జేజేలు - బొటనవేలు
వాలీబాల్ అనేది జట్టుగా ఆడవలసిన ఆట. ఆ జట్టులో ఒకడికి స్వార్థం ఉందంటే ఇంకొకడికి బొటనవేలు విరుగవచ్చును. లేదా విరిగినంత పని జరగొచ్చును. ఆ ఇంకొకడిని నేనే కాబట్టే ఈ బాధ. మా జట్టులో ఒక పుణ్యాత్ముడు కొత్తగా వచ్చి చేరాడు. పుణ్యాత్ముడికి ఇంతకుముందెప్పుడూ ఈ ఆట ఆడిన అనుభవం లేదు. ఆమాటకొస్తే ఏ ఆటా ఆడిన అనుభవం లేదు. అక్కడే వచ్చినట్లుంది చిక్కు.
ఒకటిన్నరేళ్ల ముందు నేనూ మొదటిసారిగా వాలీబాల్ ఆడాను. నేనూ మొరటుగానే మొదలెట్టాను. తోటి ఆటగాళ్లు మరియు ప్రత్యర్థులు నా ఆటను మెరుగుపరచుకోవడం గురించి ఏ సలహా చెప్పినా కళ్లకద్దుకొని దానిగురించి ఆలోచించి ఆటకు దిగే ముందు కాసింత సాధనకూడా చేసి త్వరగానే "నేనూ మార్గదర్శిలో చేరాను". అనగా వీడుంటే మనం ఓడిపోతాం అనే స్థాయి నుంచి తొందర్లోనే ఫరవాలేదు అనే స్థాయికొచ్చాను. అనుభవానికి కాస్త మెరుగులు పెట్టుకొంటూ కేంద్రంలో (వెనుక వరుస మధ్య స్థానంలో ముఖ్యంగా ) బాగా ఆడగలననిపించుకొన్నాను - ఏ చెట్టూ లేనిచోట ఆముదం చెట్టు మహావృక్షమన్నట్లుగా. నాతోపాటే చేరిన మిగతా జనాలు కూడా వివిధ ఇతర స్థానాల్లో మా స్థాయిలో నిపుణులుగానే తయారయ్యారు.
ఆట రంజుగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో కొంత పాతనీరు పోయి కొత్తనీరు చేరింది. ఈ కొత్తనీటిలో కొట్టుకొచ్చినవాడే మిస్ఠర్ పుణ్యాత్మా. చేతులు అలా గాల్లోకి ఊపేస్తుంటాడు. అలా చేస్తే చెప్పిన మాట వింటుందా బంతి? కొన్నిసార్లు మాత్రం ఆశ్చర్యకరంగా బ్రహ్మాండంగా అందిస్తుంటాడు. అప్పుడు నాతోపాటుగా అందరికీ అభిమాన పాత్రుడైపోతాడు. కానీ ఆటలో టెక్నికాలిటీ అనేదొకటి ఏడుస్తుంది కదా, అతనికది బొత్తగా ఉండదు. పరమ చిరాకును కలిగించే విషయమేమంటే ఎవ్వరిమాటా వినడీ సీతయ్య. ఆయనకంటూ ఒక సొంత ఎజెండా పెట్టుకుని, జట్టును తృణప్రాయంగా భావిస్తూ, స్వంత పథకం ప్రకారం ఆడుతూ ఉంటాడు. అదైనా సరిగా ఆడతాడా అంటే - ఆయనవద్దకు బంతి నేరుగా చేరిన పక్షంలో అయితే సరే. లేదో, అది తనదారి తాను చూసుకోవలసిందే.
అలాగకాదు ఇలా - అని చెప్పే వారు ఉన్నారు. "చెప్పిన వారు చెప్పిననూ, వినెడు వారి కించుక వివేక ముండవలదే!" అన్న అతిశయం.
అనుభవజ్ఞులైన ఆటగాళ్ల మాటను అతడు వినకపోతే జరిగే నష్టం కేవలం మా జట్టు ఓడిపోవడమే అయితే భరించవచ్చు. ఆయన పథకం జట్టు పథకంతో శిఖరాగ్ర సమావేశం జరిపినప్పుడే మాకు (ముఖ్యంగా నాకు) నష్టం. కారణం - అతని పక్కస్థానంలో నిలబడి ఆడేది నేను కావడమే. అతడు భారీ కాయుడు, ఆ కాయంపట్ల తగుమాత్రం అదుపులేనివాడు కావడం కూడా నేనీ టపా రాయడానికి గల కారణాల్లో ఒకటి.
విషయమేమిటంటే, వీలైనన్ని ఎక్కువమార్లు బంతిని అందించి, సెహబాసులందుకోవడం అతని బలహీనత. అందులో భాగంగా ఒక మూల నున్న తన స్థానాన్ని ఖాళీగా వదిలి ఎప్పుడూ నా పక్కనే ఉండటం, ఎన్ని సార్లు చెప్పి చూసినా వినకపోవడం, నాతో ఢీకొనడం, నేను సులభంగా ఎత్తగల (వలసిన) బంతులను మధ్యలోనే అపరిపక్వంగా చేతులుపెట్టి ఆటను నాశనం చేయడం, జట్టు విజయావకాశాలకు తూట్లు పొడవడం - ఇవి ఒక ఎత్తు. అత నెప్పుడూ తన స్థానాన్ని ఖాళీగా వదలడాన్ని గమనించి బంతిని అక్కడ పడవేసి సంబరాలు జరుపుకొనే ప్రత్యర్థి జట్టును చూసి షిరిడీ శాయిలాగా చిద్విలాసం చిందించడం మరో ఎత్తు. "నీ స్థానంలో నువ్వు ఆడు, నా స్థానంలో నన్ను ఆడనీ" అని ఆట్యంతమూ మొత్తుకున్న నాకు ఆ చిదానందం చూస్తే వేటకొడవళ్లూ మచ్చుకత్తులూ మదిలో మెదులేవి.
ఇదే ఒరవడి కొనసాగిస్తూ, అమ్మహానుభావుడు నిన్న నా కాలి బొటనవేలు విరిగిందేమో అనిపించేలా చేయడంతో రాత్రంతా నొప్పికి సరైన నిద్రలేక, పొద్దునుంచీ కుంటుతూ, మరికొన్నాళ్లు ఆటకు దూరంగా ఉండాలన్న చేదును జీర్ణించుకొని, లావా చల్లారిన తరువాత వచ్చిన ప్రశాంతతతో ... అయ్యా, అదన్నమాట!
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః!! ఉఫ్‌ఫ్...ఉఫ్‌ఫ్... అయ్యో..డెక్స్ ఎక్కడా!!?

కామెంట్‌లు
ఎందుకో చూసిన తర్వాత తెలుస్తుంది.
బొటనవేలు పూర్తిగా మానక ముందే మళ్లీ ఆడాను. నొప్పి పెరిగి మళ్లీ తగ్గిపోయింది. థాంక్యూ లవింగ్లీగారు.
అయ్యా విహారి మహాశయా, సాయంత్రమే మీ కోరిక నెరవేరింది. ఈసారి టార్గెట్ ఎడమకాలి వేళ్లు. ముక్కుపగిలి పెద్ద ప్రమాదమే జరగాల్సింది - నాకూ, నన్ను ఢీకొన్న మిత్రునికీ. తమ నోటివాక్కు ఫలించి బయటపడ్డాం.
నారరాజగారు, నొప్పి పూర్తిగా తగ్గకున్నా సరే ఆడకుండా ఉండటం సాధ్యం కాకుండా ఉంది. ఆటలుకూడా ఒక వ్యసనం. కదా? మీ పరిస్థితేమిటి?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.