారివాడు, ఒక డ్రమ్మరి పనివాడూ, ఇద్దరు కీబోర్డు ప్రెసిడెంట్లు పాపం/పాలు పంచుకున్నారు. నేను కీబోర్డు (రెండవది) వాయిస్తూ, అక్కడక్కడా కాస్త గొంతు చేసుకున్నాను. మాలో కలాపోసన చెయ్యాలనే యావ తప్ప, సంగీతానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానం కూడా ఎవ్వరికీ లేదు. కూసింత జ్ఞానం వున్నవాళ్లు లేచి ఏమైనా మాట్లాడితే చప్పట్లు కొట్టేసి కూర్చోబెట్టేస్తూ వుంటాం. ఈ రికార్డు మొదట్లో మా వాళ్ల ఉత్సాహం మీరు వినేవుంటారు. అయ్యా.. అదన్నమాట! మీరెప్పుడైనా ఇలాంటి పని చేశారా?

11 comments:

రిషి said...

నేను ఈ మధ్య విన్న ఒక తెలుగు పాట రీమిక్స్ కి...తీసిపోదు మీ 'అండా' రీమిక్స్.

Kudos..

ఇక మీరెప్పుడైనా ఇలాంటి పని చేశారా?
లేదు :)

Madhu said...

బాగానే పాడారండీ..!!
ఈసారి..ఓ మాంచి తెలుగు పాట మిక్సర్లో వేసెయ్యండి.

teresa said...

అండ పిండ బ్రహ్మాండం !!
:))))

సిరిసిరిమువ్వ said...

గుడ్డు..గుడ్డు...గుడ్డు....

ramya said...

గుడ్డు...వెరీ గుడ్డు!

ప్రవీణ్ గార్లపాటి said...

బాగుందయ్యా! మంచి ప్రతిభ ఉన్న గుంపు మీది.

బాయ్స్ సినిమాలోలా రీమిక్సు పాటల కాసెట్టు ప్రయత్నించచ్చేమో. :-)

చైతన్య said...

మీ రీమిక్స్ అదుర్స్. బాగుంది. త్వరలో మీ నుంచి ఒక తెలుగు పాట కోసం ఎదురుచూస్తూ...

కొత్త పాళీ said...

Very admirable!
డ్రమ్మరి ప్రయోగం బావుంది. పేటెంటు తీస్కో! :)
వాయిద్యాలు బావున్నాయి .. గొంతుల్ని ఇంకొంచెం సానబెట్టొచ్చు. మొత్తమ్మీద అభినందించాల్సిన ప్రయత్నం!

వికటకవి said...

మంచి ప్రయత్నం. ఖచ్చితంగా వినబుల్ గానే ఉంది. డ్రమ్మరి కాస్త గుత్తాధిపత్యం చూపించాడు :-)

చివుకుల కృష్ణమోహన్‌ said...

బాగుంది.

రవి said...

అండె కా ఫండా , ఫండూ గా ఉంది. :-)

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.