ఇంటికెడితేను టీవీని పెట్టినారు!

మొన్నటిదాకా రేడియోలో సమస్యాపూరణం పద్యాలు వింటూ, "మన స్థాయి కాదులే" అనుకునేవాణ్ణి. జీవితసత్యాలనూ సన్మార్గాలనూ సరళమైన పద్యాలుగా అల్లి, పద్య ప్రక్రియను పామరుల నాలుకల మీదకు తెచ్చిన తెలుగు వైతాళికుడు మహానుభావుడు వేమన. సుజనరంజని వారి ప్రయత్నం ఇదే దిశలో ఉంది. కానీ, వారిచ్చిన సమస్యను నా స్థాయిలోనే పూరించినా ప్రోత్సహించి ప్రచురించినందుకు వారికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మరోసారి కొత్తపాళిగారికి ధన్యవాదాలు.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
అయ్యా రానారె,

మీ బ్లాగు టపాలు తక్కువవుతున్నప్పుడే అనుకున్నా ఈ కళాకారుడు ఏంటి ఇంత తక్కువ రాస్తున్నాడు వెనకలే ఎదో పెద్ద కార్యాలు నడుస్తున్నట్టున్నాయి అని. నా ఊహ నిజమే ఇలాంటి ప్రజ్ఞా పాటవ శిక్షణలు, తర్బీదులు నడుస్తున్నాయన్న మాట. భళి భళి. మొక్కవోని దీక్ష తో సాగిపోయి సాహిత్యపు మెట్లు ఎక్కుతూ దాని అందాన్ని మకరందాన్ని అందరికి అందించు.

సిలికానాంధ్ర వారి సుజన రంజని ఒక మంచి పత్రిక. వారి కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా వుంటాయి. మొన్నామధ్య కూచిభొట్ల ఆనంద్ గారితో మాట్లినప్పుడు అర్థమయింది వారి స్థాయి కి చేరుకొవాలంటే మా తెలుగు సంఘం ఎంత కష్ట పడాలో అని.

మరొక్కసారి అభినందనల జల్లులు, వర్షం, తుఫాను.

-- విహారి
spandana చెప్పారు…
మీ పూరణ అదరహో కవివర్యా!

--ప్రసాద్
http://blog.charasala.com
రాధిక చెప్పారు…
వందనాలు అందుకోండి నవ యువ కవిగారూ.
అజ్ఞాత చెప్పారు…
రానారె,

మీ సమస్యాపూరణ అదిరింది. ఇక అస్టావధానం మొదలుపెట్టండి. మీరు మరో మేడసాని వారిలా ఎదగాలి.
-నేనుసైతం
అజ్ఞాత చెప్పారు…
raanaare,

If you are in Houston why don't you attend the Texas Telugu saahitya sadassu in Dallas on 5th May? Conatct Vanguri Chitten Raju at rvanguri@wt.net or 832-594-9054 for more details or Ram cheruvu at ramteja@yahoo.com. They may even share a ride.
Sriram చెప్పారు…
congrats dude! kotta samasya poorinchadam modalettaaraa...
రానారె చెప్పారు…
ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ వందనాలు. సీ, సీప్లస్సులు, జావా, డాటునెట్టులనే నెట్టుకొస్తున్న మనకు వీటి Syntax కంటే ఎంతమాత్రం క్లిష్టం కాని ఆటవెలది Syntax పెద్ద సమస్యకాదు. భాష మన మాతృభాషేనాయె. అందరూ మా బళ్లో చేరండి. చిన్న ప్రయత్నం చేద్దాం. తమాషాగా మంచి పద్యాలు రాద్దాం.
విహారిగారు, ఇదో చిన్న ఫీటు అంతేనండి. మోజు పుట్టింది. పద్యం నేర్చుకోవాలనే ఉబలాటానికి గురువులు, సహవిద్యార్థులు -మీతో సహా- తోడయ్యారు. సాహిత్యపుమెట్లు అందరం కలిసే ఎక్కుదాం. తిరుమల కొండెక్కినట్లు సరదాగా.
ప్రసాదుగారు, రాధికగారు, రెండుపద్యాలకే నన్ను కవిని చేసి ఇమేజ్ చట్రంలో బంధించెయ్యాలని ప్రయత్నిస్తున్నారా! :))
"నేనుసైతం"గారు, అవధానం చేసేంత ధారణాశక్తి కావాలంటే నేను మరోజన్మ ఎత్తాల్సిందే! :)
Anonymous గారు, మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీకోసం ఇదే బ్లాగులో ఒక టపారాస్తున్నాను.
శ్రీరామా, ఈ మధ్య కొన్ని గాయాలయ్యాయి. తేరుకొంటేగానీ ఇంకో పద్యంమీదకో టపామీదకో మనసు మళ్లేలాలేదు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం