చినచేపను పెదచేప

వెచ్చని నీటిలో
చెచ్చెరలాడుతూ
చేప పిల్లలు

ఒంటి కాలిపై నిలబడి
జపం చేసుకుంటూ
ఓ తెల్లని కొంగ

ముక్కును నీటిలో ముంచి
కన్నీరు కారుస్తూ
ఓ నీరాటం

ఉక్కపోతగా ఓ ఉదయం
సాగర తీరానికి సమీపంలో
తదేకమై ఓ తటాకం

ప్రియ సమాగమ మహాసంరంభాన
విహ్వల నదీకన్యక విసిరేసిన
తామస మా తటాకం

మొసలి నీట మునిగింది
కొంగ చెంగున లేచింది
చేపల చెర్లాట చెదిరింది

నిర్గుణ వాహిని విడిచిన
జీవ చైతన్యపు నిరాలంబ
తాపసిగా అదే తటాకం

కామెంట్‌లు

MURALI చెప్పారు…
రానారె గారూ అదిరింది.
అజ్ఞాత చెప్పారు…
హైకూలు అదిరిపొయాయ్. ౯/౧౦
మెహెర్ చెప్పారు…
Loved it.
By the way, NEERAATAM amtee?
Bolloju Baba చెప్పారు…
poem is nice
i wish these are not haikus because there is continuity. isnt it.
bollojubaba
రానారె చెప్పారు…
ఇక్కడింత అన్యాయం జరిగిపోతూ వుంటే ప్రశ్నించే వారే లేరేమనుకుంటున్నాను. బాబా గారూ, మీరడిగారు. కొంచెం తేలికపడ్డాను. చాలా కృతజ్ఞతలు. కవితలకూ నాకూ చాలా దూరం. కవితలాగా కనిపిస్తుందేమో చూద్దామని ఏదో రాశాను. మరీ అంత అధ్వాన్నంగా ఏమీ లేదని చెప్పిన బ్లాగుమిత్రులకు కృ-లు. ఇవి హైకూలూ కాదూ నానీలూ కాదు. 'బ్లాగాడిస్తా' రవిగారు కూడా తమాషాకి అలా అనుంటారనుకుంటా. :) ఫణీంద్రగారు, నీరాటమంటే మొసలి. మీకు బ్రౌణ్యం పరిచయం లేకపోతే ఈ లంకెను చూడండి:
http://dsal.uchicago.edu/dictionaries/brown/
కొత్త పాళీ చెప్పారు…
రూపంలో కాకపోయినా తత్త్వంలో ఇవి హైకూలనుకోవచ్చు. ముఖ్యంగా ఒక ప్రకృతి దృశ్య చిత్రాన్ని తాత్త్విక దృష్టితో ఆవిష్కరించడం హైకూ పరమావధి.
బాబా గారూ, కంటిన్యుయిటీ ఉన్నాకూడా ఏ చరణానికాచరణం అర్ధవంతంగా ఉంది.
బావున్నై రాంనాథా.
Unknown చెప్పారు…
భలే ముందు వీడియో, తర్వాత ఇదేదో... నెక్స్టు ?
రానారె చెప్పారు…
@గురూజీ, హైకూల తత్వం కొంత అర్థమయ్యేలా చెప్పారు. నెనర్లు. నేనిక్కడ రాసినవి గుణంలో ఎలా వున్నా రూపంలో హైకూలు కాదు గనుక 'హైకూతలు' అని పేరుబెట్టి కవితాలోకానికొక కొత్త(!) ప్రక్రియను కానుకగా నొసంగెద. :-))

@ప్రవీణ్, ఇప్పటికే ఒకటి రెండు సార్లు విహారి వార్నింగిచ్చారు. :-)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం