ఈ దినమ్‌మ్ మన కళాశాల దినమ్

ఈ దినమ్‌మ్ పరమ బోరింగు దినమ్.
నిన్న రాత్రి - టైరులో గాలి నిలవడం లేదని వాల్‌మార్ట్‌కు తీసుకుపోతే అంతా బాగుందని గాలి నింపి పంపించేశారు.
పొద్దున్నే ఆఫీసుకెళ్లి కారు పార్క్ చేసి చూస్తే కుడివైపు ముందుటైర్‌లో గాలి బొత్తిగా లేదు.
మా టీం మేట్ ఒకావిడ చాలా విచారంగా ఉంది, పోయిన వారం వాళ్లనాన్న చనిపోయారని. జోకులేసే వాతావరణం లేదు.
ఆఫీసులో పనే లేదు. అలా అని బొత్తిగా లేకుండానూలేదు. సరైన పని లేకపోతే పరమ బోర్.
సాయంత్రం కొంత ముందే పార్కింగ్‌లాట్‌కొచ్చి టైర్ మారుద్దామంటే కారిచ్చిన కుదుపుకు జాకీ వంకీలు తిరిగిపోయింది.
మహానుభావుడూ ఆపద్భాంధవుడూ అయిన మరో మిత్రుడు వచ్చి ఈ విషయంలో సహాయం చేశాడు.
అతనిసాయంతోను, అతని జాకీసాయంతో ఈ రోజు సాయంత్రం మరో టైర్లరిపేరు షాపుకెళ్తే వాడూ అదేమాట.
సమస్యేమీలేదని గాలినింపి పంపించేశాడు.
అక్కడినుంచీ ఇండియన్‌స్టోర్‌కు వెళ్లి తిరిగొస్తూ వస్తూ ఇంటి సమీపానికొస్తున్నామనగా, హైవే నుండి ఎగ్జిట్ అవుతూ లేన్ మార్చబోయి కర్బ్ ఎక్కించబోయాను. కొద్దిలో తప్పింది. మా ఆపద్బాంధవుడు అలర్టయి నన్నూ హెచ్చరించి తప్పించినాడు. వెంటనే నిద్రపోయి ఈరోజును ఇంతటితో ముగించేయాలి. ఏదోలోకంలో వుండి బండినడుపుతున్న నేను అక్కడే వుండిపోవాల్సివచ్చేదేమో ఖామెడీగా.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
కలవరం వలదు రానారె.
ముందు వుండును ముచ్చటైన మంచి రోజులు.

విహారి
రానారె చెప్పారు…
ముచ్చట అయిన మంచిరోజులు! సంతోషము స్వామీ!!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము