కనీసం రెండు మర్యాదకరమైన పాటలు?

ఈ మధ్యనే జీటీవి నిర్వహించిన లిటిల్ ఛాంపియన్స్ "సరిగమప" చివరి అంకం ఒక బహిరంగ రంగస్థలంమీద జరిగింది. ఈ పోటీలో పాల్గొన్నవారిలో అత్యంత ప్రతిభావంతులైన ముగ్గురు పిల్లలు ఇందులో పోటీదారులు. అందులో భాగంగా పిల్లలచేత కొన్ని "జానపదగీతాల పల్లవులు" పేరిట వరుసగా పాడించారు. పాడిన చిన్నారుల్లో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అందులో మగపిల్లలతో పాడించినవి జానపదగీతాలుగా ఉన్నాయి. ఆడపిల్లతో పాడించిన పాటలు ఇవీ ...

మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు
గుడివాడ వెళ్లాను గుంటూరు పొయ్యాను
ఓ సుబ్బారావో ఓ అప్పారావో ... ఎవరో ఎవరో ... వస్తారనుకుంటే
నువు అడిగింది ఏనాడైనా లేదన్నానా! నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా?

ఇందులో మొదటిది బాగా అరిగింది. ఐనా సరే జానపదం అనుకోవచ్చు. చివరిది కూడా సరే అనుకుందాం. మధ్యలోనివి రెండూ ఏమిటి? సినిమాలకోసం రికార్డింగు స్టూడియోల్లో పాడుకోవచ్చుగానీ, ఇలా బహిరంగంగా చిన్నపిల్లలతో వేషాలు కట్టించి ఈ "..తెగించిన" పాటలను జానపదగీతాలని చెప్పి పాడించడం ఏం పద్ధతి? సినిమాలలోని గీతాలనే పాడించాలనుకున్నా సరే, ఆడపిల్లలు పాడటానికి ఇంతకంటే సరైనవి లేవా!? ఇంత దీర్ఘమైన తెలుగు సినిమా చరిత్రలో కనీసం రెండు మర్యాదకరమైన పాటలు?? ఏమున్నాయని ఆలోచించాల్సివస్తోంది.

కామెంట్‌లు

బాగా చెప్పారు రానారె గారూ. పాత తెలుగు సినిమాలలో మంచి సాహిత్యం ఉన్న జానపద గీతాలు లెక్కలేనన్ని ఉండగా పైన చెప్పిన పాటలు పాడించడం ఏమీ బాగాలేదు.
రానారె చెప్పారు…
లెక్కలేనన్ని ఉన్నాయన్నారు. ఆశావహంగా బాగుంది. ఈ టపాలో చెప్పిన సందర్భానికి తగిన ఉదాహరణలు మీరేమైనా సూచించగలరా, రాజారావుగారూ?
Sriram చెప్పారు…
రానారె, ఏరువాకా సాగారో...వంటి పాటలన్నీ జానపదాలే కదా! అవి పని చెయ్యవా? బహుశః వాళ్ళ ఉద్దేశ్యం జానపదమనికాక ఎల్లారీశ్వరిగారి పాటల్లాంటివనేమో!
రానారె చెప్పారు…
కాదు శ్రీరామ్, వాళ్లు జానపదాలనే చెప్పారు. సినిమాల్లో స్త్రీ పాత్రలు పాడిన జానపదాలు దొరకలేదో ఏమో అలాంటివి పాడించారు. "ఏరువాక" సరిగ్గా సరిపోతుంది. అలాంటివి ఇంకేమైనా గుర్తొస్తున్నాయా?
అజ్ఞాత చెప్పారు…
లేకేం, ఛాంగురే .. ఛాంగురే బంగారు రాజా... ఉంది, జిక్కి గారు పాడారు.

గోదారి గట్టుంది... గట్టుమీన పిట్టుంది ...సుశీల గారిది
S చెప్పారు…
పాడే పాటలొక్కటే కాదు.... ఈ డాన్స్ ప్రోగ్రాంలలో కూడా కొన్ని అసభ్యంగా అనిపించే పాటలకి కూడా డాన్సులు చేస్తూ ఉన్నారు పిల్లలు, యువతీ యువకులు కూడానూ... నాకు అర్థం కానిది ఏమిటి అంటే - పిల్లలు సరే, అర్థం కాలేదు ఏమో అనుకుందాం (ఈ కాలప్పిల్లలు బాగా ముదిరిపోయారు కనుక ఆ అవకాశం లేదు. అయినా..అనుకుందాం)... మరి ఆ యువతరం సంగతో? అలాంటివి పాటలు/నృత్యాలు - ఎలా చేస్తారో అర్థం కాదు నాఖు... ఒకటి మాత్రం అర్థమైంది..సినిమాల్లో అవి చూసినప్పుడు ఎందుకు ఎప్పుడు చూసినా ఇలాంటివే ఉంటున్నాయి ఈ మధ్య అనుకునే దాన్ని ఎప్పుడూ. కారణం ఇప్పుడు అర్థమైంది... జనాల నుంచి అంథ మంచి స్పందన మరి!!
S చెప్పారు…
కొంత వరకూ సంబంధం ఉన్న మరో సంగతి: మా వీథి లో ఓ అపార్ట్మెంట్ లో వినాయక చవితి స్పెషల్ అక్కడి పిల్లల రికార్డింగ్ డాన్స్. నేను అటుగా వెళుతూ చూసినప్పుడు అక్కడ ఓ పిల్ల వినాయకుడి విగ్రహం ముందు డాన్స్ చేస్తోంది..ఏ పాటకి అనుకున్నారు - "ఓరుగల్లు కే పిల్లా..." పాటకి! ఏమన్నా సంబంధం ఉందా వినాయకుడికి, ఆ పాటకి???
రానారె చెప్పారు…
వికటకవులు మంచి పాటలు సూచించారు. ఇంకో రెండుమూడునాలుగైదు చెప్పగలరా?
కొత్త పాళీ చెప్పారు…
ఛాంగురే పాట కొంచెం హెచ్చుస్థాయి శృంగారంతో నిండినది .. పిల్లలకి తగినది కాదు.
కూచిపూడి ప్రదర్శనల్లో జానపద నృత్యంగా తరచూ ప్రదర్శించేది "మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో". ఇంకో మంచి పాట "పాండవులు పాండవులు తుమ్మెద".
సినిమాల్లో కనిపించే చాలా జానపదగేయాలు యుగళ గీతాలే. మావ మావా మావా, గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఇలాగ
Ramani Rao చెప్పారు…
మంచి సందేశం + జానపదం కావలంటే.... "టౌను పక్కకెళ్ళద్దురో డింగరి" చెప్పుకోవచ్చు.. మీరొకటి గమనించార.. మొత్తం ఈ సరిగమప... ఎపిసోడ్స్ లో పిల్లలచేత పిల్లల పాటలు తప్ప మిగతా అన్నీ పాటలు పాడించారు... మంచి పాటలు చెప్పుకోదగ్గవి చాల వున్నాయి... జానపదాలని కాదు....

ఉదా: "మహాబలిపురం..మహాబలిపురం.."
" గోవుల్లు తెల్లన.. గొపయ్య నల్లన... గోధూళి ఎఱ్ఱనా..." ..."
"అడిగానని అనుకోవద్దు .. చెప్పకుండ
దాటేయద్దు ..స్వామి..ఏమిటీ రహస్యం....
ఇలాంటి పాటలు లెక్కలేనన్ని... ఏదయిన స్కూల్ వార్షికాలు కాని ఏ ప్రతేక కార్యక్రమమైనా.. "ఇప్పటికింకా.. నావయసు అంటూ పాడడానికి ఉత్సాహం చూపే పిల్లలు మంచి మర్యాదకరమైన పాటలు పాడడనికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేకపొతున్నారు..
teresa చెప్పారు…
మా ఊరి తెలుగు సంఘ కార్యక్రమాల్లోఅయితే, By popular demand, అ అంటే అమలాపురం లాంటి పాటలకి జానెడు జాకెట్టూ,బెత్తెడులంగాతొ మూడేళ్ళ పిల్ల, నాలుగేళ్ళ పిల్లాడూ చేసే డాన్సులే జనాదరణ పొందుతాయి ఈలలూ, గోలలూతో. భరతనాట్యమూ, శాస్త్రీయ సంగీతం లాంటీవెప్పుడయినా పొరబాటునొస్తే ప్రెక్షకులా కాసేపూ బ్రేక్ తీస్కుని బయటికెళ్ళి సొషలైజ్ చేస్కుంటారు.
అజ్ఞాత చెప్పారు…
రానరె గారు, మర్యాదకర జానపద గీతాలు తెలుగు లొ అసలే లేవనటం సరి కాదు, మన నిర్వాహకులు పాడించడానికి ఆసక్తి చూపించకపోయి ఉండొచ్చు. దానికి ఒక కారణం చౌకబారు పాటలనే ఇష్టపడే ప్రేక్షకులు కూడా..

మంచి జానపదాలకు ఉదాహరణగా

'ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల ఱెడూ
'ఊరేది పేరేది ఓ కలువ ఱేడా..'
- రాజమకుటం

పరుగులు తీయాలి
పిలిచిన బిగువటరా
-మల్లిశ్వరి

రారోయి మా ఇంటికి
-దొంగ రాముడు

ఆల్లవాడే...
-చిరంజీవులు

హైలో హైలెస్స హంస కదా నా పడవ
-భీష్మ

ఇంక చాలా ఉన్నాయి..

ఎప్పటి టపా కో ఇప్పుడు సమాదానం ఇస్తున్నందుకు క్షమించాలి, ఇప్పుడే చూడడం తటస్తించింది

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం