పట్టుమని పది అనబడు టాప్ టెన్ టెల్గూ బ్లోగ్స్

వీవెన్ చెప్పిన నిబంధనల ప్రకారం, నాకు నచ్చిన వరుసలో, వెంటనే గుర్తొచ్చిన మొదటి పది తెలుగు బ్లాగులు

1. విహారి - హాస్యం సృష్టించగలగడం ఒక వరం. దానికి పాత్రుడైన సిద్ధుడీతడు.
2. కొత్తపాళి గారు తాము - విన్నవీ కన్నవీ - చెప్పే తీరు.
3. సత్యశోధన - బహుముఖములైన, ఆసక్తికరమైన విషయాలు.
4. అంతరంగం - చరసాలలో ఉన్నట్టుంటుందా? అప్పుడప్పుడూ భగ్గుమంటూంటుంది.
5. సంగతులూ సందర్భాలు - శ్రీరాముని సంగీతసాహిత్య సమలంకృతం.
6. తెలుగునేల - నాగరాజాగారి హాస్యాభిరుచి, కాసింత ఆధ్యాత్మికత మొదలైనవి
7. ఋ ౠ ఌ ౡ - రాకేశునికే ప్రత్యేకమైన శైలిలో వ్యంగ్యము, భాష, భావనలు.
8. అవీ-ఇవీ - ఏవైనా సరే చదవదగ్గవే అయిఉంటాయి.
9. నా మదిలో - తెలుగులో మొట్టమొదటి సాంకేతిక బ్లాగు. అంతటితోనే ఆగిపోలేదు.
10.కలగూరగంప - మంచి భాష. వివిధవిషయాలపై ఆసక్తికరమైన టపాలు. ఒకప్పుడు వ్యక్తిగతంగా ఉన్నట్లనిపించేది.

ఇవిగాక:
పడమటి గోదావరి రాగం - హాస్యం
తోటరాముడు - ఇది ఒక నాటుబాంబు. ఈమధ్య ఎందుకో విశ్రాంతి తీసుకొంటోంది.

ఇంకా కొన్నింటిలో అప్పుడప్పుడూ చమక్కుమనే మంచి టపాలు వస్తూనే ఉంటాయి. కానీ అవి ఇప్పుడు గుర్తుకు రావడంలేదు. వచన కవితలను ఆస్వాదించే విషయంలో నేను బలహీనుడిని. సీరియస్ రాజకీయ విషయాల్లో కూడా అంతే. అందుచేత ఆ రకమైన బ్లాగులు నా అభిమానానికి పాత్రం కాలేకపోయాయి. "ఫో బే!" అంటారా?

కామెంట్‌లు

Sriram చెప్పారు…
హహ....టాప్ టెన్ అనగానే మీకూ లంగర్ల భాష వచ్చేసిందే...టెల్గూ బ్లోగ్స్ :)
మీరు నా అంతర్జాల పట్టిక (బ్లాగు) చూసి...సలహాలు, సూచనలు ఇస్తే ధన్యున్ని అవుతాను......ధన్యోస్మి

http://bommalaata.blogspot.com

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం