గ్లాసుడు బియ్యంతో బ్రహ్మపదార్థం - పరబ్రహ్మస్వరూపం

ఇన్నాళ్లూ ముగ్గురు మిత్రులం ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. మూడు లోటాల (గ్లాసుల) బియ్యం, ఏడు లోటాల నీళ్లుకలిపి గిన్నెలో పోసి మైక్రోవేవ్ఓవెన్‌లో పెడితే బ్రహ్మాండంగా అన్నం తయారయేది. ఈ రోజునుండీ ముగ్గురం మూడిళ్లు తీసుకొని ఉంటున్నాం. ఒక లోటా బియ్యం, రెండున్నర లోటాల నీళ్లు పెట్టి పరబ్రహ్మస్వరూపం కోసం ఆవురుమంటూ అరగంట సేపు ఎదురుచూడగా యం.ఆర్.ఎఫ్ టైరు లాంటి బ్రహ్మపదార్థం తయారైంది. దాన్నక్కడే పెట్టి ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లి ఎప్పటిలా మటన్‌ బిరియానీ తిని ఇంటికొచ్చి, చల్లారిన బ్రహ్మపదార్థాన్ని చెత్తబుట్టలోకి చేర్చాను. ఇదే సమస్య నా ఇద్దరు మిత్రలదీనూ. పెద్దగిన్నె మార్చి చిన్నది పెట్టి చూశాను. నీళ్లు కొంచెం ఎక్కువపోసి చూశాను.

ఎన్ని చేసినా బ్రహ్మపదార్థమేగానీ పరబ్రహ్మస్వరూపం తయారవడంలేదు. తెలిసినవారెవరైనా ఒక్క గ్లాసుడు బియ్యంతో మైక్రోవేవ్ఓవెన్‌లో మెత్తని అన్నం వండే చిట్కా చెబితే మీ సహాయాన్ని గుర్తుంచుకుంటాను.

ధన్యవాదాలు.
-రానారె

కామెంట్‌లు

నేను కొత్తల్లో మైక్రోవేవ్ తో అన్నం వండి భంగపడ్డాను. బాగానే వచ్చింది, కాని పొంగిపోయేది. ఒకసారి కేకులా అయ్యింది. కొన్ని కొన్ని పనులు కొన్ని సాధనాలతో బాగా జరుగును. కావున రైస్ కుక్కర్ (కొరియా వాళ్ళు చాలా మామూలుగా వాడతారు) వాడితిని. బ్రహ్మచారులకీ, పున:బ్రహ్మచారులకి నేను రైసుకుక్కరే వాడమని సలహా ఇస్తాను. మా అమ్మమ్మ కూడా రైసు కుక్కరే వాడేది...టటటాయ్..
ఆయినా మీరు నీళ్ళని కొద్దిగా ఎక్కువపోసారు అనిపిస్తోంది. కొద్దిగా తక్కువ పోసి, మధ్యలో అవసరమనిపిస్తే కలపండి.
అజ్ఞాత చెప్పారు…
ఒక్కరికి వండటం మైక్రో వేవ్ ఓవెన్ లో కష్టం. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ (చిన్నది) బహుశా మీకు వుపయోగపడొచ్చు. అదైతే మధ్యలో మూత తీసి చూసి చెక్ చెయ్యవచ్చు. మీరు దాంట్లో కూడా ఎపుడూ వార్మ్ కండిషన్ మాత్రం వాడవద్దు. ఎమ్.ఆర్.ఎఫ్ మీ రైసుని మరలా స్పాన్సర్ చేస్తుంది. :-)
అజ్ఞాత చెప్పారు…
amazon.comలో rice cooker అని వెతికితే చాలా వివరాలు తెలుసుకోవచ్చు. దగ్గరలో వాల్‌మార్టో, కేమార్టో, లేకపోతే టార్గెట్టో వెళితే, ఒక చక్కటి rice cooker దొరుకుతుంది. ఒక కప్పుకు రెండున్నర కప్పుల నీళ్ళు (బియ్యాన్ని బట్టి లెక్క మారుతుంది) పోసి మీట నొక్కితే అన్నం వండి నీకోసం ఎదురు చూస్తుంది. స్వీయ అనుభవం.
చేతన_Chetana చెప్పారు…
Microwave లో పెట్టుకునే rice cooker walmart లో దొరుకుతుంది. 1 glass rice, 2 glasses water 15-20 min = మీకు కావాల్సిన పరబ్రహ్మస్వరూపం. నేను దీన్నే వాడతాను.. అన్నిరకాలుగా చాలా అనుకూలం, సులువు. Ex: http://www.amazon.com/Maxi-Aids-Microwave-Rice-Cooker/dp/B00011R41Q/ref=pd_bbs_sr_1/103-4995549-1006255?ie=UTF8&s=hpc&qid=1172859510&sr=8-1
రానారె చెప్పారు…
సుధాకర్, కొవ్వలిగార్లు: అటునుంచి నరుక్కురమ్మన్నారా!

నాగరాజా గారూ, మీ సలహా బాగుంది. థాంక్యూ.

చేతనగారు, నాకు చాలా పని తగ్గించేశారు. మీరు చెప్పిన కుకర్ షిప్‌మెంట్‌లో ఉంది. ఈరోజు అందాలి. థాంక్యూ వెరీమచ్. వచ్చాక వండిచూసి మళ్లీ థాంక్స్ చెబుతాను.
చేతన_Chetana చెప్పారు…
shipping దాకా ఎందుకు వెళ్ళారండీ?? 9.94 పెడితే walmart లోనే దొరికేదిగా. anyway, ఎలగోలాగ మీ సమస్య తీరినందుకు సంతోషం.
రానారె చెప్పారు…
కుకర్ వచ్చిందిగానీ, బియ్యం:నీళ్లు:సమయం:మైక్రోవేవ్‌శక్తి వీటి నిష్పత్తి కనుక్కోవడానికి ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాను. మరో సంగతి - రెండుగ్లాసుల బియ్యం నాలుగుగ్లాసుల నీళ్లతో ఉడికే సరికే ఓవెన్ అడుగంతా నీళ్లతో నిండిపోతోంది. కుకర్ లేకుండానే బాగుందనిపించినా, మనం అంత తొందరగా వదిలేరకం కాదుగదా. కాకపోతే, 15నిముషాల్లో అన్నం తయారౌతోంది. నేనెప్పుడూ ఆకలి విపరీతమయ్యాకే వంటకుపక్రమిస్తానుగనక ఇది చాలా ఉపయోగం.
రానారె చెప్పారు…
మొత్తానికి మొన్న అన్నం సరిగా కుదిరింది. 10 నిముషాల్లో తయారైపోయింది. కృతజ్ఞతలు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం