ప్రభుతకు హైకోర్టు మెట్టేటు
న్యాయవాది ఎస్. జనార్ధన్ గారికి ధన్యవాదాలతో ఈనాడులో ఈనాటి సంతోషకరమైన వార్త:
*** *** *** *** ***
సమ్మెలు, రాస్తారోకోలను అనుమతించొద్దు
ప్రధాన కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు ఆదేశం
పార్టీల తీరుపై ఆగ్రహం, నోటీసులు జారీ
హైదరాబాద్-న్యూస్‌టుడే(ఫిబ్రవరి 12, 2007) రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు రహదార్లపై సమ్మెలు, రాస్తారోకోలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై నిర్వహిస్తున్న సమ్మెలు, రాస్తారోకోలను అడ్డుకోవడంలో ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న, తీసుకోబోయే చర్యల గురించి కౌంటరు దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. ఇందుకు రెండువారాల గడువిచ్చింది. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా సమ్మెలు, రాస్తారోకోలకు అనుమతులివ్వరాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు వివిధ పార్టీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జనజీవనానికి ఇబ్బంది కల్గిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ, ప్రభుత్వానికి మద్దతుగా గానీ పార్టీలు సమ్మెలు చేయడం సరికాదని పేర్కొంది. బంద్‌లు, రాస్తారోకోలను నిషేధించాలంటూ న్యాయవాది ఎస్.జనార్దన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారించింది. కాంగ్రెస్, తెదేపా, భాజపా, తెరాసలతోపాటు కమ్యూనిస్టు పార్టీలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను సూచించింది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన మానవహారం సంఘటనను కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. తమ తమ నిరసనలను తెలియజేసే హక్కు అందరికీ ఉందని, అలాగని ప్రజలకు ఇబ్బందులు సృష్టించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. సమ్మెలు, రాస్తారోకోల వల్ల సమయానికి వైద్యం అందక ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక అత్యవసర కార్యక్రమాలకు వెళ్లేవారికి అంతరాయం కలుగుతోందని పేర్కొంది. ఇటీవల జరిగిన మానవహారం వల్ల ప్రజలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపింది. మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన రాస్తారోకో తీవ్ర అభ్యంతరకరంగా ఉందని తప్పుబట్టింది. హైదరాబాద్‌లో రాస్తారోకోలను నిషేధించామని, నిరసనలు ఏవైనా ఉంటే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులున్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సత్యప్రసాద్ కోర్టుకు తెలిపారు. అనంతరం కోర్టు విచారణను మార్చి 8వ తేదీకి వాయిదా వేసింది.

కామెంట్‌లు
విహారి
http://vihaari.blogspot.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.