పొద్దుపోని యవ్వారం - 5
"తిన్నడంటే తెలుసునా?"
"తెలుగు భాషలోనేనా?"
"ఆహాఁ! తెలుగులోనే"
"తెలంగాణంలోనా కోస్తాంధ్రంలోనా సీమయాసలోనా?"
"తెలంగాణంలో"
"తిన్నడంటే పేఠ్ భర్ బిర్యానీ దట్టించిండన్నట్టు"
"మరి, కోస్తాంధ్రంలో?"
"తిన్నడంటే చక్కనివాడు, వంకరల్లేనివాడు"
"రాయలసీమలో?"
"సీమలో తిన్నడంటే భక్తకన్నప్ప"
"తిన్నడంటే అన్నిచోట్లా ఒకే అర్థం రాదా?"
"ప్రస్తుత పరిస్థితుల్లో రాదు"
"పోనీ భక్తకన్నప్ప అంటే రాష్ట్రమంతటా ఒకటే అర్థం వస్తుందా?"
"రాష్ట్రమంతటా ఒకటే అర్థం రావాలంటే భక్తకన్నప్ప అంటే సరిపోదు"
"మరేమనాలి?"
"అవిభక్త కన్నప్ప"
" ... "
"అవిభక్త కన్నప్ప అంటే కన్నడభాషలో కూడా అర్థం మారదు"
"అవిభక్త కన్నప్పకు విభక్తులతో ఏమైనా పేచీ వున్నదా?"
"పేచీ లేని భక్తుడు గనుకనే అవిభక్తుడయినాడు"
"మరి మనమో!?"
" ... "
"తెలుగు భాషలోనేనా?"
"ఆహాఁ! తెలుగులోనే"
"తెలంగాణంలోనా కోస్తాంధ్రంలోనా సీమయాసలోనా?"
"తెలంగాణంలో"
"తిన్నడంటే పేఠ్ భర్ బిర్యానీ దట్టించిండన్నట్టు"
"మరి, కోస్తాంధ్రంలో?"
"తిన్నడంటే చక్కనివాడు, వంకరల్లేనివాడు"
"రాయలసీమలో?"
"సీమలో తిన్నడంటే భక్తకన్నప్ప"
"తిన్నడంటే అన్నిచోట్లా ఒకే అర్థం రాదా?"
"ప్రస్తుత పరిస్థితుల్లో రాదు"
"పోనీ భక్తకన్నప్ప అంటే రాష్ట్రమంతటా ఒకటే అర్థం వస్తుందా?"
"రాష్ట్రమంతటా ఒకటే అర్థం రావాలంటే భక్తకన్నప్ప అంటే సరిపోదు"
"మరేమనాలి?"
"అవిభక్త కన్నప్ప"
" ... "
"అవిభక్త కన్నప్ప అంటే కన్నడభాషలో కూడా అర్థం మారదు"
"అవిభక్త కన్నప్పకు విభక్తులతో ఏమైనా పేచీ వున్నదా?"
"పేచీ లేని భక్తుడు గనుకనే అవిభక్తుడయినాడు"
"మరి మనమో!?"
" ... "
కామెంట్‌లు
ఆహా ఈ పదాల వెనుక ఎంతర్ధమైనా చెతుక్కోవచ్చు అదిరింది.
బాగుంది
అయినా తిన్నడంటే తమిళవాళ్ళూ, కన్నప్పంటే కన్నడంవాళ్ళూ ఆ పేరుని లాక్కుపోతారు. అప్పుడు మనకి మిగిలేవి వట్టి వి భక్తులే:-)
శెబాసో!
బెంగళూరులో కన్నప్ప కళ్ళు శివునికిచ్చేస్తే NIMHANS ఆస్పత్రిలో చేర్పించారు
ఇదెక్కడి వైరుధ్యం?
అటు ఆ బౌండరిలూ ఇటు ఈ సిల్లీ పాయింట్లూ ఎంజాత్ చేయగలిగే మాదీ అదృష్టం.
మన్నించకపోతే, శిక్షగా నాకు తెలుగు నేర్పండి! ;-)
>> ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు.
8/10 :-) thanks!
నెనరులు,
పూర్ణిమ
నవీన్ - కన్నప్ప కాలంలో NIMHANS లేకపోబట్టిగానీ ...
పూర్ణిమ - పదాలతో ఆడుకోవడమనే పెద్ద మాటకు నేను తగనుగానీ, కొన్ని బౌలర్లు అనడం తప్పేమీకాదు లెండి. ఎందుకంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి 'కొన్ని యంపీలను కొంటా - కొత్త పీయంని నేనే నంటా' అన్నాడు చంద్రలేఖ సినిమా పాటలో తమాషాగా.
రవి, బేడర అంటే అర్థమేమిటి? కంఠీరవుని సినిమా మొన్ననే చూశాను. చాలా బాగుంది. ఘంటసాల నేపథ్యం పాడారు. మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా, నిన్ను నమ్మినాను రారా నీలకంధరా ... మీరు వినే వుంటారీ పాటను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.