ఒక సంగీత పారాయణం కథ
తిండికూడా తినకుండా తిరుగుబోతుభర్త కోసం సిద్ధాన్నంతో ఎదురుచూసే మహాయిల్లాలివలె, గదిలో గోడవారగా తన పీఠం మీద కూర్చొని నా స్పర్శ కోసం ఎదురు చూస్తూవుంటుంది నా కీబోర్డు. ఇల్లాలిపై యిష్టమున్నా బలహీనతలకు మాటిమాటికీ తల ఒగ్గుతూ యేదో మొక్కుబడిగా అప్పుడప్పుడూ ఆమె మొక్కులను ఆలకిస్తున్నట్లు నటించే నాధుడి న్యూనత నాది. ఎంత వైనంగా చేస్తున్నానో చెబితే మీకు మంచి కాలక్షేపంగా వుంటుందికానీ, మొత్తానికి నేను కీబోర్డుపై సంగీతం సాధనచేయడం మాత్రం మానలేదు.
'పాడిందె పాడరా పాచి పండ్ల దాసరీ' అన్న చందాన ప్రతి వారమూ సాగుతూ వున్న ఈ వైనములో మూడు వారాల క్రితం ఒక చిన్న మార్పు కలిగింది. నా సంగీతం గురువు 'మన స్కూలు స్ప్రింగ్ రిసైటల్‌లో పాల్గొంటావా' అని అడిగారు. పదిమంది ముందు చిన్నపాటి ప్రదర్శన అన్నమాట. కనీసం ఈ భయంతోనైనా కాస్త సాధన చేయొచ్చుని సరే నన్నాను. రిసైటల్‌లో నువ్వు పలికించవలసినవి యివీ అంటూ సిలబసు పుస్తకంలోని రెండు చిన్న పాఠాలపై వేలు చూపించారు మా గురువుగారు.
అప్పటినుంచి క్రమం తప్పకుండా రోజుకు ఇరవై నిముషాలపాటు ఆ రెండు పాఠాలనూ సాధన చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకొన్నాను. కీబోర్డుపై వాటిని పలికిస్తూ 'ఫరవాలేదు బాగానే వస్తోంది' అనుకున్నప్పుడల్లా తప్పుపలుకుతోంది. ఏకాగ్రతకు ఏ మాత్రం భంగం కలిగినా "మేకు మీరే... ఛీ... బాగా రాలేదు కదూ..." అంటూ మిస్సమ్మ సనిమాలో డిటెక్టివ్ రాజు పడే బాధే నాకూ కలుగుతోంది. ఇలా కాదు ఈ రెండు పాఠాలనూ మెదడుతో సంబంధం లేకుండా నా వేళ్లకు అలవాటు చెయ్యాలని చాలా ప్రయత్నించాను. కీబోర్డు వైపు చూడకుండా, ఒకవైపు పాత తెలుగు పాట వింటూ మరోవైపు నా పాఠాలను పలికించడం, వార్తలు వింటూ పలికించడం యిలా మెదడును పక్కదోవ పట్టించే విషయాలను జయిస్తూ సుమారుగా విజయం సాధించాను. తప్పులు దొర్లే అవకాశం లేదనిపించే ఆత్మవిశ్వాసం వచ్చింది. వేదికమీద తప్పు జరిగితే ... అనే భయం మాత్రం వుంది.
ఎందుకింత హైరానా పడిపోవటమంటే - అక్కడ పాల్గొంటున్న వారిలో నా అంతటివాణ్ణి నేనే కనుక!
పరీక్షాసమయం రానే వచ్చింది. ఆ ఉదయం ఈ తలపుతోనే మేల్కొన్నాను. మధ్యాహ్నం రెండుగంటల సమయానికి నేను రిసైటల్ హాలులో వుండాలి. పొద్దునంతా బాగా సాధన చెయ్యాలని అనుకొన్నాను. అంతలో ఫోను మోగింది. క్రికెట్ ఆడటానికి రమ్మని మిత్రుని పిలుపు. ఈరోజు కుదరదయ్యా, ఫలానా పనుంది అన్నాను. సరేలెమ్మన్నాడు.
సంవత్సరాంతంలో పరీక్షహాలు బయట నిలబడి, మరికొద్ది నిముషాల్లో లోపలికి వెళ్లవలసి వున్నా యింకా పుస్తకాలలోనే తలలు దూర్చి ప్రయాస పడిపోయేవారిని చిన్నప్పటినుంచి ఎగతాళి చేసినవాణ్ణయిన నేను యిప్పుడిలా అయిపోవడం నాకేం నచ్చలా. అరగంట తరువాత ఫోనులో ఇంకో మిత్రుని పిలుపు- క్రికెట్ మైదానానికి రమ్మని. సరిగ్గా పది నిముషాల్లో అక్కడున్నాను. చివర్లో అనవసరంగా తొందరపడి మూడు వికెట్లు పోగొట్టుకుని ఓడిపోయాంగానీ, ఆట మాత్రం సరవత్తరంగా జరిగింది. నా రిసైటల్ కూడా యిలాగే రసవత్తరంగా జరుగుతుందేమో నని కొద్దిగా భయం వేసింది యింటికొచ్చి స్నానం చేస్తూ వున్నప్పుడు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొద్దిగా తిండి కడుపులో పడగానే విపరీతమైన నిద్ర ముంచుకొచ్చింది. అరగంట తరువాత మోగేలా అలారం పెట్టుకొని అలాగే పడి నిద్రపోయాను.
సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు సంగీతం బడిలో వున్నాను. బయటెవ్వరూ లేరు. 'రిసైటల్ హాలుకు దారి' అన్న బాణం ముక్క కనిపించింది. అలా వెళ్లి చూస్తే అప్పటికే హాల్లో వందమందికి పైగా ఆసీటులయివున్నారు. ఇందరొస్తారని నేనూహించలేదు. చివరి వరుసల్లో వెళ్లి కూర్చున్నాను. కొద్ది దూరంలో మా గురువుగారితో ఒక శిష్యురాలు ఫోటోకు పోజిస్తోంది. శిష్యురాలి వయసు ఐదేళ్లుండవచ్చు. ఆమె తండ్రి ఫోటో తీస్తున్నాడు. నా ముందరున్న ప్రజానీకాన్ని ఒకసారి పరిశీలనగా చూశాను. మా గురువుగారు తప్ప అక్కడ నా అంతటివాళ్లు ఎవరూ లేరు. అక్కడున్న వారంతా ఐదు నుంచి పదేళ్ల మధ్య వయసున్న పిడుగులు, వారి తల్లిదండ్రులు, అవ్వాతాతలు మాత్రమే. మా గురువుగారు నావైపు చూస్తే వెళ్లి పలుకరిద్దామని కుర్చీలో కూర్చొని ఎదురుచూస్తున్నాను. అక్కడికి ఒంటరిగా వచ్చినవాణ్ణి నేనొక్కడినే. ఆఖరికి మా గురువుగారు కూడా వారి మాతను, మాతామహినీ వెంటతీసుకొచ్చారు. శిష్యులనూ వారి తల్లిదండ్రులనూ పలకరిస్తూ గురువుగారు నావైపు రానేవచ్చారు, నాతో రెండు ముక్కలు మాట్లాడారు. ఆ మాటలతో నేను ఒంటరిని కాననే ధైర్యం కలిగి, కొద్దిగా విశ్రాంతిగా కూర్చొగలిగాను.
నా వెనుక వరుసలో భారతజాతికి చెందిన ఒక చిన్న కుటుంబం వచ్చి చేరింది. టెన్షమ్ పడకుండా ఎలా వుండాలో తన కొడుకుకు అమెరికన్ యాసలో చెబుతోంది ఆ అమ్మ. ఆ మాటలను బట్టి నాకు తెలిసిందేమిటంటే ఆమె తన టెన్షన్ పోగొట్టుకోవడానికి ఆ తంటాలు పడుతోందని. పిల్లగాడు ఆమె మాటలను వినకుండా వాళ్ల నాన్నతో మరేదో మాట్లాడుతున్నాడు. ఆ నాన్నగారు పలకడం లేదు. వాడు వాళ్లను వదిలి నేనున్న వరుసలో కూర్చున్నాడు. వాని వైపొకసారి చూసి "వెరీగుడ్" అనుకున్నాను.
సభ ప్రారంభమయింది. మా గురువుగారు మాట్లాడుతూ మా బళ్లో వెయ్యిమంది సంగీతం నేర్చుకుంటున్నారని చెప్పారు. మరీ అంతమందున్నారా అనిపించింది. తరువాత, ఒక్కో శిష్యుపరమాణువు పేరునూ చదువుతూ వేదికపైకి ఆహ్వానించి, పాఠం అప్పగించుకునే కార్యక్రమం. ముందుగా ఒక వాయులీన విద్యార్థిని వాళ్ల గురువుగారు పిలిచారు. పదేళ్లుంటాయేమో, ఆ విద్యార్థి నేరుగా వచ్చి 'యిరగదీసి' వెళ్లిపోయాడు. వీడి స్థాయికి మనం చేరాలంటే ఎన్నాళ్లు పడుతుందోగదా అనుకుంటూ వున్నాను. తరువాత మరికొందరు చిన్నారి వాయులీన కళాకారులు. అందరూ శ్రద్ధగల విద్యావంతులే. కానీ వీళ్లెవరూ వేదికనెక్కి ప్రేక్షకులకు అభివాదం చెయ్యలేదు. అసలు వాళ్లను చూస్తున్నవాళ్లు కొందరు వున్నారనే స్పృహకూడా వాళ్లకున్నట్టు లేదు. అంతమాత్రాన వీళ్లకు వినయం లేదని చెప్పకూడదు.
తరువాత పియానో పిల్లలు. మొదటి పేరు చదవగానే ఎవ్వరూ పలుకలేదు. సరేనని, రెండో పేరు పలికారు, ఆ శిష్యుడు వచ్చాడుగానీ, స్టేజిమీదకు రానన్నాడు. సరేనని మూడో బుడతను పిలిచారు. వీడికి ఐదేళ్లుండొచ్చు. మహారాజులాగా స్టేజిమీదకు వచ్చి కొద్దిగా తలవంచి అభివాదం చేయగానే ప్రేక్షకుల్లో చురుకుదనం వచ్చింది. కరతాళ ధ్వనులు బాగా మోగాయి. పాఠం కూడా బాగానే అప్పగించాడు. ఆ తరువాత యర్ర గౌనులో ఒక అందాల రాణి. ఐదేళ్లు కూడా వుండవేమో. ఆమె అభివాదం చేసిన శైలికి ప్రేక్షకులు సమ్మోహితులయ్యారు. రెండు చేతులతో ఆ గౌనును కొద్దిగా పక్కలకు లాగి, కుడికాలు తీసి యడమకాలి మడమకు తగిలించి అలా కొద్దిగా ముందు వంగి, పడకుండా జాగ్రత్తపడుతూ... ఇంతా చేయగలిగిన సంతృప్తితో తన తండ్రివైపు చూసి ఒక నవ్వు నవ్వింది. పియానో ముందు ఆమె కూర్చొనే బల్లను పియానోకు బాగా దగ్గరికి జరపవలసి వచ్చింది. సుకుమారమైన వేళ్లతో ఏదో చిన్న పాటను వినిపించి, పూర్తవగానే బల్లమీదనుంచే గురువుగారివైపు చూసి బాగా చేసినట్టేనా అన్నట్టు నవ్వింది. ప్రేక్షకులు ముగ్ధులైపోయి చప్పట్లతో హాలును మారుమోగించారు.
అలా వేదికనెక్కుతున్న ప్రతి పిల్లా పిల్లాడూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ వుండగా "ర్యామ్ యారప్పోవ్" అంటూ ఏదో రష్యన్ నామము వినిపించేసరికి అది నేనేనని నాకర్థమై లేచి వేదికవైపుకు వేగంగా అడుగులేన్నాను. ఇంకో చిన్న పిల్లకాయ వస్తున్నాడనుకొని చుట్టూ చూస్తున్న ప్రేక్షకులనుద్దేశించి మా గురువుగారు, "Yea, ... a biggie" అంటూ నవ్వగానే హాల్లో నవ్వులూ కరతాళధ్వనులు ఒక్కసారిగా ఊపందుకొన్నాయి. నేను కూడా అందరివైపూ చూసి నవ్వుతూ, అభివాదం చేసి కృతజ్ఞతలు తెలిపాను. పియానో ముందరున్న బల్లను నాకు అనుకూలంగా వెనుకకు లాగి కూర్చొని, రెండు సెకన్లమౌనం తరువాత వ్రుమ్... అని పలికించగానే ఆ శబ్దం గొప్పగా వినిపించింది. అదే ట్యూన్‌ను కీబోర్డు మీద రోజూ పలికిస్తూనే వున్నానుకానీ నా చెవులకింత మధురంగా ఎప్పుడూ వినిపించలేదు. పియానో వాయించడం నాకదే తొలిసారి. కీబోర్డు కన్నా పియానో శబ్దంలోనే కాదు, స్పర్శలో కూడా ఎన్నోరెట్లు గొప్పగా వుంటుందనిపించింది. ఆ ఆనందంలో నా పాఠాన్ని/పాటను నేనే వింటూ పలికించేశాను. భలే వచ్చిందనే సంతృప్తితో పెద్ద విద్వాంసుని మాదిరిగా చేతివేళ్లను అలా స్టైల్‌గా పైకి లేపాను ముగింపుగా. అనుకున్నంత కంటే బ్రహ్మాండంగా వాయించాననే తృప్తివల్ల అనుకోకుండా వచ్చిన కదలిక అది. అదే ఆనందంలో మళ్లీ ప్రేక్షకదేవుళ్లకు నమస్కరించి గాల్లో తేలిపోతూ కిందికి దిగి నా కుర్చీ వైపుకు నాలుగడుగులు వెయ్యగానే గుర్తుకొచ్చింది, యోగ్యతాపత్రం తీసుకోవడం మరచిపోయానని. గతుక్కుమని వెనక్కు తిరగ్గానే మా గురువుగారు ఆ పత్రాన్ని పట్టుకొని నావైపే వస్తున్నారు. పత్రమిచ్చి, కరచాలనం చేసి well done అని అభినందించారు.
నేను తిరిగి నా స్థానానికి చేరే దారిపొడవునా చప్పట్లు, అభినందనావీక్షణాలు, వ్యాఖ్యలు. అందరికీ ముక్తహస్తాలతో నమస్కారాలు చెబుతూ వచ్చి కూర్చున్నాను. నా కుర్చీ పక్కనున్న నల్లనయ్య ఒకాయన 'Man, that was great. You've got style. Keep practicing.' అంటూ కరచాలనం చేశాడు.
ఆ తరువాత వేదికనెక్కిన పిల్లమహారాజు బల్ల అంచున కూర్చొని, పియానోపైకి సరిగా చేతులు అందక ఇబ్బందిపడ్డాడు. బల్లను యథాస్థానంలోకి నెట్టి రానందుకు నాకు కించగా అనిపించింది. దాన్ని ముందుకు జరపమని నేను చెప్పబోయేంతలో అక్కడున్న సహాయకుడు ఆ పని చేశాడు. మన భారతసంతతి హీరో కూడా వెదికనెక్కాడు. కుంగ్ ఫూ వేగంలో వంగిలేచాడు (అభివాదం). చటుక్కున బల్లమీదకు ఎరిగికూర్చొని మెరుపువేగంతో పియానో పలికించాడు.అంత వేగంగా వాడు అనుకున్నచోటికి వేళ్లు వెళ్లి నిలబడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలాంటి పిడుగుల ప్రదర్శనను హాయిగా కూర్చొని చివరిదాకా విని/చూసి వచ్చాను. అదొక అద్భుతమైన ఆదివారం.
ఈ ప్రోత్సాహంతో యికనుంచయినా నా కీబోర్డు దృష్టిలో నేను తిరుగుబోతును కాకుండా వుంటేచాలు. అవిఘ్నమస్తు! :)
--------------------------------
అణువంత ప్రతిభతో ఆకాశమంత ప్రశంస పొంది పొంగిపోయాను. ఆ పొంగులో వచ్చినదే ఈ టపా.
చాన్నాళ్ల క్రితం ఏదో పాత అచ్చు కాగితంలో చూసిన గుర్తు, 'పొగత్రాగడం మానెయ్యాలనుకునేవారికి కొన్ని సూచనలు' అనే శీర్షిక కింద - మీరు సిగరెట్లు/బీడీలు/చుట్ట మానేస్తున్నట్టు మీ బంధువులకూ చుట్టాలకూ చెప్పండి - అనే సలహా. ఈ సలహాను కీబోర్డు విషయంలో పాటిస్తూ ...

కామెంట్‌లు
Keep practicing.
మీ గురువు గారు చెప్పారో లేదో కాని, రహస్యం మీరు పసిగట్టినట్టే ఉన్నారు. ఆ చిన్న హీరో కూడా.
అదేమిటంటారా, ఈ కథ విని తెలుసుకోండి.
http://bookbox.com/index.php?pid=2lng=English
పూర్తి కథ కొనకుండా వినలేరు కానీ, చదవచ్చు ఇక్కడ:
http://bookbox.com/free_stuff.php?cat=pdf
తెలుగులో కూడా రాబోతోంది.
ఇక పియానో విన్నాక కీబోర్డు ఆనడం కష్టం. కానీ ఏం చేస్తాం, పియానోకి కావల్సిన స్థలమూ, డబ్బూ కూడా ఎక్కువే.
దీన్ని కర్ట్సీ అంటారు.
http://en.wikipedia.org/wiki/Curtsey
బాగుంది, నీ తొలి ప్రదర్శన. అక్కడ ఏమి దుమ్ము లేపావో గాని, ఇక్కడ మాత్రం బాగా లేచింది దుమ్ము :-)
నీ ప్రజ్ఞాతిశయం ఇక్కడికి కనిపిస్తోంది.అభినందనలు!
'భారతజాతికి చెందిన'...ఈ ఒక్క ముక్క బాగాలేదు-"ఓ భారతీయకుటుంబం" అని అంటే సరిపోయేది.
ప్రదర్శన అస్భుతంగా జరిగి ఉంటుంది.
ఎప్పటి నుంచో గిటార్ నేర్చుకోవాలని ఓ కోరిక నాకు. నీ స్ఫూర్తి ఏమన్నా పనికొస్తుందేమో చూడాలి.
ఇంతకీ మీ వాయించిన పాఠమేమిటి?
పట్టుదలతో కృషి కొనసాగించండి..
లలితగారు, థాంక్యూ. మీరు చూపిన కథ సింపుల్గా బావుంది. కథలో చెప్పిన రహస్యం చాలా కీలకమైనది. అయితే ఆ రహస్యాన్ని పసిగట్టగానే సరిపోలేదండి, ఆ కథలోని హీరోలాగా క్రమం తప్పని సాధన వుంటేనేగాని రహస్యాన్ని అమలు చేయడం సాధ్యమవదు. సాధన మొదటి మెట్టు. ఈ విషయంలోనే నేను వెనకబడివున్నాను. :)
కొత్తపాళీగారు, 'కర్ట్సీ'ని పరిచయం చేసినందుకు థాంక్స్.
డాక్టరుగారు, మీరు బాగాలేదన్నపదం వాడటంలో వ్యంగ్యంగానీ అంతకు మించిన దురుద్దేశంగానీ యేమీ లేవని సవినయంగా మనవిచేస్తున్నాను. మీకెందుకది అభ్యంతరకరంగా తోచిందో నాకు తెలియలేదు.
నాగరాజా, ప్రవీణ్, గిరిగార్లకు - కృతజ్ఞతలు. అది నా సిలబసు పుస్తకంలో అతి ప్రాథమిక స్థాయిలోని అతి చిన్న ట్యూన్. కృతులు వగైరా వాయించే స్థితికి నేను చేరాలంటే చాలా యేళ్లే పట్టవచ్చు. పైగా మా బళ్లో మన సంప్రదాయ సంగీతం నేర్పే గురువులు లేరు. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.