విజయా వారి విజయపతాక
నేనింతవరకూ పాతాళభైరవి పూర్తిగా చూడలేదు. నాదగ్గరున్న పాత సీడీలను సర్దుతుండగా కంటబడిందీరోజు. చూద్దామని కుదురుగా కూర్చున్నాను. సెన్సారువారి యోగ్యతాపత్రం తరువాత విజయావారి పతాక. యుద్ధభేరి మోగుతుండగా రెపరెపలాడే జెండాపై కపిరాజు. మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్లను ఎన్నోసార్లు చూసివుంటానుగానీ ఈ 'పతాక' సన్నివేశంలో మాత్రం ప్రతిసారీ కపిరాజును చూడటంతోనే సరిపోయేది. రెపరెపలాడే ఆ జెండా చుట్టూ ఒక సంస్కృత సూక్తము వున్న సంగతిని ఈరోజు గమనించాను. సినిమాను అక్కడ ఆపి, అదేమిటో చదివాను "क्रियासिद्धि स्सत्वे भवति". క్రియాసిద్ధి స్సత్వే భవతి - విడివిడిగా ఒకో పదానికి అర్థం సుమారుగా తెలుస్తోందిగానీ మొత్తానికి భావమేమిటో అందలేదు. గూగులమ్మనడిగాను. "క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం! న ఉపకరణే" - ఈ సుభాషిత సారం విజయావారి నినాద మయ్యిందన్నమాట. "మహానుభావుల విజయం/సత్తా వారి స్వశక్తి/క్రియల వల్ల సిద్ధిస్తుందిగానీ, వాడే ఉపకరణాల వల్ల కాదు" - అని అర్థం చేసుకోవచ్చు. విజయావారి విజయాలను చూస్తే ఇది వారేదో ఫ్యాన్సీగా పెట్టుకున్న నినాదం కాదనిపిస్తుంది. పూర్తి శ్లోకం ఇదీ: విజేతవ్యా లంకా చరణతరణీయా జల...
కామెంట్లు
కలియుగ శబరి :కడప నుంచి తెప్పించాను"
దొంగ రాముడు : కడప నుంచి తెప్పించావా ? అంటే బాంబులా ?
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే హాస్య కణికలు ఈ చెణుకులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.