Wednesday, April 23, 2008

ఆకాశవాణి కడప కేంద్రం. ఈ నాటి ...

... సమస్యాపూరణం కార్యక్రమంలో మేమిస్తున్న సమస్య:

"మనమా ఒద్దిక నాదుమాట వినుమా మర్యాద కాపాడుమా!"

మీ పూరణలు మే నెల మూడవ తేదీలోగా మా కేంద్రానికి చేరేలా పంపగోరుతున్నాం.

మా చిరునామా: సమస్యాపూరణం, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప.

దూరవాణి సంఖ్యలు: 91-8562-240335, 91-8562-240342.

11 comments:

Giri said...

సినిమా పాటలదో అథోగతి సుమా, ఛీకొట్టి చెండాడనా?
“గుణమేలేని ఇలాంటి రొంపిన పడినా, గోలెందుకోయంచు యే
మనమా?” వొద్దిక నాదు మాట వినుమా మర్యాద కాపాడుమా
యననా, భాషను చంపుతున్న కవులూ, ఆగండిరా యన్జెప్పనా?

Giri said...

మరొకటి జతచేసి నా బ్లాగులో ఉంచాను, చూడండి..

భైరవభట్ల కామేశ్వర రావు said...

నిను నేనెన్నడు జూడలేదు మరియున్ నీవన్న నాకెట్టి చు
ల్కనభావంబును శత్రుభావ మణుమాత్రంబైన లేదాయె భం
డనమున్ బూనెదవేల నిత్య మరిషడ్వర్గంబుతో నాపయిన్?
మనమా!యొద్దిక నాదుమాట వినుమా!మర్యాద కాపాడుమా!

భైరవభట్ల కామేశ్వర రావు said...

నిను నేనెన్నడు జూడలేదు మరియున్ నీవన్న నాకెట్టి చు
ల్కనభావంబును శత్రుభావ మణుమాత్రంబైన లేదాయె భం
డనమున్ బూనెదవేల నిత్య మరిషడ్వర్గంబుతో నాపయిన్?
మనమా!యొద్దిక నాదుమాట వినుమా!మర్యాద కాపాడుమా!

రానారె said...

గిరీ, పద్యాలు రాయడంలో మీది కుంగ్ ఫూ స్పీడ్. సమస్యను తేల్చనిదే మీకు నిద్రపట్టదనుకుంటా. :)

భైరవభట్లగారు, ఎంతైనా సీనియర్ సీనియరే అనిపించారు. మనసుతో మీరు చేస్తున్న ఒద్దిక వేడుకోలు/సంభాషణ వింటూవుంటే తత్వాలు విన్నట్టుంది.

మీ ఇద్దరికీ కృతజ్ఞతలు.

చదువరి said...

ధనసంపాదనయే మదిన్ దలచి తత్కామాంగనా నాట్యముల్
ఘనతన్ చూపుదు రెట్టివేడ్క!? మన సంస్కారమ్ము యేమాయెనో?
తనువున్ అమ్ముకు జీవనమ్ము గడిపేనారీ జనాళిన్ 'అదే
మ'నమా!? ఒద్దిక, నాదుమాట వినుమా మర్యాద కాపాడుమా!

భైరవభట్ల కామేశ్వర రావు said...

రానారె గారు,
అప్పుడే నన్ను సీనియర్ సిటిజన్ని చేసేయకండీ, నాకింకా తలే పండలేదు:-)

చదువరి గారు,
మీ పద్యంలో మొదటి రెండు పాదాలూ బావున్నాయి. కానీ చివరకి పాపమా cheer-girlsని అనడం నాకంత నచ్చలేదు.

రానారె said...

తల పండటమంటే జుట్టులో వెండిపోగులు కనబటడమయితే నాలుగేళ్లనుంచి నేనే సీనియర్ సిటిజన్ని. :)

రానారె said...

చదువరిగారూ,

మీ పద్యాలు చాలా బాగుంటాయి. పద్యం రాయడమే గొప్ప అనే దశను మీరు దాటారనే వుద్దేశంతో నేరుగా ఒక చిన్న విమర్శ చేస్తున్నాను. మొదటిపాదంలో తత్ అన్న సర్వనామం(!) అక్కడ కుదురుగా సరిపోదేమోనని నా అనుమానం. ఎందుకంటే ఈ అంగనల గురించి ఇంతకు ముందు ప్రస్తావన లేదు కదా, ఇప్పుడు సర్వనామం వాడటానికి! ఈ పద్యానికి ముందు కాసింత వచనముండి, అందులో వీళ్లనుగురించి మాట్లాడివుంటే అది వేరేసంగతి. ఇక ఇందులోని విషయానికొస్తే, నేను cheer leaders పక్షం వహిస్తాను. వాళ్ల తప్పేమీ లేదనుకుంటాను. కాకపోతే మనదేశం ఈ సంస్కృతికి అలవాటుపడాల్సివుంది. సంప్రదాయానికీ ఆధునికతకూ సంధికాలంలో వున్నాం, కొన్నేళ్లతరువాత ఇవీ మామూలైపోతాయి.

భైరవభట్ల కామేశ్వర రావు said...

రానారెగారు,
తెలిసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఇలాటి సర్వనామం ఉపయోగించవచ్చు. మనం వ్యవహారంలో అలానే కదా మాట్లాడుకుంటాం. తెలియని విషయమైతే మీరన్న ఉపోద్ఘాతం అవసరమవుతుంది.

చదువరి said...

పెద్దలు చేసిన వ్యాఖ్యలను తలదాలుస్తూ, ఈ సవరణ..
"అమ్ముకు" కాకుండా "నమ్ముకు" అని మారిస్తే తీవ్రత కొంత మేరకైనా తగ్గుతుందేమో పరిశీలించగలరు.

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.