కిమ్ కర్తవ్యమ్

ముఖ్యమంత్రి: "పాకిస్థాను, బంగ్లాదేశులలో మనకు నిఘావ్యవస్థలేదు. ఈ వైఫల్యం పోలీసుయంత్రాంగానిది కాదు."
-- నేరం నాది కాదు, ఆకలిది.

ప్రధానమంత్రి: "తీవ్రవాద బాధితులకోసం శాశ్వత సహాయ నిధిని ఏర్పాటు చేస్తా."
-- ఏంజేస్తున్నావే కోడలా? ఉలగబోసి మల్లా ఎత్తుకుంటాండా అత్తమ్మా.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల అధికారి: "రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి."
-- మొక్కై వంగనిది మానై వంగునా!?

"ఈ ఘోరకలికి ముఖ్యమంత్రిగా నేను నైతికబాధ్యత వహిస్తున్నాను."
-- 'నీతి' బీరకాయలో 'నైతికం'

"సంయమనం పాటించినందుకు ముఖ్యమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు."
-- సర్కసులో మచ్చికైనందుకు అడవిజీవాలకు రింగుమాస్టారి ఆనందం

ప్రతిపక్షం: "వైయ్యెస్, గద్దె దిగిపో!"
-- తాత పోతే బొంత నాది

ప్రజారక్షణ విపత్కరమైన పరిస్థితిలో పడినప్పుడు రక్షకుల వ్యవహారశైలి ఇది. తప్పించుకోజూడటం ప్రభుత పలాయనవాదానికి చిహ్నమైతే, దాన్ని ఆపి, నిలబెట్టి ప్రజాక్షేమం దిశగా మార్గదర్శనం చేయవలసిన ప్రతిపక్షం వహిస్తున్న పాత్ర 'గోతికాడ నక్క'. అందరూ అందరినీ వేలెత్తి చూపుతున్నారు - నాతో సహా. న్యూయార్కు, లండనులలో కూడా జరిగాయి సరే, వాళ్ల పాలనాయంత్రాంగమూ ప్రతిపక్షమూ ఇలాగే ప్రతిస్పందించారా?

లోక్‌సత్తా: "సంకుచిత ప్రయోజనాలకూ, ప్రతిపక్షాలపైన నిఘాకూ అధికార పక్షం పోలీసులను వినియోగించకుంటే శాంతిభద్రతలకు ఢోకా ఉండదు."


కాస్త ప్రయోజనకరమైన మాట. లోక్‌సత్తా మాటను ప్రభుత్వానికి వినిపించేలా చేయవలసిన బాధ్యతను మనం ఎలా నెరవేర్చగలం? ఓటు మాత్రమే మన ఆయుధం కాదు. అది కేవలం ఇంకో శునకాన్ని కనకపు సింహాసనంమీద కూర్చోబెడుతున్నదంతేకదా?. ప్రజలే నేరుగా ప్రతిపక్షపు బాధ్యతను నిర్వహించవలసిన పరిస్థితి. వ్యక్తిగా కానీ సమిష్టిగా గానీ మనం చేయవలసినది, చేయగలిగినది ఏమిటి?

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
చాలా బాగా సామెతలని జతకల్పారు.నిజం చెప్పాలి అంటే, మన లాంటి వాళ్ళు వొటు వెయనంత వరకు లొక్ సత్తా లాంటి పార్టి లకు కాలం లేదు.
కొత్త పాళీ చెప్పారు…
బాగా చెప్పావ్.:-)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం