వేదాల్లో సైన్సును వెతకండిగానీ సైన్సులో వేదాలను వెతక్కండన్నాడొక పెద్దాయన. అది చేతకానప్పుడు ఇదైనా చెయ్యాలిగదా? ఇప్పుడు నేను చెయ్యబోతున్నది ఆలాంటిదే. 2009 ఫిబ్రవరిలో కొత్తపాళీగారి బ్లాగులో "స్థితప్రజ్ఞత" అనే టపా వచ్చింది. అందులో ముఖ్యమైనదిగా నాకు తోచిన వాక్యం - "క్రమశిక్షణతో కూడిన ఒక వైరాగ్యాన్ని పెంపొందించుకో గలిగితే తదనుగుణంగా మన అంతశ్శక్తిని నిక్షేపించుకుని, దాచుకుని, అంతిమంగా కీలకమైన లక్ష్యసాధనకి వినియోగించుకోవచ్చు." 2010 ఫిబ్రవరి వచ్చాక చూసుకుంటే, గడచిన యేడాది కాలంలో క్రమశిక్షణ లేదు. వైరాగ్యం లేదు. ఇవి రెండూ లేకపోవడంవల్ల అంతశ్శక్తీ లేదు. కనీసం, అంతిమంగా కీలకమైన లక్ష్యం యేమిటో తెలుసునా అంటే అదీతెలీదు. క్రమశిక్షణా అంతశ్శక్తీ ఎంతోకొంత తిరిగి సాధించినా, లక్ష్యం ఏమిటో తెలీడంలేదు. నా లక్ష్యం ఏమిటో మీకేమైనా తెలుసా? అని ఎవరినయినా అడిగితే బాగుండదేమో. ఇంతకూ, మీకు అంతిమంగా కీలకమైన లక్ష్యం ఏమిటి? A. నాకు తెలీదు B. ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు C. అక్కర్లేదు నా కిలాగే బాగుంది D. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా E. ప్రతిరోజూ క్రమశిక్షణనూ, అంతశ్శక్తినీ సాధించడమే F. సృష్టికార్యంలో ఆ ప
కామెంట్లు
http://vaagvilaasamu.blogspot.com/2008/04/blog-post_17.html
మీద కూడా వొక కన్నెయ్యండి మరి.
మరో రాముడు :)
మీ పూరణ చూసి ధైర్యంగా సమస్యను సవరించాను. అభినందనలు. మీ పద్యానికి ప్రతిపదార్థాలు వెతుక్కునే పనిలో పడ్డాను ప్రస్తుతం. ఆకాశవాణికి ఒకసారి మీ దూరవాణిని వినిపించండి మరి! :-))
-
పదాబ్జముల్ అని వుండాలి గా..
కొలువరారా అని వుండాలి గా..
లేక పోతే నా సోపనరెఖా చిత్రం ఒప్పుకోదు :)
తద్దిత్తోం తక తోంత తోంత దిరనా,
తద్దిక్కు తద్దిక్కు తాఁ
రామా! రామ పదాబ్జముల్ కొలువరారా కీర్తి మిన్నందురా!
సమస్యలో "రామ" స్త్రీలింగమా?
ఈ సమస్య చూసైనా శ్రీరాం గారు తిరిగి బ్లాగు వైపు,పద్యాల వైపు వస్తారేమో చూద్దాం
విశ్వామిత్రా,
విని రాసుకోవడమెందుకండి, రికార్డు చేసి వినిపిస్తారు. ఈమధ్య గత కొన్నేళ్లుగా ఫోన్-ఇన్ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. నత్తచిరునామా అంటారా, ఏముందీ, "సమస్యాపూరణం, కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప"
శ్రీరాం మళ్లీ పద్యాలు రాయాలని మనమంతా ధర్నా చెయ్యాలి. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.