Tuesday, September 09, 2008

పొద్దుపోని యవ్వారం - 4

"ఇది విన్నారా, మహారాజు ఈరోజు కవిగారిని సన్మానించారట"
"ఊఁ"

"కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నారట"
"ఊఁ"

"గండపెండేరం తొడిగారట"
"ఊఁ"

"మదగజం పైన ఎక్కించి రాచవీధుల్లో ఊరేగించారట"
"కవులను ఎక్కించవలసిందే, ఏగించవలసిందే"

"ఏఁ?"
"వారంతట వారుగా ఏనుగుపైకి ఎక్కలేరు, ఊరేగలేరు. మావటీ కావలసిందే"

"అదే, ఎందుకని?"
"నిరంకుశాః కవయః అంటే ఏమిటనుకున్నావు?"

"రంకు లేని వాడే కవి"
"నీ మొహం. కవులకు రంకు అలంకారం"

"మరేమిటి దానర్థం?"
"నిరంకుశాః కవయః అంటే అంకుశం లేనివాడే అసలైన కవి"

"అంకుశం ఉన్నవాడు?"
"మావటిః"

12 comments:

రవి said...

:-) ... చిన్నప్పుడు స్కూల్లో సంస్కృత అనువాదం సబ్జెక్ట్ లో అనువదించడానికి ఇలా ఇచ్చారు ఓ పరీక్షలో .."शीलं परं भूषणम्" ..(శీలము గొప్ప ఆభరణము).

దీనికి మా క్లాసు లో ఓ మొద్దమ్మాయి రాసిన అనువాదం -"శీలము పోయిననూ, ధనము వచ్చును." ...

oremuna said...

ఎందుకు వ్రాశారో ఏమో కానీ, నాకింకెందుకో, నాకింకేవో అర్థాలు అర్థం అవుతున్నాయి.

కిరణ్ said...

బాగుంది, కాని మద గజం కాదు మత్త గజం అనుకొంటా..

రానారె said...

@రవి: హహ్హహ్హహ్హ. మొద్దమ్మాయి అనకండి. ఆమె అనువాదం వెనుక కొంత ఆలోచన వున్నట్టుంది. :-))

@ఒరెమూనా: అవి కవి లక్షణాలు. :)

@కిరణ్: మదగజం, మత్తగజం ఈ పదాలకోసం అంతర్జాలంలో వెతికి చూడండి.

నువ్వుశెట్టి బ్రదర్స్ said...

హా..హా.హా..తమాషాగా ఉంది.

కొత్త పాళీ said...

నవ్వలేక ఛస్థున్హా!

కొత్త పాళీ said...

@Ravi .. ఆమె సంస్కృతంతో పాటు Market Economics కూడా చదువుకుంది కాబోలు!

teresa said...

ఈ యవ్వారంలో ఎవిటో చాలా వ్యవహారమున్నట్లుంది !!

భైరవభట్ల కామేశ్వర రావు said...

హ...హ..హా!
మరి మావటి లేని ఏనుగుని ఏంటంటారో చెప్పుకోండి చూద్దాం.

రానారె said...

@తెరెసా: అలా అనిపించిందంటే మీది కవి హృదయమన్నమాటే. :)
@కామేశ్వర రావు: మావటి లేని ఏనుగును ఏమైనా అంటే వూరుకుంటుందంటారా? :) గూగులమ్మ ఏమైనా చెబుతుందేమోనని వెతికి చూశానండి. బ్రౌణ్యంలో కూడా వెతికాను. 'ఏనుగుకు సంబంధించి ఇన్ని పదాలున్నాయా' అని ఆశ్చర్యపోయాను. ఐనా మావటి లేని ఏనుగును ఏమైనా అనడానికి నాకు ధైర్యం సరిపోలేదండి. మన బ్లాగుమిత్రుల్లో ఎవరైనా ఏమైనా అంటారేమో చూద్దామనుకుంటున్నాను ప్రస్తుతానికి.

రానారె said...

మావటి లేని ఏనుగుని ఏంటంటారో ఎవరైనా చెప్పుకోండి చూద్దాం. భైరవభట్లగారు దక్క. :-)

nagaprasad said...

మావటి వున్నా లేకపోయినా ఏనుగుని ఏనుగనే అంటారు. కాకపోతే ఆ ఏనుగుని తన అధీనంలో పెట్టుకున్న మనిషినే "మావటి" అని పిలుస్తారు.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.