అధ్యక్షా! (YSR) ఇక్కడొక మాట చెప్పుకోవాలీ. మా ఆఫీసులో ఒక రోజు ఉన్నట్టుండి ఆడవాళ్లంతా చీరల్లో వచ్చారూ. ఏదో తేడాగా ఉందే అని నా సీనియర్ టీంమేట్ ఒకామెను విషయమడిగితే "ఈ రోజు విమెన్స్‌డే, తెలీదా" అన్నారధ్యక్షా. "అయితే మీ ఐక్యతా, సత్తా, చూపడం కోసరం ఇలా చీరల్లో వచ్చారా, బాగుంది, ఇంకేం చేస్తున్నారూ!?" అనడితే, "టీ టైం నుండి మీటింగ్. ఓన్లీ లేడీస్. మీరు మాత్రం పనిచెయ్యాల్సిందే. తర్వాత ఫోటోలు తీసుకొంటాం. తర్వాతేముందీ బస్సులెక్కి ఇళ్లకుపోతాం" అని ఆంగ్లంలో సమాధానం. నేను మొహం మాడ్చుకొని, "అంతేనా!! నిజంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకోసం కాదన్నమాట. ఆల్రెడీ ఆనందంగా ఉన్నవాళ్ల ఆటవిడుపన్నమాట ఈ మహిళా దినోత్సవం", అన్నట్టుగా అంటే - "అరె ఏ కౌన్ రే, ఏ కౌన్ సా జమానాకా రే, భగవాన్, ఇస్ కో లేజాకే జరా సమ్‌ఝవోనా" (నాకు హిందీ రాదు, తమాషాగా ఉంటుందని నాకొచ్చిన హిందీ రాశాను) అన్నట్లు ఆ చుట్టుపక్కలున్న మరికొందరు చీరాంబరధారులైన మహిళామూర్తులు ఒకరి మొహాలోకరు చూసుకొని నన్నీసడించుకొన్నారు. ఆ తరువాత నాతోటివారలైన ఇతర పురుష పుంగవులు - "ఈ పిల్ల చీరలో భలే ఉందికదా!, ఆవిడ చీరలో ఇంతకుముం...