పొద్దుపోని యవ్వారం -1

నేను టపాకట్టి చాలా రోజులైపోయింది! అంటే...
అంటే ఏమిటో నెజ్జనమహాశయలకు చెప్పనక్కర్లేదు.

ఒక టపా పొట్లం కట్టి అప్పుడే నెలరోజులు కావస్తోందే అనిపించి ఊరకనే ఏమైనా రాద్దామని మొదలెట్టాను. ఊరకనే రాయాలంటే కుదిరేపనేనా? ఏదో ఒకటి ఊరాలికదా రాయడానికి!
శృంగారశ్రీనాథునికయితే రమణీప్రియదూతికలు దొరికారుగానీ, తిరిపెమునకిద్దరాండ్రా! అని ఆయనే అన్నట్టు రానారెగారికి అలాంటి భారీసెటప్పు కుదరలేదు పాపం!

'నెటకారాలు' చాలుగానీ, శ్రీనాథునితో కవిత్వం వ్రాయించే ప్రియదూతిక మాదిరిగా, నాతో బ్లాగు రాయించే ఒక నెచ్చెలి వుండుంటేమాత్రం టపా(లు)కట్టడానికి యిలా ఆలస్యం జరగకపోవును.
ఇంతకూ, నెచ్చెలి అంటే ఎవరు?

ఎవరినిబడితే వారిని నెచ్చెలి అనెయ్యడానికి లేదు. దానికొక లెక్కాజమా వుంది.
అబ్బో!ఏమిటో దాని యీక్వేషను?

నెర+చెలి=నెచ్చెలి (Where నెర=సంపూర్ణమైన)
ఇవన్నీ పాతలెక్కలు. ఎవరో చెప్పిన లెక్కలు. ఎవరి లెక్కలో మనకెందుకు. ఈ కాలంలో ఎవరిలెక్కలు వారికుంటాయి కదా! అలాగే మనకూ ఒక లెక్క వుంది. మనకూ ఒక సొంత యీక్వేషనుంటుంది. దీనికోసం మనమేమీ మార్గదర్శిలో చేరనక్కర్లేదు.

ఏమిటో నీ యీక్వేషను?

నెట్+చెలి=నెచ్చెలి (Where నెట్=జాలము[నందు గాలమునకు చిక్కిన])

మ్...! ఏ సంధి సూత్రం కలుపుతుందిలా?

సూత్రానికి సులభంగా లొంగదిది. గళసూత్రానికి పట్టుబడదు. మంగళసూత్రానికి కట్టుబడదు. ఈ టైపు సంధి అంత సులభంగా కలవదు కూడా. అన్నట్టు వీటిని "e-టైపు" సంధులంటారు.

e-టైపు సంధులా? నిజంగానేనా!?

నిజంగానువ్వే! ;)

.......!?

కామెంట్‌లు

Unknown చెప్పారు…
"నెట్"చెలి బాగోదు నెచ్చెలే బాగుంటుంది.
చూసుకోరాదూ. రొమాంటిక్ టపాలు కట్టచ్చు. ;)
అజ్ఞాత చెప్పారు…
:) మీకసలు పొద్దుపోతున్నట్టు లేదు.
సిముర్గ్‌ చెప్పారు…
"నేను టపాకట్టి చాలా రోజులైపోయింది!" - సూపర్ రానారె. శ్లేష అదిరింది.

నిజఁవే, బ్లాగు మొదలెట్టింతర్వాత, టపాల మోజులో పడి, చాలా మంది ఓ రకంగా 'టపా కట్టిన' మాట వాస్తమే సుమా.
రానారె చెప్పారు…
థాంక్యూ సిముర్గ్ గారూ!:))

@కల్హార: అసలు పోతున్నదంతా 'పొద్దే' అవుతోందే అని నా యేడుపు! :)

@ప్రవీణ్: (రొమాంటిక్ టపాలు = రొమాంటికములైన టపాలు)- విపూకస అనే e-సమాసమున్నట్టు నీకు ముందుగానే తెలిసిపోయినట్టుంది! :)
రాఘవ చెప్పారు…
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.

7/10 చాలా 10/10 వద్దా మీకు?
రానారె చెప్పారు…
రాఘవ, తమ దయ మా ప్రాప్తము :)
అజ్ఞాత చెప్పారు…
:) నెచ్చెలి కావాలా?? ఇలా పోష్టులు రాస్తే దొరకరండీ... ఫీల్డ్ లోకి దిగండి.. హీహీ...
చైతన్య చెప్పారు…
meee e-Type sandhi adirindi :)

"నిజంగానేనా!?
నిజంగానువ్వే! ;)"
idaitee superrr

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం