పోస్ట్‌లు

ఏప్రిల్, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆకాశవాణి కడప కేంద్రం. ఈ నాటి ...

... సమస్యాపూరణం కార్యక్రమంలో మేమిస్తున్న సమస్య: " మనమా ఒద్దిక నాదుమాట వినుమా మర్యాద కాపాడుమా! " మీ పూరణలు మే నెల మూడవ తేదీలోగా మా కేంద్రానికి చేరేలా పంపగోరుతున్నాం. మా చిరునామా: సమస్యాపూరణం, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప. దూరవాణి సంఖ్యలు: 91-8562-240335, 91-8562-240342.

ఒక సంగీత పారాయణం కథ

తిండికూడా తినకుండా తిరుగుబోతుభర్త కోసం సిద్ధాన్నంతో ఎదురుచూసే మహాయిల్లాలివలె, గదిలో గోడవారగా తన పీఠం మీద కూర్చొని నా స్పర్శ కోసం ఎదురు చూస్తూవుంటుంది నా కీబోర్డు. ఇల్లాలిపై యిష్టమున్నా బలహీనతలకు మాటిమాటికీ తల ఒగ్గుతూ యేదో మొక్కుబడిగా అప్పుడప్పుడూ ఆమె మొక్కులను ఆలకిస్తున్నట్లు నటించే నాధుడి న్యూనత నాది. ఎంత వైనంగా చేస్తున్నానో చెబితే మీకు మంచి కాలక్షేపంగా వుంటుందికానీ, మొత్తానికి నేను కీబోర్డుపై సంగీతం సాధనచేయడం మాత్రం మానలేదు. 'పాడిందె పాడరా పాచి పండ్ల దాసరీ' అన్న చందాన ప్రతి వారమూ సాగుతూ వున్న ఈ వైనములో మూడు వారాల క్రితం ఒక చిన్న మార్పు కలిగింది. నా సంగీతం గురువు 'మన స్కూలు స్ప్రింగ్ రిసైటల్‌లో పాల్గొంటావా' అని అడిగారు. పదిమంది ముందు చిన్నపాటి ప్రదర్శన అన్నమాట. కనీసం ఈ భయంతోనైనా కాస్త సాధన చేయొచ్చుని సరే నన్నాను. రిసైటల్‌లో నువ్వు పలికించవలసినవి యివీ అంటూ సిలబసు పుస్తకంలోని రెండు చిన్న పాఠాలపై వేలు చూపించారు మా గురువుగారు. అప్పటినుంచి క్రమం తప్పకుండా రోజుకు ఇరవై నిముషాలపాటు ఆ రెండు పాఠాలనూ సాధన చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకొన్నాను. కీబోర్డుపై వాటిని పలికిస్తూ 'ఫర

గూగులమ్మ పదాలు

ఆరవ విడత... ******* పిట్ట పోరున తీర్పు పిల్లి జూపిన నేర్పు బెమ్మ దేవుని కూర్పు ఓ గూగులమ్మా! ఉర్విజనులకు స్పార్కు నూత్న వర్షపు మార్కు వుండబోదిక డార్కు ఓ గూగులమ్మా! తాత చేయును డేటు తొడిగి సూటూబూటు పడతి దొరకుటె పాటు ఓ గూగులమ్మా! మయుని మించిన మాల్సు స్వీటు గొంతుల కాల్సు నయా”గారపు ఫాల్సు ఓ గూగులమ్మా! తెలుగు బ్లాగుల టెక్కు జాలమందున నిక్కు వేసుకో ఓ లుక్కు ఓ గూగులమ్మా! ప్రణయ జీవుల చెంత వర్ణ భేదపు చింత మనుజ లోకపు వింత ఓ గూగులమ్మా!

గూగులమ్మ పదాలు

గురువుగారూ, అందుకోండి అయిదో విడత పదాలు. ***** ఐపి వున్నది గనుక వేంకటేశ్వరు డింక వీడవచ్చును శంక ఓ గూగులమ్మా! వంశ చరితల శంస జెంత గూడి రిరంస రంతు సినిమా హింస ఓ గూగులమ్మా! పంచెకట్టు పరికిణి పాతరికపు చెలామణి జీన్సె నేటి ధోరణి ఓ గూగులమ్మా! హొంత యగు యిల్లాలు పొంత నుండిన చాలు సొంత మౌను సుఖాలు ఓ గూగులమ్మా! జనమ నిచ్చిన ఇంతి జలము నిడచిన గొంతి 'కర్ణతల్లి'ట కుంతి ఓ గూగులమ్మా!

ఆకాశవాణి కడప కేంద్రం. ఈనాటి ...

... సమస్యాపూరణం కార్యక్రమంలో మేమిస్తున్న సమస్య " రామా రామ పదాబ్జముల్ కొలువరారా కీర్తి మిన్నందురా! " మీ పూరణలు ఏప్రిల్ 19వ తేదీలోగా మా కేంద్రానికి చేరేలా పంపగోరుతున్నాం. మా దూరవాణి సంఖ్యలు: 91-8562-240335, 91-8562-240342.

బ్లాగులోకానికి ఆవలనున్నవారికోసం

చిత్రం
బ్లాగులోకానికి ఆవలనున్నవారికోసం ... తెలుగు బ్లాగుల లోకాన్ని పరిచయం చేస్తూ ... గార్లపాటి ప్రవీణ్ చేసిన తొలి ప్రయత్నం ఈ పుస్తకం ... . దీన్నెవరికయినా పంచినా పంపించినా పుణ్యం వస్తుంది ...ట! ;-)