నేనింతవరకూ పాతాళభైరవి పూర్తిగా చూడలేదు. నాదగ్గరున్న పాత సీడీలను సర్దుతుండగా కంటబడిందీరోజు. చూద్దామని కుదురుగా కూర్చున్నాను. సెన్సారువారి యోగ్యతాపత్రం తరువాత విజయావారి పతాక. యుద్ధభేరి మోగుతుండగా రెపరెపలాడే జెండాపై కపిరాజు. మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్లను ఎన్నోసార్లు చూసివుంటానుగానీ ఈ 'పతాక' సన్నివేశంలో మాత్రం ప్రతిసారీ కపిరాజును చూడటంతోనే సరిపోయేది. రెపరెపలాడే ఆ జెండా చుట్టూ ఒక సంస్కృత సూక్తము వున్న సంగతిని ఈరోజు గమనించాను. సినిమాను అక్కడ ఆపి, అదేమిటో చదివాను "क्रियासिद्धि स्सत्वे भवति". క్రియాసిద్ధి స్సత్వే భవతి - విడివిడిగా ఒకో పదానికి అర్థం సుమారుగా తెలుస్తోందిగానీ మొత్తానికి భావమేమిటో అందలేదు. గూగులమ్మనడిగాను. "క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం! న ఉపకరణే" - ఈ సుభాషిత సారం విజయావారి నినాద మయ్యిందన్నమాట. "మహానుభావుల విజయం/సత్తా వారి స్వశక్తి/క్రియల వల్ల సిద్ధిస్తుందిగానీ, వాడే ఉపకరణాల వల్ల కాదు" - అని అర్థం చేసుకోవచ్చు. విజయావారి విజయాలను చూస్తే ఇది వారేదో ఫ్యాన్సీగా పెట్టుకున్న నినాదం కాదనిపిస్తుంది. పూర్తి శ్లోకం ఇదీ: విజేతవ్యా లంకా చరణతరణీయా జల
భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూణ కో దండకళా రప్రచండ భుజతాండవ కీర్తికి రామ మూర్తికిన్ రెండవ సాటి దైవమిక లే డనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదమ్ము లజాండము నిండ మత్త వేదండమునెక్కిచాటెదను దాశరథీ కరుణా పయోనిధీ! చిన్నప్పుడు మా నాయన నేర్పిన పద్యం ఇది. అర్థంతో సహా నేర్పారు కాబట్టి ఇంకా గుర్తుంది. పద్యం నాలుగు పాదాలూ రాశానుగానీ, పాదాలను ఎక్కడబడితే అక్కడ అమ్మతోడుకూడాలేకుండా అడ్డంగా నరికేసినట్లున్నాను. ఇలా కాదుగాని ఒక మహాప్రయత్నం చేసి ఛందోబధ్దంగా నాలుగు పాదాలు ఒకేపొడవులో వుండేట్టుగా నిలబెట్టాలని మొదలుబెట్టాను. మనం చిన్నప్పుడు అంటే తొమ్మిది, పదవ తరగతుల్లో చదువుకుని మరచిపోతామేమో నని కొంచెం బెంగపడిన ఛందస్సు పునరావలోకనం. పద్యంలో ఒక తప్పున్నా ఛందస్సు చెడిపోతుంది కదా. నాకు తెలిసి ఈ పద్యం నేను తప్పులు లేకుండా రాసినానని గట్టి నమ్మకం. ముందుగా - "యమాతారాజభానసలగం" అనుకొన్నాను. ఎక్కడో విన్న వాసన తగులుతోందా? లేక ఏమిటిది కపాలమాంత్రికుని మహామంత్రం లాగ వుందే అంటారా? తెలుగు వర్ణమాల నేర్చుకోవడంలో ఓనమాలు ఏమిటో (ఈ కాలంలో అఆఇఈ ఏమిటో), తెలుగు ఛందస్సు నేర్చుకోవడంలో "యమాతారాజభానసలగం" అల
వేదాల్లో సైన్సును వెతకండిగానీ సైన్సులో వేదాలను వెతక్కండన్నాడొక పెద్దాయన. అది చేతకానప్పుడు ఇదైనా చెయ్యాలిగదా? ఇప్పుడు నేను చెయ్యబోతున్నది ఆలాంటిదే. 2009 ఫిబ్రవరిలో కొత్తపాళీగారి బ్లాగులో "స్థితప్రజ్ఞత" అనే టపా వచ్చింది. అందులో ముఖ్యమైనదిగా నాకు తోచిన వాక్యం - "క్రమశిక్షణతో కూడిన ఒక వైరాగ్యాన్ని పెంపొందించుకో గలిగితే తదనుగుణంగా మన అంతశ్శక్తిని నిక్షేపించుకుని, దాచుకుని, అంతిమంగా కీలకమైన లక్ష్యసాధనకి వినియోగించుకోవచ్చు." 2010 ఫిబ్రవరి వచ్చాక చూసుకుంటే, గడచిన యేడాది కాలంలో క్రమశిక్షణ లేదు. వైరాగ్యం లేదు. ఇవి రెండూ లేకపోవడంవల్ల అంతశ్శక్తీ లేదు. కనీసం, అంతిమంగా కీలకమైన లక్ష్యం యేమిటో తెలుసునా అంటే అదీతెలీదు. క్రమశిక్షణా అంతశ్శక్తీ ఎంతోకొంత తిరిగి సాధించినా, లక్ష్యం ఏమిటో తెలీడంలేదు. నా లక్ష్యం ఏమిటో మీకేమైనా తెలుసా? అని ఎవరినయినా అడిగితే బాగుండదేమో. ఇంతకూ, మీకు అంతిమంగా కీలకమైన లక్ష్యం ఏమిటి? A. నాకు తెలీదు B. ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు C. అక్కర్లేదు నా కిలాగే బాగుంది D. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా E. ప్రతిరోజూ క్రమశిక్షణనూ, అంతశ్శక్తినీ సాధించడమే F. సృష్టికార్యంలో ఆ ప
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.