ఆ చందమామలో ఆనంద సీమలో ...


కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే...

వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా... వాని విడువ మనకు తరమౌనా చంద్రుడా...



మంచి ఫోటో తీసి చాన్నాళ్లైపోయనని కెమెరా తీసుకొని గడచిన శనివారం ఇంటి నుండి బయటికొచ్చాను.
ఇంటి బయట చుట్టూ చూస్తుంటే నీలాకాశంలో చందమామ కనబడి 'రావోయి రామనాధా...' అన్నాడు.
సాయంత్రం నాలుగుగంటల సమయంలో పొడుగాటి చెట్లమీద పొడి ఎండ పడుతుండగా చంద్రునిమీదికి కెమెరా సంధించాను.

చంద్రుని చూసి భావుకత పొంగి మంచి పాటల స్వరాల్లోకి ఒదగుతుందంటే ఒదగదూ మరి!!

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
అంత అందమైన చందమామ మవూరికి ఒస్తే ఎంత బావుంటుందో?

విహారి
http://vihaari.blogspot.com
రాధిక చెప్పారు…
అప్పటి ఆ రామునికి చిక్కని చందమామ ఇప్పుడిలా చప్పున ఈ రాముని చేతికి చిక్కినట్టుంది.చాలా బాగుంది
రానారె చెప్పారు…
విహారిగారు: మనూర్లోకూడా కనిపిస్తాడండి, పట్టుకోవడానికి కెమెరా ఉండదు. ఉన్నా, ఆ...మనూరోడేగదా యాడికిబోతాడ్లే అని పట్టించుకోం. కదా!?

రాధికగారు: మీ వ్యాఖ్య చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. ఆరాముడు అద్దం, ఈ రాముడు కటకం - ఇద్దరూ వాడింది గాజుముక్కే.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం