మహాపాపము - దైవకార్యము

యాభై అయిదు మాటల్లో కథ
**** **** **** **** ****

"తార్చడం మహాపాపం, మూర్ఖుడా!"
"..........."

"దేవుడు తొలిసారి మనుషులను సృష్టించినప్పుడు పాపాత్ములున్నారా స్వామీ?"
"లేరు"

"ఒకానొక రోజు వాళ్లలో ఒకావిడకు ఎంతకూ తిండి దొరకలేదుట. పాపం, ఆకలికి తట్టుకోలేకపోయింది."
"ఊఁ..."

"వాళ్లలోనే అదృష్టవంతుడొకడు తిండి సంపాదించాడు. వాణ్ణడిగింది."
"ఊఁ..."

"వాడిచ్చాడు. ప్రతిఫలమడిగాడు. అయిష్టంగానే అంగీకరించింది."
"ఊఁ..."

"సృష్టించి, కడుపు మాడ్చి, చోద్యం చూసిన దేవుడే నాకు గురువు."
"ఊ..."

"మహాపాపమే... దైవకార్యమున్నూ."
"ఊ...!?"

"నా వాళ్లకు తిండి సంపాదించడానికి, నేను ఇతరులను ఉపయోగిస్తా."
"ఊ..."

"దేవుడెందుకు చేశాడో!"
"...డో!?"

కామెంట్‌లు

cbrao చెప్పారు…
యాభై అయిదు మాటల్లో కథ - ఈ ప్రక్రియ లో క్లుప్తత ఉండి కొద్ది వాక్యాలలో ఒక పెద్ద కథ చదివిన అనుభూతి కలిగింది. చిన్నదైనా, పెద్దదైనా కథకు పాఠకుడికి చివరన కలిగించే అనుభూతే ప్రాధాన్యంగా కథ బాగుంది, ఫరవాలేదు లేక బాలేదు అని తేల్చుకుంటాం.మొదటి కథ అన్నారు.మరి కాదరయ్య కథలు మర్చిపోయారా? మీకు మొదటి గుర్తింపు ప్రజలలో కలిగించిన కాదరయ్యను మరిస్తే ఆయనూరకుంటాడా?
spandana చెప్పారు…
రానారె,
"నా వాళ్లకు తిండి సంపాదించడానికి, నేను ఇతరులను ఉపయోగిస్తా" -- ఇది నాకర్థం కాలేదు!
కథ క్లుప్తంగా గంభీరంగా వుంది. కానీ చివర అర్థం కాకపోవడంతో మెలిక అర్థం కాలేదు!

--ఫ్రసాద్
http://blog.charasala.com
రానారె చెప్పారు…
రావుగారు, మీ వ్యాఖ్యకు చాలా సంతోషం. మొదటికథ అంటే, తెలుగు బ్లాగోళంలో, 55 మాటల్లో కథ రాయమని కొత్తపాళిగారు అన్నారు. ఆ వర్గంలో ఇది మొదటిది. ఇక కాదరయ్య కథలు, కథలు కావు. అనుభవాలు, జ్ఞాపకాలు.
రానారె చెప్పారు…
ప్రసాద్‌గారు, కథమొదటి వాక్యంలోనే అతడు చేసే పనేమిటో తెలిసిపోతుందికదా. తనవాళ్లను పోషించడానికి అతడుపయోగించే ఆ ఇతరులెవరో చెప్పనవసరంలేదుకదా అని ...
రాధిక చెప్పారు…
చాలా బాగుంది. కధల్లో క్లుప్తత చాలా కష్టం.యండమూరి అంతటి వాడే తన నవలల్లో రెండు పేజీలు తగ్గిద్దామనుకుంటే కుదిరేది కాదట.అలాంటిది ఇంత క్లుప్తం గా పెద్ద భావం చెప్పడం అస్సలు ఊహించలేకపోతున్నాను.మీరు రాసారంటే పర్లేదు కాదరయ్య కధల అనుభవం వుందికాబట్టి రాయగలరనుకోవచ్చు.కానీ ప్రవీణ్ గారు... అదరగొట్టేసారు. యువత రాజకీయాల్లోకి రావాలి అన్నట్టు కొత్త పాళీ గారు యువత సాహితీ రంగం లోకి రావాలని అంటున్నారు.ఆయన చెప్పడం,మీరు చెయ్యడం..........వావ్..
రానారె చెప్పారు…
ధన్యవాదాలు రాధికగారు.
చదువరి చెప్పారు…
కథ బాగుంది. మొదటి వాక్యం ఇలా ఉంటే కథ మరింత బాగుండేదేమో! "కూతురు ఒళ్ళమ్ముకుంటుంటే చూస్తూ ఉన్నావా పాపీ?"

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము